Begin typing your search above and press return to search.

నాని - రాజు కి వేణు హ్యాట్రిక్ ఇచ్చేనా?

ఇదే ఏడాది దిల్‌ రాజు బ్యానర్‌ లో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా నాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   6 Jan 2024 8:30 AM GMT
నాని - రాజు కి వేణు హ్యాట్రిక్ ఇచ్చేనా?
X

హాయ్ నాన్న సినిమా తో గత ఏడాదిని విజయవంతంగా ముగించిన నేచురల్‌ స్టార్ నాని ఈ ఏడాది సమ్మర్‌ చివరి వరకు సరిపోదా శనివారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదే ఏడాది దిల్‌ రాజు బ్యానర్‌ లో ఒక సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా నాని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

నాని తో ఇప్పటికే బలగం దర్శకుడు వేణు సినిమా కన్ఫర్మ్‌ అయింది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ వర్క్ జరుగుతోంది. ఇటీవలే వేణు రెడీ చేసిన స్క్రిప్ట్‌ లో నాని మార్పులు చేర్పులు చెప్పడం, దిల్ రాజు ఆఫీస్ టీం తో వేణు ఆ మార్పులు చేస్తున్నట్లు మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

బలగం సినిమా ను నిర్మించిన దిల్ రాజు టీం ఇప్పుడు నాని తో బలగం దర్శకుడు వేణు దర్శకత్వంలో ఒక సినిమాను నిర్మించేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే నాని మరియు దిల్‌ రాజు కాంబో లో ఎంసీఏ మరియు నేను లోకల్‌ సినిమాలు వచ్చాయి. ఆ రెండు కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.

రెండు విజయాల తర్వాత నాని, రాజు గారి కాంబోలో వేణు దర్శకత్వంలో సినిమా రాబోతున్న నేపథ్యంలో అందరి దృష్టి ఈ సినిమా పై ఉంది. ఈ సినిమా తో వేణు వారిద్దరికి హ్యాట్రిక్ ఇచ్చేనా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తెలంగాణ పల్లెటూరు కాన్సెప్ట్‌ తో ఒక మంచి కథ ను ఇప్పటికే రెడీ చేసిన వేణు ఆ కథను నాని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా సినిమాను రూపొందించబోతున్నట్లుగా సమాచారం అందుతోంది. నాని మరియు వేణు కాంబో మూవీ కోసం సినీ ప్రేక్షకులు ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.