Begin typing your search above and press return to search.

ఈసారైనా లేడీ సూప‌ర్ స్టార్ స‌త్తా చాటేనా?

సోలోగానూ స‌త్తా చాటుతానంటూ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. థియేట‌ర్ కి త‌న బ్రాండ్ తోనే జ‌నాల్ని ర‌ప్పించాల‌ని కంక‌ణం క‌ట్టుకుని ముందుకెళ్తుంది

By:  Tupaki Desk   |   23 Nov 2023 6:25 AM GMT
ఈసారైనా లేడీ సూప‌ర్ స్టార్  స‌త్తా చాటేనా?
X

లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార ఓవైపు స్టార్ హీరోల చిత్రాల‌తో విజ‌య‌ఢంకా మ్రోగిస్తూనే మ‌రోవైపు లేడీ ఓరియేంటెడ్ చిత్రాల‌తోనూ స‌త్తా చాటే ప్ర‌య‌త్నం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే అమ్మ‌డు న‌టించిన చాలా సోలో చిత్రాలు బాక్సాఫీస్ ముందుకొచ్చాయి. కానీ ఆవేవి పెద్ద‌గా సౌండింగ్ అయితే చెయ్య‌ని సినిమాలే. హారర్ థ్రిల్ల‌ర్ జాన‌ర్ లో లేడీ సూప‌ర్ స్టార్ చేసిన చిత్రాలు అంత‌గా మెప్పించ‌లేదు.

అయినా అమ్మ‌డు మాత్రం ప‌ట్టు విడ‌వ‌డం లేదు. సోలోగానూ స‌త్తా చాటుతానంటూ ప్ర‌య‌త్నాలు చేస్తూనే ఉంది. థియేట‌ర్ కి త‌న బ్రాండ్ తోనే జ‌నాల్ని ర‌ప్పించాల‌ని కంక‌ణం క‌ట్టుకుని ముందుకెళ్తుంది. అందుకే బాక్సాఫీస్ వ‌ద్ద ఫ‌లితాల‌తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోంది. తాజాగా ల్యాండ్ మార్క్ 75వ చిత్రం గా `అన్న‌పూర్ణి `లో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే షూటింగ్ పూర్తిచేసుకున్న సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో ఉంది.

అన్నింటిని పూర్తిచేసి డిసెంబ‌ర్ 1న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈసినిమాకి థ‌మ‌న్ సింగీతం అందించ‌డం విశేషం. ఇంత‌వ‌ర‌కూ థ‌మ‌న్ ఈ జాన‌ర్ చిత్రాల‌కు సంగీతం అందించలేదు. దీంతో థ‌మ‌న్ కిది కొత్త ర‌క‌మైన ఎక్స్ పీరియ‌న్స అనే చెప్పాలి. ప్ర‌స్తుతం ఆ సినిమా ప‌నుల్లోనే బిజీగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. తాజాగా ఈ సినిమా అప్ డేట్ ని థ‌మ‌న్ అందించారు.

ప్ర‌స్తుతం తామంతా రీరికార్డింగ్ ప‌నుల్లో క్ష‌ణం తీరిక లేకుండా ఉన్నామ‌ని...అంతా మారాథ‌న్ లో మునిగిపో యమ‌ని తెలిపాడు. అలాగే సినిమా ఔట్ ఫుట్ బాగా వ‌చ్చింద‌ని..త‌ప్ప‌కుండా టీమ్ అంద‌రి న‌మ్మ‌కం నిజం అవుతుంద‌ని ధీమా వ్య‌క్తం చేసారు. చిత్ర యూనిట్ నుంచి లీకైన తొలి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇదే. న‌య‌న‌తార ఎలాగూ ప్ర‌చారంలో పాల్గొన‌దు కాబ‌ట్టి ఆమె నుంచి ఎలాంటి పీడ్ బ్యాక్ రాదు.