Begin typing your search above and press return to search.

ఆ హీరోయిన్ అప్పుడే కోటి రాగం తీస్తుందా..?

ఒక్క సినిమాతో క్రేజ్ వచ్చే ఏ హీరోయిన్ అయినా సరే డిమాండ్ ని బట్టి రెమ్యునరేషన్ అడిగేస్తుంది.

By:  Tupaki Desk   |   28 Jan 2024 2:30 AM GMT
ఆ హీరోయిన్ అప్పుడే కోటి రాగం తీస్తుందా..?
X

హీరోల కెరీర్ స్పాన్ ఉన్నట్టుగా హీరోయిన్స్ ది ఉండదు. అందుకు ఉదాహరణ ప్రతి వారాంతరం ఒక కొత్త సినిమాతో ఇంట్రడ్యూస్ అవుతున్న హీరోయిన్స్ లో ఎంతమంది కొనసాగుతున్నారు అన్నది అర్థం చేసుకోవాలి. అందుకే హీరోయిన్స్ అంతా కూడా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకునేలా క్రేజ్ ఉన్నప్పుడే సాధ్యమైనంత వరకు లాక్కొచ్చేస్తారు. నిన్నటితరం భామలు ఏమో కానీ కొత్త భామలు మాత్రం ఇది ఒక మోటోగా పెట్టుకుని వచ్చారు. ఒక్క సినిమాతో క్రేజ్ వచ్చే ఏ హీరోయిన్ అయినా సరే డిమాండ్ ని బట్టి రెమ్యునరేషన్ అడిగేస్తుంది.

లేటెస్ట్ గా కన్నడ భామ రుక్మిణి వసంత్ కూడా అదే పద్ధతి ఫాలో అవుతుందని తెలుస్తుంది. కన్నడలో ఆల్రెడీ రెండు సినిమాలు చేసిన రుక్మిణి వసంత్ రీసెంట్ గా రక్షిత్ శెట్టితో సప్త సాగరాలు దాటి సినిమాతో మెప్పించింది. ఆ సినిమా కేవలం కన్నడలోనే కాదు తెలుగులో కూడా ప్రేక్షకాదరణ దక్కించుకుంది. సినిమాలో ప్రియ పాత్రలో రుక్మిణి అభినయం తెలుగు ఆడియన్స్ ని మెప్పించింది.

అంతేకాదు రుక్మిణి వసంత్ మీద టాలీవుడ్ మేకర్స్ కన్ను కూడా పడింది. కన్నడ భామలకు టాలీవుడ్ అంటే అదో లక్కీ సెంటిమెంట్ అన్నట్టే. కన్నడ నుంచి వచ్చిన చాలామంది భామలు తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకున్నారు. వారి దారిలోనే రుక్మిణికి కూడా మంచి ఫాలోయింగ్ వచ్చేలా ఉంది. అయితే సప్త సాగరాలు దాటి తెలుగులో రిలీజ్ అవ్వడం ఆ సినిమాతో ఒకేసారి రెండు తెలుగు ఆఫర్లు రుక్మిణికి రావడం జరిగింది. ఈ ఆఫర్లతో రుక్మిణి డిమాండ్ పెరిగింది.

అందుకే ఈమధ్య తన కోసం వచ్చిన నిర్మాతలకు కోటి దాకా రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇచ్చిందట రుక్మిణి వసంత్. తెలుగులో సినిమాలకు ఇక్కడ పెట్టే బడ్జెట్ తో పోల్చితే కోటి మరీ ఎక్కువేం కాదు కానీ తెలుగులో రుక్మిణి సినిమా ఒక్కటి కూడా రిలీజ్ కాలేదు అయినా సరే డిమాండ్ ఉంది కాబట్టి అమ్మడు అంత అడుగుతుందని తెలుస్తుంది. అదే రుక్మిణికి తెలుగులో ఒక్క హిట్ పడితే అమ్మడిని అందుకోవడం కష్టమే అని చెప్పొచ్చు.

తెలుగులో రుక్మిణి వసంత్ సినిమా అనగానే ఇక్కడ ఆడియన్స్ సూపర్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సప్త సాగరాలు దాటి సినిమా చూసిన తెలుగు ఆడియన్స్ కచ్చితంగా రుక్మిణికి తెలుగులో మంచి ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్నారు.