Begin typing your search above and press return to search.

స్టార్ హీరోతో మిస్ట‌రీ గాళ్‌.. అచ్చం వైఫ్‌లా ఉందే!

అయితే ఇటీవ‌ల అతడు త‌న మాజీ భార్య‌ జాడా పింకెట్ స్మిత్‌తో విడిపోయినా అచ్చంగా ఆమెలానే ఉన్న మ‌రొక వ్య‌క్తితో క‌లిసి క‌నిపించాడు.

By:  Tupaki Desk   |   10 Dec 2023 1:30 PM GMT
స్టార్ హీరోతో మిస్ట‌రీ గాళ్‌.. అచ్చం వైఫ్‌లా ఉందే!
X

ప్ర‌పంచంలో నంబ‌ర్ వ‌న్ పారితోషికం అందుకునే టాప్ స్టార్ గా అత‌డికి గుర్తింపు ఉంది. అత‌డు న‌టించిన సినిమాలు వ‌ర‌ల్డ్ వైడ్ సంచ‌ల‌న విజ‌యాలు సాధించ‌డ‌మే గాక‌, వేల కోట్లు ఆర్జించాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అతడికి భారీ సంఖ్య‌లో వీరాభిమానులున్నారు. అయితే అత‌డు త‌న వ్య‌క్తిగ‌త జీవితంలో కుటుంబ జీవితంలో క‌ల‌త‌ల‌ను ఎదుర్కొంటున్నాడు. అత‌డు త‌న భార్య నుంచి విడిపోయాక చాలా మాన‌సిక కుంగుబాటును ఎదుర్కొన్నాడు. దీంతో ఆవేశంలో ఒక ప్ర‌ముఖుడిని చెంప‌దెబ్బ కొట్టి ఆ త‌ర్వాత క్ష‌మాప‌ణ కోరాడు. అయితే ప‌రిశ్ర‌మ‌ను ఏలిన ఒక అగ్ర హీరో ఇలా మార‌డాన్ని అభిమానులు జీర్ణించుకోలేదు. కానీ త‌ప్ప‌దు.. ఇది విధి!!

ఇంత‌కీ ఎవ‌రు ఆ ప్ర‌ముఖ హీరో? అంటే... పేరు విల్ స్మిత్. హాలీవుడ్ స్టార్‌గా అత‌డికి బోలెడం పాపులారిటీ ఉంది. ఐ యామ్ లెజెండ్- మెన్ ఇన్ బ్లాక్ చిత్రాల్లో అతడి న‌ట‌న‌కు గొప్ప ప్ర‌శంస‌లు కురిసాయి. 2022లో అత‌డు ఉత్త‌మ న‌టుడిగా ఆస్కార్ ని గెలుచుకున్నాడు. అయితే ఓవైపు విల్ త‌న ప్ర‌తిభ‌తో ప్ర‌పంచాన్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తూనే మ‌రోవైపు కుటుంబం నుంచి తీవ్ర ఒత్తిళ్ల‌ను ఎదుర్కొన్నాడు. అత‌డు అనూహ్యంగా భర్య జాడా పింకెట్ స్మిత్ నుంచి విడిపోవాల్సి వ‌చ్చింది.

అయితే ఇటీవ‌ల అతడు త‌న మాజీ భార్య‌ జాడా పింకెట్ స్మిత్‌తో విడిపోయినా అచ్చంగా ఆమెలానే ఉన్న మ‌రొక వ్య‌క్తితో క‌లిసి క‌నిపించాడు. విల్ స్మిత్ తన భార్య‌ జాడా పింకెట్ స్మిత్‌ను పోలిన మిస్టరీ మహిళతో కనిపించాడు. డిసెంబరు 8న జరిగిన ఆర్ట్ బాసెల్ ఈవెంట్‌లో అత‌డు స‌ద‌రు మహిళతో కలిసి స్టెప్పులేయడం కనిపించింది. డైలీ మెయిల్ కి చేరిన కొన్ని ఫోటోలలో 55 ఏళ్ల హాలీవుడ్ స్టార్, అంతర్జాతీయ ఆర్ట్ ఫెయిర్ నుండి నిష్క్రమించే క్ర‌మంలో ఈ డూప్లికేట్ జాడా స్మిత్ తన మెగావాట్ చిరునవ్వుతో మెరిసింది. వారు ఒకే కారులో కలిసి ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టారు.

ఆస్కార్ విజేత విల్ స్మిత్ పిజ్జా రెస్టారెంట్ లుకాలీలో కనిపించారు. వారు ఆ రోజు కలిసి విందు సమావేశాన్ని కొనసాగించారు. భోజన సమయంలో వారి స్నేహితులు కూడా చేరినట్లు సమాచారం. ఆ త‌ర్వాత విల్ స్మిత్ మంచి ఉత్సాహంతో పార్కింగ్ స్థలం గుండా వెళుతూ కనిపించాడు. కెమెరామెన్లు అది గమనించినప్పుడు నవ్వుతూ ఉన్నాడు. అతడు కాలిబాటపై స్ప్లిట్‌లు చేస్తున్న ఆ మహిళతో క్లుప్తంగా సంభాషిస్తూ కూడా కనిపించాడు.

విల్ స్మిత్- జాడా స్మిత్ జంట 2016 నుండి విడిపోయారు. అయితే చట్టబద్ధంగా విడాకులు తీసుకునే ఉద్దేశ్యం లేదని జాడా స్మిత్ అక్టోబర్‌లో వెల్లడించిన తర్వాత విల్ స‌ద‌రు మిస్టరీ మహిళతో కనిపించారు. ఆస్కార్ వేదిక‌పై విల్ న‌టుడు క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టిన తర్వాత భార్య‌తో విల్ రాజీ కుదుర్చుకున్నారని కూడా తెలిసింది. అయినప్పటికీ జాడా స్మిత్ వారి సంబంధాన్ని 'వివాహబంధం' అని పిలవడానికి నిరాకరించింది.