Begin typing your search above and press return to search.

ఆ మెగా హీరో కోరిక సమంత తీరుస్తుందా..?

అయితే మెగా హీరో సాయి ధరం తేజ్ ఈ ప్రశ్నకు మరు క్షణం ఆలోచించకుండా సమంత పేరు చెప్పేస్తాడు.

By:  Tupaki Desk   |   27 Feb 2024 2:30 AM GMT
ఆ మెగా హీరో కోరిక సమంత తీరుస్తుందా..?
X

సెలబ్రిటీలకు సెలబ్రిటీ క్రష్ లు ఉంటారన్న విషయం తెలిసిందే. అప్పుడప్పుడు హీరోలు తమకు ఇష్టమైన హీరోల గురించి.. హీరోయిన్స్ తమకు ఇష్టమైన హీరోల గురించి చెబుతుంటారు. ఏదైనా షోలకు వెళ్తే వారి మనసు దోచిన సెలబ్రిటీ క్రష్ ఎవరనే ప్రశ్న తప్పకుండా ఉంటుంది. అయితే మెగా హీరో సాయి ధరం తేజ్ ఈ ప్రశ్నకు మరు క్షణం ఆలోచించకుండా సమంత పేరు చెప్పేస్తాడు. సమంత అంటే తనకు ఇష్టమని ఎన్నోసార్లు చెప్పాడు సాయి తేజ్.

అయితే సమంత కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే హీరోగా సినిమాలు మొదలు పెట్టిన సాయి ధరం తేజ్ ఆమెతో స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశాన్ని దక్కించుకోలేదు. సమంత పెళ్లి కాకపోతే బహుశా ఆ ఛాన్స్ ఉండేదని అనుకున్నాడు కానీ నాగ చైతన్యతో పెళ్లి అయిపోయింది. అయితే అనుకోని కారణాల వల్ల సమంత అక్కినేని ఫ్యామిలీకి దూరమైంది. చైతన్యతో విడాకుల తర్వాత సమంత చాలా సమస్యలు ఫేస్ చేసింది. ప్రొఫెషనల్, పర్సనల్ ఇలా ప్రతి దానిలో సమంత కాస్త ఇబ్బందికరమైన వాతారవణమే ఎదుర్కొన్నది.

అయితే సమంత తిరిగి ఇప్పుడు మళ్లీ ట్రాక్ లోకి వచ్చింది. సమంత వరుస సినిమాలు చేసేందుకు రెడీ అవుతుంది. ఇలాంటి టైం లో సమంత ఆ మెగా హీరో విన్నపాన్ని ఒప్పుకుంటుందా. ఎలాగు సాయి ధరం తేజ్ ఫాం లో ఉన్న హీరోనే కాబట్టి అతనితో జత కట్టే ఛాన్స్ వస్తే కాదనే ఛాన్స్ లేదు. కంటెంట్ ఉన్న సినిమాలనే చేస్తానని సమంత చెబుతున్నా తన అభిమాని అయిన సాయి ధరం తేజ్ తో సమంత కలిసి నటించేందుకు నో చెప్పకపోవచ్చు.

సాయి తేజ్, సమంత ఈ జోడీ చూడాలని మెగా ఫ్యాన్స్ కూడా ఉత్సాహంగా ఉన్నారు. సాయి తేజ్ ప్రస్తుతం గాంజా శంకర్ సినిమా చేస్తున్నాడు. ఆ తర్వాత చిత్రలహరి 2 ఉంటుందని టాక్. ఈ సినిమాలో హీరోయిన్స్ ఎవరన్నది ఇంకా తెలియలేదు. ఒకవేళ చిత్రలహరి లో ఉన్న కళ్యాణిని, నివేదాని రిపీట్ చేస్తే సమంత కు ఛాన్స్ ఉండదు కానీ వారు కాకుండా వేరే అంటే మాత్రం సమంత ఫస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పొచ్చు. ఒకవేళ ఆ సినిమా కాకపోయినా ఫ్యూచర్ లో సాయి ధరం తేజ్ చేసే సినిమాలో సమంత తప్పకుండా స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇష్టమైన హీరోయిన్ తో స్క్రీన్ షేరింగ్ అంటే ఆ కిక్ వేరేలా ఉంటుంది. మరి తేజ్ కి ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడు వస్తుందో చూడాలి.