Begin typing your search above and press return to search.

ఛాన్సిస్తే స‌మంత అక్కినేని హీరోల‌తో సై అంటుందా?

ఛాన్స్ ఇస్తే ఇప్పుడు స‌మంత మ‌ళ్లీ అక్కినేని హీరోల‌తో క‌లిసి ప‌నిచేస్తుందా? సినిమా నుంచి వ్య‌క్తిగ‌త జీవితాన్ని వేరు చేసి ఆ హీరోల స‌ర‌స‌న మ‌ళ్లీ న‌టిస్తుందా?

By:  Tupaki Desk   |   19 Aug 2023 1:30 AM GMT
ఛాన్సిస్తే స‌మంత అక్కినేని  హీరోల‌తో సై అంటుందా?
X

ఛాన్స్ ఇస్తే ఇప్పుడు స‌మంత మ‌ళ్లీ అక్కినేని హీరోల‌తో క‌లిసి ప‌నిచేస్తుందా? సినిమా నుంచి వ్య‌క్తిగ‌త జీవితాన్ని వేరు చేసి ఆ హీరోల స‌ర‌స‌న మ‌ళ్లీ న‌టిస్తుందా? అందుకు అక్కినేని హీరోలు కూడా అంగీక‌రిస్తారా? అన్న సందేహాలు నెట్టింట మొద‌ల‌య్యాయి. 'ఖుషీ' ఈవెంట్ లో భాగంగా స‌మంత పెర్పార్మెన్స్ చూసిన త‌ర్వాత ఓ సెక్ష‌న్ ఆడియ‌న్స్ లో సాగిన డిస్క‌ష‌న్ ఇది. స‌మంత ఇప్పుడు పూర్తిగా అన్ని ర‌కాల స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డింది. నాగ‌చైత‌న్య‌తో విడాకుల స‌మ‌యంలో..విడాకుల త‌ర్వాత కొంత మ‌న‌స్తాపానికి గురైన‌ప్ప‌టికీ కాలం ఆ బాధ నుంచి బ‌యట‌కు తెచ్చింది.

ఇప్పుడిద్ద‌రు ఎవ‌రి సినిమాల‌తో వాళ్లు బిజీగా ఉంటున్నారు. స‌మంత రెట్టించిన ఉత్సాహంతో క‌నిపిస్తుంది. గ‌తాన్ని పూర్తిగా మ‌ర్చిపోయి కొత్త జీవితాన్ని ఎంతో ఆస్వాదిస్తున్న‌ట్లు క‌నిపిస్తుంది. ఇక చైత‌న్య బేసిక్ గానే రిజ‌ర్వ్ డ్ ప‌ర్స‌న్ కాబ‌ట్టి! అత‌ను ఉత్సాహంగా ఉన్నా? అత‌నిలో ఎగ్జైట్ మెంట్ ని ప‌ట్టుకోవ‌డం అన్న‌ది క‌ష్టం. ఈ విష‌యంలో స‌మంత కోణం నుంచే అన్ని విష‌యాలు విశ్లేషించాల్సి ఉంటుంది. ఇద్ద‌రు విడిపోయి ఏడాదిన్న‌ర‌కు పైగానే అవుతుంది.

స‌మంత కెరీర్ ని జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెట్టిస్తుంది. త‌న‌లో కొత్త కోణాల్ని సైతం బ‌య‌ట‌కు తెస్తుంది. స్టేజ్ పై లైవ్ పెర్పార్మెన్స్ లు ఇస్తుంది. ఇంత‌వ‌ర‌కూ ఇలాంటి పెర్పార్మెన్స్ లు ఎక్క‌డా ఇవ్వ‌లేదు. తొలిసారి 'ఖుషీ 'కోసం అలాంటి అవ‌తారం ఎత్తింది. న‌టిగా అవ‌కాశాల‌కు కొద‌వలేదు. వెబ్ సిరీస్ ల్లోనూ అవ‌కాశాలు బాగానే వ‌రిస్తున్నాయి. ఇలా వృత్తి ప‌రంగా స‌మంత కి తిరుగు లేదు. అయితే అమ్మ‌డు ఇప్పుడు మ‌ళ్లీ అక్కినేని హీరోల‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌స్తే న‌టిస్తుందా? అన్న‌ది ఆస‌క్తిక‌రం.

సాధ‌ర‌ణంగా సెల‌బ్రిటీలు సినిమాలు..వ్య‌క్తిగ‌త జీవితం రెండు వేర్వేరుగా చూస్తారు. వ్య‌క్తిగ‌తంగా ఎలా ఉన్నా సినిమా అనే స‌రికి క‌లిసి ప‌ని చేస్తుంటారు. బ‌య‌ట క‌నిపించే స‌రికి స్నేహ పూర్వ‌కంగా మెలుగుతారు. మాట్లాడుకుంటారు. మ‌రి స‌మంత అలా ఆలోచించ గ‌ల్గుతుందా? లేక మ‌న‌సుకు త‌గిలిన గాయ‌న్ని ఇంకా అలా ప‌చ్చిగానే ఉంచిందా? అన్న‌ది తెలియాలి. అలాగే స‌మంత న‌టిస్తాన‌న్నా? అందుకు అక్కినేని హీరోలు కూడా ఒకే చెబుతారా? అన్న‌ది ఆలోచించాల్సిన విష‌య‌మే. ఆ ఫ్యామిలీలో నాగార్జున‌..నాగ‌చైత‌న్య‌..అఖిల్ లాంటి ముగ్గురు స్టార్లు ఉన్నారు. ఇప్పుడు స‌మంత‌కి ముగ్గురు స‌మాన‌మే. ఆ ఫ్యామిలీతో ఎలాంటి రిలేష‌న్ షిప్ లేదు కాబ‌ట్టి! ద‌ర్జాగా ముందుకెళ్లొచ్చు.