Begin typing your search above and press return to search.

ప్రవీణ్ సత్తారు.. మరో హీరో నమ్ముతాడా?

కానీ వరుసగా రెండు బిగ్ డిజాస్టర్స్ పడటంతో మాస్ మహారాజ్ తో అనుకున్న ప్రాజెక్ట్ చేస్తాడా లేదా అనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్ లో జరుగుతోంది.

By:  Tupaki Desk   |   26 Aug 2023 4:31 AM GMT
ప్రవీణ్ సత్తారు.. మరో హీరో నమ్ముతాడా?
X

టాలీవుడ్ లో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న వ్యక్తి ప్రవీణ్ సత్తారు. ఎల్.బి.డబ్యూ మూవీతో దర్శకుడిగా ప్రయాణం స్టార్ట్ చేసిన ప్రవీణ్ సత్తారు రెండో చిత్రం రొటీన్ లవ్ స్టోరీ అంటూ సందీప్ కిషన్, రెజీనాతో ప్రేమకథా చిత్రం చేశారు. ఈ మూవీ పర్వాలేదని టాక్ తెచ్చుకుంది. నెక్స్ట్ చందమామ కథలు అంటూ ఆంథాలజీ కథలని తెరపై ఆవిష్కరించారు.

ఈ సినిమా ఫీల్ గుడ్ స్టోరీస్ తో ఆకట్టుకుంది. దాని తర్వాత గుంటూరు టాకీస్ అంటూ బోల్డ్ అటెంప్ట్ చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. నెక్స్ట్ రాజశేఖర్ తో గరుడ వేగా అనే మూవీతో బ్లాక్ బస్టర్ కొట్టారు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని ఐదేళ్ల తర్వాత కింగ్ నాగార్జునతో ది ఘోస్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం డిజాస్టర్ అయ్యింది.

తాజాగా వరుణ్ తేజ్ తో గాండీవదారి అర్జున అంటూ మరోసారి యాక్షన్ మోడ్ కథనే ట్రై చేశారు. అయితే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్పందన రావడం లేదు. మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చేసింది. సుమారు 40 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ మూవీలో మెయిన్ ఎమోషన్స్ మిస్ అయ్యాయని ఆడియన్స్ నుంచి వస్తోన్న స్పందన. యాక్షన్ బ్లాక్స్ అద్భుతంగా ఉన్న కూడా కంటెంట్ తో ప్రేక్షకులని కన్విన్స్ చేయలేకపోయారంట.

ఈ మూవీ తర్వాత ప్రవీణ్ సత్తారు రవితేజతో సినిమా చేయాల్సి ఉంది. ఇప్పటికే కథ కూడా చెప్పారంట. కానీ వరుసగా రెండు బిగ్ డిజాస్టర్స్ పడటంతో మాస్ మహారాజ్ తో అనుకున్న ప్రాజెక్ట్ చేస్తాడా లేదా అనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్ లో జరుగుతోంది. గాండీవదారి అర్జున పూర్తి స్థాయి రిజల్ట్ సోమవారానికి తెలిసిపోతుంది. మొదటి రోజు అయితే కొంత నెగిటివ్ టాక్ వచ్చింది.

అయితే వీకెండ్ లో ఏమైనా పుంజుకొని రిజల్ట్ మారితేనే నిర్మాత సేఫ్ అయ్యేది. ఈ మూవీ కూడా ది ఘోస్ట్ తరహాలో భారీ నష్టాలు తీసుకొస్తే మాత్రం రవితేజతో సినిమా ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. రవితేజ ప్రస్తుతం పాన్ ఇండియా కథలపై ఫోకస్ పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రవీణ్ సత్తారుతో రిస్క్ చేస్తాడా లేదా అనేది చూడాలి.