Begin typing your search above and press return to search.

శ్రీలీల‌తో `ధ‌మాకా` రేంజ్ లో ఉంటుందా?

'ధ‌మ‌కా` త‌ర్వాత అమ్మ‌డిలో గ్లామ‌ర్ డోస్ త‌గ్గిందా? అన్న అంశం చ‌ర్చ‌కొచ్చింది.

By:  Tupaki Desk   |   31 Dec 2023 7:45 PM GMT
శ్రీలీల‌తో `ధ‌మాకా` రేంజ్ లో ఉంటుందా?
X

`ధ‌మాకా` త‌ర్వాత శ్రీలీల‌కి స‌రైన స‌క్సెస్ ప‌డ‌ని సంగ‌తి తెలిసిందే. `భ‌గ‌వంత్ కేస‌రి` భారీ హిట్ అయినా ఆ క్రెడిట్ అంతా బాల‌య్య ఖాతాలోకే పోయింది. అటుపై రిలీజ్ అయిన సినిమాలు వ‌రుస‌గా ప‌రాజ‌యం చెందాయి. దీంతో శ్రీలీల రేసులో కాస్త వెనుక‌బ‌డిన‌ట్లే క‌నిపించింది. ఎఫెర్ట్ పెట్టి ప‌నిచేసినా ఆ ప్ర‌య‌త్న‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరైంది. `ధ‌మ‌కా` త‌ర్వాత అమ్మ‌డిలో గ్లామ‌ర్ డోస్ త‌గ్గిందా? అన్న అంశం చ‌ర్చ‌కొచ్చింది. `స్కంద‌`..`ఆది కేశ‌వ` లాంటి సినిమాల్లో రొమాంటిక్ అప్పిరియ‌న్స్ ఇచ్చిప్ప‌టికీ అదంతగా హైలైట్ కాలేదు.


అయితే `గుంటూరు కారం`తో అమ్మ‌డు అన్ని లెక్క‌లు స‌రి చేస్తున్న‌ట్లే క‌నిపిస్తోంది. తాజాగా ఇటీవ‌ల రిలీజ్ అయిన `కుర్చి మడతపెట్టి` పాట ఎంత పెద్ద స‌క్సెస్ అయిందో తెలిసిందే. ఇందులో రొమాంటిక్ శ్రీలీల హైలైట్ అవుతుంది. మ‌హేష్ తో అమ్మ‌డు కాస్త రొమాంటిక్ ఫోజుల్లోనే క‌నిపిస్తుంది. లంగావోణీ లో శ్రీలీల హాట్ అప్పిరియ‌న్స్ యువ‌త‌ని ఆక‌ర్షిస్తుంది. అమ్మ‌డి న‌డుముమైపై మ‌హేష్ చేతులు...క‌ళ్ల‌లో క‌ళ్లు..శ్రీలీలలో సిగ్గరి అన్ని పాట‌లో మ‌స్త్ గా హైలైట్ అవుతున్నాయి.

ఎరుపు రంగు లంగా వోణీలో మ‌రింత స్పైసీ గా ఆక‌ర్షిస్తుంది. అమ్మ‌డి ముక్కుకి పుడ‌క‌..చెవుల‌కు బుట్ట‌లు అన్ని శ్రీలీల‌ని యూత్ ని ఆక‌ట్టుకునేలా ఉన్నాయి. లిరిక‌ల్ గానే ఆ రేంజ్ లో కిక్ ఇస్తుందంటే? పూర్తి వీడియో సాంగ్ లో శ్రీలీల స‌త్తా చాటే ఉంటుంద‌ని అంచ‌నాలున్నాయి. రొమాన్స్ కి మ‌హేష్ దూర‌మైనా! అస‌వ‌రం మేర ఆయ‌నా అప్పుడ‌ప్పుడు త‌న‌దైన మార్క్ వేస్తుంటారు.

`స‌ర్కారు వారి పాట‌`లో కీర్తి సురేష్ తో న‌టించిన రొమాంటిక్ స‌న్నివేశాలు ఎంత హైలైట్ అయ్యాయో తెలిసిందే. మ‌రి గుంటూరు కారంలో అంత‌కు మించి అనిపిస్తారా? అన్న‌ది చూడాలి. ఇందులో శ్రీలీల‌తో పాటు మ‌రో హీరోయిన్ మీనాక్షి చౌద‌రి కూడా న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఆమెతో కూడా ఇలాంటి పెప్పీ సాంగ్ ఒక‌టి ప్లాన్ చేసారా ? అన్న‌ది తెలియాలి.