క్లాసిక్ డైరెక్టర్ 2025 లోనైనా గుడ్ న్యూస్ చెబుతాడా?
'మహర్షి' చిత్రాన్ని వంశీ డీల్ చేసిన విధానం పాన్ ఇండియాలో కనెక్ట్ అయింది. ఆ సినిమాకి ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు.
By: Tupaki Desk | 30 March 2025 1:00 AM ISTవంశీ పైడిపల్లి డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. క్లాసిక్ స్టోరీలతో తానో బ్రాండ్ గా ముద్ర వేసుకున్నాడు. బృందావనం, ఊపిరి, మహర్షి , వారసుడు లాంటి సినిమాలతో ప్రత్యేక మైన శైలి గల దర్శకుడిగా సత్తా చాటాడు. 'మహర్షి' సినిమాతో జాతీయ అవార్డు సైతం అందుకున్నాడు. 'మహర్షి' చిత్రాన్ని వంశీ డీల్ చేసిన విధానం పాన్ ఇండియాలో కనెక్ట్ అయింది. ఆ సినిమాకి ప్రత్యేకమైన అభిమానులు ఏర్పడ్డారు.
మహేష్‌కెరీర్ లోనే ఓ డిఫరెంట్ చిత్రంగా నిలిచింది. 'వారసుడు' కూడా విమర్శకుల ప్రశంసలం దుకుంది. కానీ చిన్నపాటి తప్పిదాలు ఆ సినిమాకు మైనస్ గా మారాయి. వారసుడు రిలీజ్ అయి రెండేళ్లు అవుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వంశీ కొత్త సినిమా అప్ డేట్ ఇవ్వలేదు. దీంతో 2025 లోనైనా గుడ్ న్యూస్ చెబుతాడా? అని ఆయన అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. స్టార్ హీరో లెవరు డేట్లు ఇచ్చే పరిస్థితి లేదు.
ఎన్టీఆర్, రామ్ చరణ్, మహేష్, బన్నీ అంతా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు. టైర్ 2 హీరోలు కూడా చాలా మంది బిజీగా ఉన్నారు. కొంత మందిని సీరియస్ గా ట్రై చేస్తే దొరికే అవకాశం ఉంది. టైర్ 3 హీరోలు కొందరు సరైన కథల కోసం ఎదురు చూస్తున్నారు. వంశీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్లతోనే సినిమాలు చేయగలరు. డైరెక్టర్ గా వంశీ ఇంతకు మించి గ్యాప్ తీసుకోవడం కూడా అతడి కెరీర్ పై ప్రభావం పడుతుంది.
అవకాశాలు ఇవ్వాలనుకున్న వాళ్లు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదు. మీడియం రేంజ్ హీరోతో నైనా ఓ మంచి సినిమా చేసి హిట్ అందుకుంటే? అది అతడి క్రేజ్ ని రెట్టింపు చేస్తుంది. మర్చిపోతున్న పేరును గుర్తు చేసినట్లు అవుతుంది. మరి వంశీ స్టార్ హీరో దొరికే లోపు ఆ తరహా అటెంప్ట్ ఏదైనా చేస్తాడా? అన్నది చూడాలి.
