Begin typing your search above and press return to search.

జాన్వీ అప్పుడే ఇంత డిమాండ్‌ ఏంటి..?

అక్కడ పెద్దగా క్రేజ్‌ లేకపోయినా కూడా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు అవ్వడంతో జాన్వీ కపూర్ అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా స్పెషల్‌.

By:  Tupaki Desk   |   19 Feb 2024 5:30 PM GMT
జాన్వీ అప్పుడే ఇంత డిమాండ్‌ ఏంటి..?
X

బాలీవుడ్‌ లో హీరోయిన్ గా పరిచయం అయ్యి పెద్దగా కమర్షియల్‌ హిట్స్ ను అందుకోలేక పోయిన ముద్దుగుమ్మ జాన్వీ కపూర్‌. అక్కడ పెద్దగా క్రేజ్‌ లేకపోయినా కూడా అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలు అవ్వడంతో జాన్వీ కపూర్ అంటే తెలుగు ప్రేక్షకులకు చాలా స్పెషల్‌. అందుకే ఆమెతో సినిమాలకు ఫిల్మ్‌ మేకర్స్ ఆసక్తి చూపిస్తున్నారు.

చాలా కాలంగా జాన్వీ కపూర్‌ సౌత్ సినిమాలకు నో చెబుతూ వచ్చింది. ఎట్టకేలకు ఎన్టీఆర్‌ తో దేవర సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యింది. ఇప్పటికే షూటింగ్‌ లో కూడా పాల్గొంటుంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి.

దేవర ఇంకా విడుదల అవ్వలేదు.. ఆ సినిమాలో జాన్వీ ఎలా ఉందో కూడా పెద్దగా క్లారిటీ లేదు. అయినా అప్పుడే వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఏకంగా రామ్‌ చరణ్‌ సినిమాలో నటించే అవకాశం జాన్వీ కి దక్కింది. బుచ్చి బాబు దర్శకత్వంలో చరణ్ హీరోగా రూపొందబోతున్న సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంపిక అయ్యింది.

ఇప్పటి వరకు జాన్వీ కపూర్ ను హీరోయిన్‌ గా ఎంపిక చేసినట్లు బుచ్చి బాబు కానీ ఆయన సన్నిహితులు కానీ ప్రకటించలేదు. కానీ జాన్వీ తండ్రి బోనీ కపూర్‌ ఔను దైవానుగ్రహంతో నా కూతురు చరణ్ మూవీ లో నటించబోతోంది అన్నట్లుగా ఒక ఇంటర్వ్యూలో చెప్పేశాడు.

ఇక దేవర సినిమాతో పోల్చితే చరణ్‌, బుచ్చిబాబు సినిమాకు గాను జాన్వీ కపూర్ మరింత పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దేవర సినిమాకు గాను జాన్వీ కపూర్‌ దాదాపుగా రూ.2.5 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

చరణ్ మూవీకి గాను ఆమె ఏకంగా మూడు కోట్ల పారితోషికం డిమాండ్‌ చేసిందని, అందుకు బుచ్చిబాబు కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇవ్వడం జరిగిందని సమాచారం అందుతోంది. ఇంత త్వరగా మూడు కోట్ల పారితోషికంగా డిమాండ్‌ చేయడం ఏంటి అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్‌ లో ఉన్న టాప్‌ స్టార్‌ హీరోయిన్స్ కూడా ఆ రేంజ్ లో పారితోషికం తీసుకోవడం లేదు.. ఒక్క సినిమా కూడా విడుదల అవ్వకుండానే జాన్వీకి అంతగా పారితోషికం సమర్పించడం అవసరమా అన్నట్టు కొందరు ప్రశ్నిస్తున్నారు.