Begin typing your search above and press return to search.

ఎందుక‌ని హీరోయిన్లు విదేశీ ప్రియుడితోనే?

స్వ‌దేశీలు అర్థం చేసుకోలేనిది విదేశీలే అర్థం చేసుకునేది ఏది? అన్న‌ది అంద‌రి మ‌దిలో ఒక డౌట్.

By:  Tupaki Desk   |   31 March 2024 3:00 AM GMT
ఎందుక‌ని హీరోయిన్లు విదేశీ ప్రియుడితోనే?
X

ఎందుక‌ని మ‌న‌ సినిమా హీరోయిన్లు విదేశీ ప్రియుడినే భ‌ర్త‌గా ఎంచుకుంటున్నారు? ఈ డౌట్ అంద‌రికీ వ‌చ్చి ఉంటుంది. కానీ దానికి కార‌ణం ఏమిట‌న్న‌ది అంతు చిక్క‌డం లేదు. స్వ‌దేశీలు అర్థం చేసుకోలేనిది విదేశీలే అర్థం చేసుకునేది ఏది? అన్న‌ది అంద‌రి మ‌దిలో ఒక డౌట్.

టాలీవుడ్ - బాలీవుడ్ లో ఒక రేంజున్న క‌థానాయిక‌లంతా ఇదే బాట ప‌ట్టారు. వీళ్లంతా కెరీర్ కీల‌క ద‌శ‌లో విదేశీ ప్రియుల‌తో డేటింగులు చేయ‌డం ఒక ర‌కంగా సంచ‌ల‌న‌మే.. ఈ జాబితాలో ఇలియానా, శ్రుతిహాస‌న్, తాప్సీ ప‌న్ను, శ్రీయా శ‌ర‌ణ్‌, ప్రీతి జింతా, రాధిక ఆప్టే, తాప్సీ లాంటి టాప్ హీరోయిన్లు ఉన్నారు.

ఇలియానా త‌న కెరీర్ జ‌ర్నీ బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యే క్ర‌మంలో విదేశీ ఫోటోగ్రాఫ‌ర్ ఆండ్రూ నీబోన్ ని ప్రేమించింది. అత‌డితో కొన్ని సంవ‌త్స‌రాల పాటు డేటింగ్ చేసాక వ‌న్ ఫైన్ డే బ్రేక‌ప్ అయింది. ఈ బ్రేక‌ప్ వ‌ల్ల డిప్రెష‌న్ లోకి వెళ్లిన ఇలియానా చాలా గ్యాప్ తీసుకుని మ‌ళ్లీ ప్రేమ‌లో ప‌డింది. కానీ రెండోసారి కూడా విదేశీ ప్రియుడినే న‌మ్ముకుంది. ఇటీవ‌లే అత‌డితో ఒక బిడ్డ‌కు స్వాగ‌తం ప‌లికింది. త‌న మ‌న‌సు అర్థం చేసుకున్న చెలికాడితో స్నేహాన్ని ఇలియానా స‌మ‌ర్థించుకుంది. ఇక అత‌డిని పెళ్లాడుతుందా లేదా? అన్న‌ది అప్ర‌స్తుతం. కానీ ఇలియానా ఒక విదేశీని న‌మ్మిన‌ట్టు స్వదేశీ స్నేహితుడిని న‌మ్మ‌లేదు.

శ్రుతిహాస‌న్ ఒక విదేశీ బోయ్ ఫ్రెండ్ తోనే డేటింగ్ చేసింది. అత‌డి పేరు మైఖేల్. అత‌డిని త‌న త‌ల్లిదండ్రులు సారిక‌- క‌మ‌ల్ హాస‌న్ ల‌కు కూడా ప‌రిచ‌యం చేసింది. కానీ అత‌డితో కొన్నాళ్ల‌కే బ్రేక‌ప్ అయింది. ఆ త‌ర్వాత భార‌త‌దేశానికి చెందిన డూడుల్ ఆర్టిస్టు శంత‌నుతో ప్రేమ‌లో ప‌డింది. ప్ర‌స్తుతం అత‌డితో శ్రుతి స‌హ‌జీవ‌నంలో ఉంది. మొద‌ట ఒక విదేశీనే శ్రుతిహాస‌న్ న‌మ్మ‌డం యూత్ లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

శ్రీయా శ‌ర‌ణ్ .. విదేశీ క్రీడాకారుడు ఆండ్రూ కోశ్చీవ్ ని పెళ్లాడింది. అత‌డితో రాధ అనే కుమార్తెను క‌లిగి ఉంది. కుమార్తె, భ‌ర్త‌తో క‌లిసి ఇప్పుడు ముంబైలో నివాసం ఉంటోంది. తిరిగి న‌టిగా కెరీర్ కోసం ప్ర‌య‌త్నిస్తోంది. శ్రీయ శ‌ర‌ణ్ స‌డెన్ గా విదేశీ తో ప్రేమ‌లో ప‌డ‌డం చాలా చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కానీ ఆండ్రూ ఎంతో ఆరాధ్యుడు అంటూ మురిసిపోతూ ప‌బ్లిక్ లో లిప్ లాక్ లు వేస్తోంది.

సీనియ‌ర్ న‌టి ప్రీతి జింతా జీన్ గూడెన‌ఫ్ తో డేటింగ్ చేసింది. అత‌డు విదేశాల్లో ఎక్కువ‌గా నివ‌శిస్తారు. కానీ ప్రీతి అత‌డితో గొప్ప బంధాన్ని క‌లిగి ఉంది. అంత‌కుముందు ప‌లువురు బాలీవుడ్ స్టార్ల‌తో ప్రీతి ప్రేమాయ‌ణాల గురించి గుస‌గుస‌లు న‌డిచాయి. ఆ త‌ర్వాత విదేశీతో జీవ‌నం కీల‌క పరిణామం. రాధిక ఆప్టే త‌న భ‌ర్త విదేశాల్లో ఉంటార‌ని చాలా సార్లు ఇంట‌ర్వ్యూల్లో వెల్ల‌డించారు. తాము నిరంత‌రం క‌లుసుకుంటున్నామ‌ని వెల్ల‌డించారు. రాధిక ప్ర‌స్తుతం బాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టు. వ‌రుస‌గా వెబ్ సిరీస్ లు సినిమాల్లో న‌టిస్తోంది.

తాప్సీ ప‌న్ను ఒక విదేశీ క్రీడాకారుడిని పెళ్లాడింది. అత‌డి పేరు మాథియాస్ బౌ. అంత‌కుముందు కూడా తాను ఒక‌రితో డేటింగులో ఉన్నాన‌ని, సిన్సియ‌ర్ గా ప్రేమించాన‌ని, అయితే అది కుద‌ర‌లేద‌ని తెలిపింది. త‌న‌కు ప‌రిచ‌య‌మైన వాళ్లంద‌రి కంటే ఒక గొప్ప వాడిని తాను ప్రేమించినందుకు ఆనందంగా ఉన్నాన‌ని తాప్సీ పేర్కొన్నారు. అత‌డు త‌న మ‌న‌సును ప్రేమ‌తో గొప్ప‌గా అర్థం చేసుకున్నాడ‌ని కూడా మురిసిపోయింది.

వీళ్ల‌తో పాటు చాలా మంది మ‌హిళా ఆర్టిస్టులు విదేశీ బోయ్ ఫ్రెండ్స్ ని పెళ్లాడి లైఫ్ లో సెటిల‌య్యారు. వారిలో ప‌లువురు హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తున్న‌వారు ఉన్నారు.