విశాల్ తెలుగు సినిమా చేయడా?
ఇలా టాప్ స్టార్లు అంతా తెలుగులో సినిమాలు చేయడానికి ఎంతో ఉత్సాహం..ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తెలుగు వాడైన విశాల్ మాత్రం తెలుగులో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు.
By: Tupaki Desk | 9 May 2025 2:30 AMపక్కనున్న తమిళ, కన్నడ, హిందీ నటులు తెలుగులో సినిమాలు చేయాలని ఎంతో ఆరట పడుతున్నారు. ఇప్పటికే కోలీవుడ్ నుంచి దళపతి విజయ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇంకా ధనుష్ , దుల్కర్ సల్మాన్ కూ డా లాంచ్ అయ్యారు. సూర్య, కార్తీ లాంటి నటులు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. మంచి స్టోరీ కుదిరితే రంగంలోకి దిగిపోతామంటున్నారు. అమీర్ ఖాన్ అయితే రాజమౌళి పిలిస్తే వచ్చి వాలిపో వాలని చూస్తున్నారు.
ఇలా టాప్ స్టార్లు అంతా తెలుగులో సినిమాలు చేయడానికి ఎంతో ఉత్సాహం..ఆసక్తి చూపిస్తున్నారు. కానీ తెలుగు వాడైన విశాల్ మాత్రం తెలుగులో సినిమా చేయడానికి ముందుకు రావడం లేదు. విశాల్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. తెలుగు నటుడైనా కెరీర్ కోలీవుడ్ లో ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అదే భాషలో కొనసాగుతున్నాడు. తెలుగులో అనువాద రూపంలో ప్రతీ చిత్రాన్ని తప్పక తెలుగులో రిలీజ్ చేస్తుంటాడు.
కానీ తెలుగులో సినిమా చేసే ప్రయత్నం మాత్రం ఇంత వరకూ ఎప్పుడు చేయలేదు. అయితే `సెల్యూట్` చిత్రాన్ని మాత్రం తమిళంతో పాటు ఏక కాలంలో తెలుగులోనూ తెరకెక్కించి రిలీజ్ చేసారు. ఆ సినిమా యావరేజ్ గా ఆడింది. అలాగే `పిస్తా` చిత్రాన్ని కూడా అలాగే రిలీజ్ చేసారు. ఆ రెండు చిత్రాలు మినహా విశాల్ పేరిట తెలుగు సినిమా ఇది అని చెప్పుకోవడానికి మరోటి లేదు.
ప్రత్యేకంగా విశాల్ ఇంత వరకూ తెలుగు హైదరాబాద్ లో సినిమా లాంచ్ చేయకపోవడం ఆశ్చర్యకరం. తెలుగు సినిమా పాన్ ఇండియాలో దూసుకుపోతున్నా? విశాల్ ఇంకా టాలీవుడ్ లైట్ తీసుకుంటున్నట్లే కనిపిస్తుంది. మరి తెలుగు సినిమా విషయంలో విశాల్ ఎందుకంత కఠినంగా ఉంటున్నాడు? అన్నది తెలియాలి. ప్రస్తుతం `డిటెక్టివ్ 2` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు.