Begin typing your search above and press return to search.

అలా చేసివుంటే 'ది రాజా సాబ్‌' ప‌రిస్థితేంటీ?

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `ది రాజా సాబ్‌`.

By:  Tupaki Desk   |   25 Dec 2025 10:58 AM IST
అలా చేసివుంటే ది రాజా సాబ్‌ ప‌రిస్థితేంటీ?
X

పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ `ది రాజా సాబ్‌`. ప్ర‌భాస్ త‌న మార్కు యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ల‌కు పూర్తి భిన్నంగా ట్రై చేస్తున్న సినిమా ఇది. ఫ‌స్ట్ టైమ్ ప్ర‌భాస్ కామెడీ థ్రిల్ల‌ర్ క‌థ‌తో భ‌య‌పెడుతూనే ఆద్యంతం వినోదాత్మ‌కంగా సాగే సినిమా ఇది. ఇప్ప‌టికే విడుద‌లైన ఈ మూవీ ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసి ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో క‌లిసి ఇషాన్‌స‌క్సేనా నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ క్రేజీ యాక్ట‌ర్స్ సంజ‌య్‌ద‌త్‌, బోమ‌న్ ఇరాని, స‌ముద్ర‌ఖ‌ని కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇక డార్లింగ్‌తో జోడీగా మాళ‌విక మోహ‌న‌న్‌, నిధి అగ‌ర్వాల్‌, రిద్దికుమార్ రొమాన్స్ చేస్తున్నారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ, తొలి స్టార్ హీరో మూవీ కావ‌డంతో ఈ మూవీపై ప్ర‌భాస్ అభిమానుల్లో కొంత మేర అనుమానాలున్నాయి. ఇదిలా ఉంటే `ది రాజా సాబ్‌` భారీ ఎదురు దెబ్బ నుంచి త‌ప్పించుకుంద‌నే టాక్ వినిపిస్తోంది.

ముందు ఈ మూవీని డిసెంబ‌ర్ 5న రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేశారు. ఇదే టైమ్‌లో ర‌ణ్‌వీర్‌సింగ్ లేటెస్ట్ సెన్సేష‌న్ `ధురంధ‌ర్‌` విడుద‌లైంది. ప్ర‌స్తుతం బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టిస్తూ రికార్డులు తిర‌గ‌రాస్తోంది. `అవ‌తార్ 3` మేనియా ఉన్న కానీ త‌న ప్ర‌భంజ‌నాన్ని కొన‌సాగిస్తూ వ‌సూళ్ల సునామీని సృష్టిస్తోంది. ఈ సినిమా టైమ్‌లో `ది రాజాసాబ్‌` రిలీజ్ అయితే ప‌రిస్థితి ఎలా ఉండేదో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ విష‌యాన్ని ముందే గ‌మ‌నించిన డిస్ట్రిబ్యూట‌ర్స్ `ది రాజా సాబ్‌` రిలీజ్‌ని డిసెంబ‌ర్ 5 నుంచి జ‌న‌వ‌రికి పోస్ట్ పోన్ చేయ‌మ‌ని మేక‌ర్స్‌కి చెప్పార‌ట‌.

అలా చేస్తే సంక్రాంతి బ‌రిలో సినిమాకు బ‌జినెస్ భారీ స్థాయిలో జ‌రుగుతుంద‌ని మేక‌ర్స్‌కు చెప్ప‌డంతో డిస్ట్రిబ్యూట‌ర్స్ రిక్వెస్ట్‌ని సీరియ‌స్‌గా తీసుకుని `ది రాజా సాబ్‌` రిలీజ్‌ని జ‌న‌వ‌రి 9కి పోస్ట్‌పోన్ చేశార‌ట‌. ఒక వేళ వారి రిక్వెస్ట్‌ని మేక‌ర్స్ ప‌క్క‌న పెట్టి డిసెంబ‌ర్‌లోనే రిలీజ్ చేసివుంటే `ధురంధ‌ర్‌`తో బిగ్ క్లాష్‌ని ఎదుర్కోవాల్సి వ‌చ్చేది. అంతే కాకుండా ఈ సినిమా బాక్సాఫీస్ రెవెన్యూపై కూడా భారీ ప్ర‌భావాన్ని చూపించేది. అది జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త‌ప‌డి చాలా తెలివిగా అడుగులు వేసి ల‌క్కీగా త‌ప్పించుకున్నార‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి.

ఇదిలా ఉంటే `ది రాజా సాబ్‌` సంక్రాంతి రిలీజ్‌కు చ‌క‌చ‌కా ఏర్పాట్లు జ‌రుగ‌తున్నాయి. త్వ‌ర‌లో అగ్రెసీవ్‌గా ప్ర‌మోష‌న్స్‌ని ప్రారంభించ‌బోతున్నారు. ఇందులో భాగంగా డిసెంబ‌ర్ 27న భారీ స్థాయిలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ని నిర్వ‌హించ‌బోతున్నారు. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ ప్ర‌భాస్ ట్రై చేస్తున్న ఈ కామెడీ థ్రిల్ల‌ర్ సంక్రాంతి బరిలో బాక్సాఫీస్ వ‌ద్ద ఎలాంటి ఫ‌లితాన్ని అందించ‌నుందో తెలియాలంటే జ‌న‌వ‌రి 9 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.