ట్రెండీ టాక్: టాలీవుడ్‌లో సోలో నిర్మాతలు ఇకపై ఉండరా?
నేటి ట్రెండ్ ని పరిశీలిస్తే.. టాలీవుడ్ సినిమా.. కోలీవుడ్ సినిమా... బాలీవుడ్ సినిమా అనేవి లేవు. కేవలం పాన్ ఇండియన్ సినిమా మాత్రమే.
By: Sivaji Kontham | 27 May 2026 8:00 AM ISTనేటి ట్రెండ్ ని పరిశీలిస్తే.. టాలీవుడ్ సినిమా.. కోలీవుడ్ సినిమా... బాలీవుడ్ సినిమా అనేవి లేవు. కేవలం పాన్ ఇండియన్ సినిమా మాత్రమే. ఇటీవల ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల ఇష్యూ సమీక్షా సమావేశం తర్వాత కొందరు ఎగ్జిబిటర్లు మాట్లాడుతూ .. ప్రస్తుతం నడుస్తున్నది అంతా పాన్ ఇండియన్ సినిమానే అని వ్యాఖ్యానించారు.
దీని అర్థాన్ని ఇన్‌డెప్త్ తో విశ్లేషిస్తే.. ఒకట్రెండు సంవత్సరాలలోనే సోలో ప్రొడ్యూసర్ అనే కాన్సెప్ట్ కూడా ఉండదని విశ్లేషిస్తున్నారు. ఎందుకంటే వందల కోట్ల బడ్జెట్లతో భారీ పాన్ ఇండియన్ సినిమాలు లేదా పాన్ వరల్డ్ సినిమాలు చేయాలంటే అగ్ర నిర్మాణ సంస్థలు పలు భాషల నుంచి దిగ్గజ సినీనిర్మాణ సంస్థలతో టై అప్ లు పెట్టుకుని అలాగే హీరోలను కూడా ఒక నిర్మాతగా భాగస్వాములుగా మార్చి సినిమాలు తీసే పద్ధతి కొనసాగుతుంది. ఇది ఇప్పటికే మన పాన్ ఇండియన్ హీరోలు మొదలు పెట్టారు కూడా. రాకా సినిమా కోసం అల్లు అర్జున్ కూడా తన పారితోషికాన్ని పెట్టుబడిగా పెట్టి నిర్మాతగా సహకరిస్తున్నారన్న టాక్ వినిపించింది. అల్లు అర్జున్, ప్రభాస్, చరణ్, మహేష్, ఎన్టీఆర్ వంటి పాన్ ఇండియన్ స్టార్లు వందల కోట్ల పారితోషికాలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఆ మొత్తాన్ని నటిస్తున్న సినిమాపై పెట్టుబడిగా పెట్టి నిర్మాతలుగా మారుతున్నారు. అందుకే సోలో ప్రొడ్యూసర్ అనే కాన్సెప్ట్ ఇకపై లేనట్టేనని విశ్లేషిస్తున్నారు.
నిర్మాతలు తమ రిస్క్ ను బాగా తగ్గించుకునేందుకు తెలివిగా ఇలా హీరోలు, ఇతర నిర్మాణ సంస్థలతో టై అప్ లు పెట్టుకుంటున్నారు. భారీగా అన్ని భాషల్లోను విడుదల చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇకపై చిన్న హీరో పెద్ద హీరో అనే తేడా కూడా ఉండదు.. ఇప్పుడు ఏ హీరో నటించినా కంటెంట్ లో దమ్ముంటే పాన్ ఇండియాలో రిలీజ్ చేసి విజయం అందుకుంటున్నారు. 10కోట్లు పైగా తీసుకునే ప్రతి హీరో తన పెట్టుబడిగా ఆ మొత్తాన్ని సినిమా కంటెంట్ పై నమ్మకంతో పెట్టుబడిగా పెట్టి, నిర్మాతగా మారుతున్నారు. తద్వారా వాటా కూడా అందుకునే ఆస్కారం ఏర్పడుతోంది.
అంత పెద్ద రిస్కు చేస్తున్నారు కాబట్టి కంటెంట్ పరంగా కూడా మునుపటితో పోలిస్తే చాలా రెట్లు కేర్ పెరిగింది. ఏదో ఒక సినిమా తీసేసే రోజులు ఇప్పుడు పోయాయి. కథ కంటెంట్ ఎంపిక విషయంలో, దానిపై కసరత్తు చేసే విషయంలో ఎవరూ తగ్గడం లేదు. చిన్నా పెద్దా అనే వైరుధ్యాలు ఇప్పుడు లేవు. తెలివైన వ్యూహకర్తలు మాత్రమే ఇప్పుడు టాలీవుడ్ సహా అన్ని పరిశ్రమల్లో కనిపిస్తున్నారు. మునుముందు ఓటీటీల హవా తగ్గి తిరిగి థియేటర్లకు మంచి రోజులు రావొచ్చు. ఇది ఎప్పటికప్పుడు మారే గేమ్ అని దురంధర్ లాంటి సినిమాలు నిరూపిస్తూనే ఉన్నాయి.
