Begin typing your search above and press return to search.

అవతార్ 3.. మెప్పించకపోవడానికి కారణాలివే!

ప్రముఖ హాలీవుడ్ దగ్గర జేమ్స్ కామెరూన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవతార్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

By:  Tupaki Desk   |   24 Dec 2025 4:40 PM IST
అవతార్ 3.. మెప్పించకపోవడానికి కారణాలివే!
X

ప్రముఖ హాలీవుడ్ దగ్గర జేమ్స్ కామెరూన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన అవతార్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన జేమ్స్ ఇప్పుడు అవతార్:ఫైర్ అండ్ యాష్ అంటూ మూడవ భాగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇండియాలో దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా.. అసలు భారతదేశంలో అవతార్ సినీ ప్రేమికులను తప్ప సామాన్య ప్రేక్షకులను మెప్పించలేదు. మరి హాలీవుడ్ దిగ్గజం ఎంతో అద్భుతంగా తెరకెక్కించిన ఈ సినిమాను ఎందుకు సామాన్య ప్రజలు స్వీకరించలేకపోయారు? అసలు అవతార్ 3 ప్రేక్షకులను మెప్పించకపోవడానికి అసలు కారణం ఏంటి? అనే విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

అవతార్ ఫైర్ అండ్ యాష్ ఇక్కడి ప్రేక్షకులను మెప్పించకపోవడానికి మొదటి కారణం.. ఈ చిత్రానికి పోటీగా రణవీర్ సింగ్ ధురందర్ సినిమా రావడం ఒక మైనస్ అనే చెప్పాలి..ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇప్పటికీ థియేటర్లలో మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. పైగా ఈ సినిమాను టీమిండియా క్రికెట్ ప్లేయర్లు ప్రత్యేకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసుకొని మరీ చూశారు. దీంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. అలా ఈ సినిమా ఫలితం కూడా అవతార్ ఫైర్ అండ్ యాష్ పై ప్రభావం చూపింది.

మరో కారణం ఈ సినిమా టెక్నికల్ గా ఎంత గొప్పగా ఉన్నా సరే డైరెక్టర్ ఈసారి ప్రేక్షకులను నిరాశపరిచారు అని చెప్పవచ్చు. ఎందుకంటే కథనం స్లోగా ఉండడం.. పైగా పాత కథనే చూపించారు అనే కామెంట్లు కూడా ఎక్కువగా వినిపించాయి. నిజానికి మూడుంపావ్ గంటల నిడివి ఉన్నప్పటికీ కథనం ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆ నిడివి ప్రేక్షకుడికి పెద్దగా అనిపించదు.. కానీ కథనం స్లోగా సాగడంతో ఈ నిడివి ప్రేక్షకులకు మరింత విసుగు తెప్పించింది అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. డిసెంబర్ 19న విడుదలైన ఈ సినిమాకి పోటీగా అటు హిందీలోనే కాకుండా ఇటు సౌత్ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాలు విడుదలయ్యాయి. ఈ చిత్రాలు కూడా ఇప్పుడు పాజిటివ్ టాక్ తో ఆకట్టుకుంటున్న నేపథ్యంలో ఈ సినిమా ఫలితాలు కూడా అవతార్ పై ప్రభావం చూపాయి.

దీనికి తోడు అవతార్ ఫోర్ కూడా ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అసలే ఫైర్ అండ్ యాష్ ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. ఒకవేళ అవుతార్ 4 కూడా వస్తే అసలు ప్రేక్షకులు దానిని ఆదరిస్తారా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా ఎన్నో అంచనాల మధ్య అవతార్ 3 ప్రేక్షకుల ముందుకు వచ్చినా.. పెద్దగా ఫలితాన్ని అందుకోలేదు. కనీసం 450 కోట్లలో 100 కోట్లైనా దాటుతుంది అంటే అది కూడా జరిగే పని కాదనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.