Begin typing your search above and press return to search.

బిగ్ బాస్ 7 : ఎవరు ఊహించని ఎలిమినేషన్.. నిజంగానే ఉల్టా పుల్టా..!

సందీప్ మాస్టర్ ఆట తీరు బాగున్నా కొన్ని విషయాల్లో అతని స్టాండ్ తీసుకున్న విధానంపై హోస్ట్ నాగార్జున కూడా మందలించాల్సిన పరిస్థితి వచ్చింది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:30 PM GMT
బిగ్ బాస్ 7 : ఎవరు ఊహించని ఎలిమినేషన్.. నిజంగానే ఉల్టా పుల్టా..!
X

బిగ్ బాస్ సీజన్ 7 ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియ పూర్తైనట్టు తెలుస్తుంది. ఆదివారం టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ షూటింగ్ పూర్తి కాగా ప్రతి వారం లానే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతున్నారన్నది లీక్ అయ్యింది. ఈ వారం బిగ్ బాస్ లో షాకింగ్ ఎలిమినేషన్ జరిగినట్టు తెలుస్తుంది. సీజన్ 7 మొదలై 8 వారాలు అవుతుండగా 8 వారాల్లో ఇప్పటివరకు కనీసం నామినేషన్స్ లో రాని హౌస్ మెట్ ఎలిమినేట్ అయ్యాడని తెలుస్తుంది.

ఇంతకీ ఈ వారం ఎలిమినేట్ అయ్యింది ఎవరంటే సందీప్ మాస్టర్ అని సమాచారం. వచ్చిన లీక్స్ ని బట్టి సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయినట్టుగా చెబుతున్నారు. ఐదు వారాలు ఇమ్యూనిటీ పొంది నామినేషన్స్ లో లేకుండా ఉన్న సందీప్ మాస్టర్ గత రెండు వారాలుగా నామినేషన్స్ నుంచి కూడా తప్పించుకున్నాడు. ఈ క్రమంలో 8వ వారం మొదటిసారి నామినేషన్స్ లోకి వచ్చాడు.

నామినేషన్స్ లోకి వెళ్లి వస్తుంటేనే ఆడియన్స్ లో వారికంటూ ఒక క్రేజ్ ఏర్పడుతుంది. కానీ 8 వారాలుగా సందీప్ ఒక్కసారి కూడా నామినేషన్స్ లో లేకపోవడం వల్ల అతని ఓటింగ్ పర్సెంటేజ్ ఏమాత్రం లేకుండా పోయింది. ఫైనల్ గా అతను నామినేట్ అయిన మొదటి వారమే ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది. బిగ్ బాస్ సీజన్ 7 ఉల్టా పుల్టా లో భాగంగా ఈ వారం సందీప్ మాస్టర్ ఎలిమినేషన్ ఆడియన్స్ కు బిగ్ షాక్ ఇస్తుంది.

సందీప్ మాస్టర్ ఆట తీరు బాగున్నా కొన్ని విషయాల్లో అతని స్టాండ్ తీసుకున్న విధానంపై హోస్ట్ నాగార్జున కూడా మందలించాల్సిన పరిస్థితి వచ్చింది. పర్సన్ గా ఎంత్ర స్ట్రాంగ్ అయినా కూడా సందీప్ మాస్టర్ నామినేషన్స్ లో లేకపోవడం మైనస్ గా మారింది. హౌస్ లో స్ట్రాంగ్ అనుకున్న సందీప్ మాస్టర్ ఈ వారం ఎలిమినేట్ అవడం ఆడియన్స్ కి నిజంగానే మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది.

ఇక నుంచి రాబోతున్న ప్రతి నామినేషన్స్ చాలా కీలకం కానున్నాయి. కాబట్టి ఏమాత్రం ఆట బాగా లేకపోయినా ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉంటుంది. సందీప్ ఎలిమినేషన్ హౌస్ లో అతనికి క్లోజ్ గా ఉన్న అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టిలకు షాక్ ఇస్తుంది. ఇక మీదట ప్రతి టాస్క్, ప్రతి ఆట చాలా ఇంపార్టెంట్ గా ఉండబోతున్నాయని చెప్పొచ్చు.