Begin typing your search above and press return to search.

మెగా-4 మల్టీస్టార‌ర్ ఎపుడో?

కొణిదెల కుటుంబం మొత్తం అత‌డికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు.

By:  Tupaki Desk   |   14 Jan 2024 4:35 AM GMT
మెగా-4 మల్టీస్టార‌ర్ ఎపుడో?
X

టాలీవుడ్ యువ హీరో, మెగా మేన‌ల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ 2024 భోగి రోజు (జనవరి 13న) తన 29వ పుట్టినరోజును జరుపుకోవడం చాలా ప్ర‌త్యేకం. కొణిదెల కుటుంబం మొత్తం అత‌డికి పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ముఖ్యంగా రామ్ చ‌ర‌ణ్ ఇన్‌స్టాలో ఒక ఛ‌రిష్మాటిక్ ఫోటోగ్రాఫ్ ని షేర్ చేసి 'హ్య‌పి బ‌ర్త్ డే కిడ్డో!.. లాట్స్ ఆఫ్ ల‌వ్' అంటూ ప్రేమ‌ను చాటుకున్నారు. ఈ ఫోటోగ్రాఫ్ లో బ‌ర్త్ డే బోయ్ తో క‌లిసి చ‌ర‌ణ్- వ‌రుణ్ తేజ్- సాయి తేజ్ కూడా ఉన్నారు.


మెగా ఫోటోలో.. సాయి ధ‌ర‌మ్- వైష్ణ‌వ్ తేజ్ ఫ్రీస్టైల్‌లో నిలుచుని ఉండగా, మెగా బ్ర‌ద‌ర్స్ చ‌ర‌ణ్-వ‌రుణ్ సోఫాలో కూచుని త‌మాషాగా మాట్లాడుతూ న‌వ్వులు చిందిస్తూ క‌నిపించారు. ఆస‌క్తిక‌రంగా చ‌ర‌ణ్ త‌న అత్త కుమారుల‌ను కూడా బ్ర‌ద‌ర్స్ అని పిలుస్తుంటారు. మేన‌ల్లుళ్లు కూడా చ‌ర‌ణ్ ని బ్ర‌ద‌ర్ అని సంబోధిస్తుంటారు. వారి మ‌ధ్య బంధాలు అనుబంధాలు ఎల్ల‌పుడూ ఎంతో ప్ర‌త్యేక‌మైన‌వి.. ప్రేమ‌పూర్వ‌క‌మైన‌వి. ఇక‌పోతే ఆ న‌లుగురు మెగా హీరోలు ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించ‌డంతో వీరంతా క‌లిసి మ‌ల్టీస్టార‌ర్ చేసేదెపుడు? అంటూ అభిమానులు స‌ర‌దాగా వ్యాఖ్యానిస్తున్నారు. అక్కినేని మ‌నం త‌ర‌హాలో `మెగా మ‌నం` వ‌చ్చేది ఎప్పుడు? అంటూ ఆస‌క్తిని వ్య‌క్తం చేస్తున్నారు. న‌లుగురు స‌క్సెస్ ఫుల్ మెగా హీరోలు క‌లిసి ఒకే ఫ్రేమ్‌లో క‌నిపిస్తే అది ఉత్కంఠ పెంచుతుంద‌ని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.

వైష్ణ‌వ్ తేజ్‌కి శుభాకాంక్షలు తెలియజేస్తూ.. రామ్ చరణ్ భార్య ఉపాసన కామినేని కొణిదెల తాజాగా పుట్టినరోజు వేడుక పార్టీ నుండి ఆహ్లాద‌క‌ర‌మైన ఆనందకరమైన వీడియోను షేర్ చేసారు. ఈ వీడియోలో, ఉపాసన పంజా వైష్ణవ్- రామ్ చరణ్‌తో క‌లిసి పోజులిచ్చింది. ఈ వీడియోలో బ‌ర్త్ డే బోయ్ పంజా వైష్ణవ్ తేజ్ ఫార్మల్ స్టైల్‌లో ఆకుపచ్చ చొక్కా నలుపు ప్యాంటు ధరించాడు.

మెగా కొత్త కోడ‌లు సున్నుండ‌లు:

వైష్ణవ్ కేక్ కటింగ్ ఈవెంట్‌కి సంబంధించిన ఈ వీడియోను షేర్ చేయడానికి ముందు, ఉపాసన భారీ సంక్రాంతి వేడుకల వీడియోను షేర్ చేశారు. సంక్రాతికి మెగా విందు కోసం రెడీ చేసిన‌ విభిన్న వంటకాలకు సంబంధించిన వీడియోలు ఆస‌క్తిని క‌లిగించాయి. కొత్త జంట వరుణ్ తేజ్ కొణిదెల - లావణ్య త్రిపాఠి కొణిదెల వీడియో కూడా ప్ర‌ధానంగా హైలైట్ అయింది. వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి జంట మిఠాయిల ప్రిప‌రేష‌న్, లావ‌ణ్య త‌న‌ కుటుంబం కోసం సంక్రాంతి వంట‌కాలు తయారు చేయడంలో బిజీగా ఉన్న వీడియో అభిమానుల‌ను ఆక‌ట్టుకుంది. 'కొణిదెల కోడలు కుటుంబం మొత్తానికి సున్నుండలు త‌యారు చేయ‌డం ఎంత స్వీటెస్ట్' అని ఉపాసన టీజ్ చేశారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. పంజా వైష్ణవ్ తేజ్ చివరిసారిగా `ఆదికేశవ`లో కనిపించాడు. శ్రీలీల ఇందులో క‌థానాయిక‌. బుచ్చి బాబు సాన తెర‌కెక్కించిన‌ 2021 చిత్రం `ఉప్పెన` తెలుగులో ఉత్తమ చలన చిత్రంగా 69వ జాతీయ అవార్డును అందుకుంది.