Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: ఆ న‌లుగురు వార‌సులు ఇంకెన్నాళ్లు?

న‌టుడిగా ఎంత హార్డ్ వ‌ర్క‌ర్ అయినా డ్యాన్సులు, ఫైట్స్ లో గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గ‌లిగినా కానీ అఖిల్ కి ల‌క్ క‌లిసి రాలేదు.

By:  Tupaki Desk   |   11 March 2024 3:00 AM GMT
టాప్ స్టోరి: ఆ న‌లుగురు వార‌సులు ఇంకెన్నాళ్లు?
X

టాలీవుడ్ లో అక్కినేని న‌టవార‌సుడు అఖిల్ విజ‌యం చేజిక్కించుకోవ‌డం కోసం చాలా తాప‌త్రాయ‌ప‌డుతున్నాడు. ఇప్ప‌టికి నాలుగు సినిమాలు చేసినా ఆశించిన బ్లాక్ బ‌స్ట‌ర్ ద‌క్క‌లేదు. ఒక్క మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ మిన‌హా ఇత‌ర సినిమాలేవీ విజ‌యాలు సాధించ‌లేదు. దీంతో ఇప్పుడు న‌వ‌త‌రం ద‌ర్శ‌కుడిపై అఖిల్ ఆశ‌లు పెట్టుకున్నాడు. న‌టుడిగా ఎంత హార్డ్ వ‌ర్క‌ర్ అయినా డ్యాన్సులు, ఫైట్స్ లో గొప్ప ప్ర‌ద‌ర్శ‌న చేయ‌గ‌లిగినా కానీ అఖిల్ కి ల‌క్ క‌లిసి రాలేదు. కానీ అత‌డికి ఆ ల‌క్ చిక్కేది ఎప్పుడు?


ఇక తెలుగు సినీప‌రిశ్ర‌మ‌లోనే మ‌రో వార‌సుడి కెరీర్ కూడా ఆశించిన విధంగా లేదు. తండ్రి ఎంత పెద్ద స్టార్ డైరెక్ట‌ర్ అయినా కానీ.. త‌న‌కో హిట్టివ్వ‌లేక త‌డ‌బ‌డ్డాడు. ఇది మ‌రెవ‌రో కాదు ఆకాష్ పూరి- పూరి జ‌గ‌న్నాథ్ జోడీ గురించే.. ఆకాష్ తొలి ప్ర‌య‌త్నంలోనే న‌టుడిగా గ‌ట్స్ ఉన్న‌వాడు అని నిరూపించుకున్నాడు. అయినా వ‌రుస‌గా న‌టించిన సినిమాలేవీ విజ‌యాలు సాధించ‌క‌పోవ‌డం నిరాశ‌ప‌రిచింది. త‌న తండ్రి పూరి జ‌గ‌న్నాథ్ నిర్మాత‌గా ఎగ్జిక్యూట్ చేసిన సినిమా కూడా విధిని మార్చ‌లేక‌పోయింది. దీంతో ఇప్ప‌ట్లో అత‌డు త‌న తండ్రి నిర్ధేశ‌నంలో కానీ ద‌ర్శ‌క‌త్వంలో కానీ న‌టించ‌న‌ని అంటున్నాడు. ఆకాష్ అనే హీరోతో పూరి సినిమా చేసాడు! అనే రేంజులో తాను బ‌య‌టి బ్యాన‌ర్ల‌లో నిరూపించుకుని వ‌స్తాన‌ని కూడా నమ్మ‌కంగా చెబుతున్న‌ట్టు తెలిసింది.

మ‌రో వైపు మంచు ఫ్యామిలీ న‌ట‌వార‌సుల‌కు కూడా ఇటీవ‌ల విజ‌యాలు చిక్క‌లేదు. మంచు విష్ణు కానీ, మంచు మ‌నోజ్ కానీ స‌క్సెస్ లేక కొన్నేళ్లుగా వెయిటింగులోనే ఉన్నారు. విష్ణు ఇప్పుడు భ‌క్త క‌న్న‌ప్ప లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంతో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. మ‌నోజ్ కూడా కంబ్యాక్ కోసం తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్న‌ట్టు తెలిసింది. వాట్ ది ఫిష్ తో పాటు సొంత బ్యాన‌ర్ సినిమాలోను అత‌డు న‌టిస్తున్నాడు.