Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ తిరిగి రాగానే... పెద్ద పెద్ద ప్లాన్స్‌

మొత్తానికి నెల రోజుల్లోనే మూడు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు మరియు షూటింగ్స్ కు హాజరు అయ్యే విధంగా ప్రభాస్ ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 11:30 PM GMT
ప్రభాస్‌ తిరిగి రాగానే... పెద్ద పెద్ద ప్లాన్స్‌
X

ఆదిపురుష్ సినిమా విడుదల అయిన వెంటనే ప్రభాస్‌ మోకాలికి సంబంధించిన చిన్న శస్త్ర చికిత్స నిమితం యూరప్ వెళ్లాడు. అక్కడే రెండు నెలల నుంచి ఉంటున్నాడు. మధ్యలో ఒకటి రెండు సార్లు వచ్చాడు అనే ప్రచారం జరిగింది. అది ఎంత వరకు నిజం అనేది మాత్రం క్లారిటీ లేదు. ఎట్టకేలకు ప్రభాస్ రెండు నెలల తర్వాత ఇండియా కు రాబోతున్నాడు అంటూ మరోసారి వార్తలు వస్తున్నాయి.

ప్రభాస్‌ సన్నిహితుల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్‌ 6వ తేదీన ప్రభాస్ హైదరాబాద్‌ కి వస్తాడు. వచ్చిన రెండు రోజుల్లోనే సలార్‌ సినిమా ప్రమోషన్ కి సంబంధించి దర్శకుడు ప్రశాంత్ నీల్ మరియు నిర్మాణ సంస్థ ప్రతినిధులతో భేటీ అవ్వబోతున్నాడు. సలార్‌ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలకు సంబంధించి చర్చలు జరిపిన తర్వాత మారుతి దర్శకత్వంలో సినిమా కోసం డేట్లు ఇవ్వబోతున్నాడు.

వారం లేదా పది రోజుల పాటు మారుతి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాకు డేట్లు ఇవ్వబోతున్న ప్రభాస్ ఆ వెంటనే నాగ్ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమా కోసం రామోజీ ఫిల్మ్‌ సిటీ లో వారం రోజుల పాటు చిత్రీకరణ లో పాల్గొంటాడని సమాచారం అందుతోంది. ఆ తర్వాత సలార్‌ ప్రమోషనల్‌ కార్యక్రమాలకు హాజరు అవ్వబోతున్నాడు.

మొత్తానికి నెల రోజుల్లోనే మూడు సినిమాలకు సంబంధించిన కార్యక్రమాలకు మరియు షూటింగ్స్ కు హాజరు అయ్యే విధంగా ప్రభాస్ ప్లాన్ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రభాస్ గ్యాప్ తీసుకున్న కారణంగా ఏ మాత్రం సమయం వృధా చేయకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమా లను ముగించే విధంగా ప్లాన్‌ చేసుకున్నట్లుగా సమాచారం అందుతోంది.

ప్రభాస్ మోకాలి శస్త్ర చికిత్స తర్వాత పూర్తి ఆరోగ్యంతో షూటింగ్‌ లో పాల్గొనబోతున్నాడు. కనుక ఇక ముందు ఎలాంటి బ్రేక్ లేకుండా సినిమాల షూటింగ్స్ జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమాలు నిరాశ పరిచాయి. మరి సలార్‌ తో అయినా తన ఫ్లాప్స్ పరంపరకి బ్రేక్ ఇచ్చేనా చూడాలి.