Begin typing your search above and press return to search.

చూడగానే ముఖం కడుక్కొని రమ్మన్నాడు..!

దిల్‌ సే సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తికర విషయాలను వెళ్లడించింది.

By:  Tupaki Desk   |   9 Feb 2024 12:30 PM GMT
చూడగానే ముఖం కడుక్కొని రమ్మన్నాడు..!
X

తెలుగు ప్రేక్షకులకు ప్రేమంటే ఇదేరా సినిమాతో పరిచయం అయిన ముద్దుగుమ్మ ప్రీతీ జింటా. ఈ అమ్మడు హిందీలో దిల్ సే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. షారుఖ్ ఖాన్‌ హీరోగా నటించిన ఆ సినిమాకి మణిరత్నం దర్శకత్వం వహించాడు.


దిల్‌ సే సినిమాకి సంబంధించిన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సోషల్‌ మీడియా ద్వారా ఆసక్తికర విషయాలను వెళ్లడించింది. దిల్ సే లో ఎంపిక అయిన వెంటనే షూటింగ్ కోసం ఆతృతగా ఎదురు చూశాను. షారుఖ్ మరియు మణి సర్‌ లతో వర్క్ చేయడం చాలా సంతోషంగా అనిపించింది.

మొదటి రోజు మేకప్ తో సెట్‌ కి వెళ్లాను. మణిరత్నం సర్ ను కలిసిన వెంటనే నవ్వుతూ ముఖం కడుక్కొని రమ్మన్నారు. ఆయన సరదాగా అన్నారు అనుకున్నాను. మరోసారి ముఖం కడుక్కోమన్నారు. మేకప్‌ పోతుంది కదా సర్ అన్నాను. పర్వాలేదు నాకు కావాల్సింది అదే, దయచేసి ముఖం కడుక్కుని రా అన్నాడు. నేను ముఖం కడుక్కొని వచ్చాను.

మేకప్ తీసిన తర్వాత నా పై ఒక క్లోజప్‌ షాట్ తీశారు. ఆ షాట్‌ లో చాలా అందంగా కనిపించాను. మా ఫోటోగ్రఫీ డైరెక్టర్ కి కృతజ్ఞతలు అంటూ ప్రీతీ జింటా పేర్కొంది. హిందీతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు గత కొన్నాళ్లుగా సినిమాలకు కాస్త దూరంగా ఉంటుంది. రీ ఎంట్రీ కోసం ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. త్వరలో రీ ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయి.