Begin typing your search above and press return to search.

ఒక‌రు త‌ర్వాత మరోక‌రు..అస‌లేం జ‌రుగుతోంది?

మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత ఇద్ద‌రు క‌లిసి ప‌నిచ‌య‌డంతో? ఇద్ద‌రు భారీ ప్ర‌యోగా నికే పూనుకున్నారు.

By:  Tupaki Desk   |   25 March 2024 11:30 PM GMT
ఒక‌రు త‌ర్వాత మరోక‌రు..అస‌లేం జ‌రుగుతోంది?
X

విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ -మ‌ణిర‌త్నం కాంబినేష‌న్ లో 'థ‌గ్ లైఫ్' అనే చిత్రాన్ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ తోనే సినిమాపై అంచ‌నాలు పీక్స్ కి చేరాయి. డిఫ‌రెంట్ గెట‌ప్ లో క‌మ‌ల్ లుక్ ఆద్యంతం ఆక‌ట్టుకుంది. మూడు ద‌శాబ్ధాల త‌ర్వాత ఇద్ద‌రు క‌లిసి ప‌నిచ‌య‌డంతో? ఇద్ద‌రు భారీ ప్ర‌యోగా నికే పూనుకున్నారు. సినిమాని భారీ కాన్వాస్ పైనే తెర‌కెక్కిస్తున్నారు. త్రిష‌..జ‌యం ర‌వి..దుల్కార్ స‌ల్మాన్ లాంటి టాప్ స్టార్ల‌ను రంగంలోకి దించారు.

ఇంకా మలయాళ నటుడు జోజు జార్జ్ - గౌతమ్ కార్తీక్ లాంటి వాళ్ల‌ను సీన్ లోకి తెచ్చారు. మెయిన్ లీడ్ క‌మ‌ల్ హాస‌న్ పోషించినా స‌పోర్టింగ్ రోల్స్ సైతం అంతే ధీటుగా ఉంటాయని వాళ్ల ఎంట్రీ తో అంతా అంచానా వేసారు. కానీ అదే థగ్ లైఫ్ ఇప్పుడు క‌ష్టాల్లో ప‌డుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. సెట్స్ కి వెళ్ల‌క‌ముందే థ‌గ్ లైఫ్ కి భారీ దెబ్బ ప‌డిన‌ట్లు క‌నిపిస్తోంది. ఒక‌రు త‌ర్వాత ఒక‌రు ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వ‌డం ఇప్పుడు అభిమానుల్లో ఆందోళ‌న క‌లిగిస్తుంది. ఇప్ప‌టికే దుల్కార్ త‌ప్పుకున్నాడు.

తాజాగా జ‌యం ర‌వి కూడా ప్రాజెక్ట్ నుంచి ఎగ్జిట్ అయిన‌ట్లు తెలుస్తోంది. ఇలా ఒక‌రు త‌ర్వాత ఒక‌రు వెళ్లిపోవ‌డంతో బిహైండ్ ఏం జ‌రుగుతోందో? తెలియ‌ని స‌న్నివేశం క‌నిపిస్తుంది. దుల్కార్..జ‌యం ర‌వి ఇద్ద‌రు ముందు అంగీక‌రించ‌డం..ఇప్పుడు త‌ప్పుకోవ‌డం వెనుక కార‌ణాలు? ఏంటి? అన్న‌ది అంతు చిక్క డం లేదు. మ‌ణిర‌త్నం సినిమాలో ఛాన్స్ అంటే అందులో చిన్న పాత్ర పోషించినా చాలు అనుకునే స్టార్లు ఎంతో మంది.

ఆయ‌న సినిమా లో ఛాన్స్ వ‌స్తేనే ప‌ర‌మావ‌ధిగా భావిస్తారు. అలాంటిప్పుడు వ‌చ్చిన అవ‌కాశాలు వ‌దులు కోవ‌డం ఏంటి? అన్న‌ది ఎవ‌రికీ అర్దం కాని ప్ర‌శ్న‌గా క‌నిపిస్తోంది. ఇద్ద‌రు మ‌ణిర‌త్నంతో మంచి ర్యాపో ఉన్న హీరోలే. దుల్కార్ స‌ల్మాన్ హీరోగా 'ఒకే బంగారం 'చి త్రాన్ని మ‌ణిర‌త్నం తెర‌కెక్కించి ఎంత పెద్ద స‌క్సెస్ చేసారో తెలిసిందే. తెలుగులో ల‌వ‌ర్ బోయ్ ఇమేజ్ ఆ సినిమాతోనే దుల్క‌ర్ కి ద‌క్కింది. ఇక జ‌యం ర‌విని పాన్ ఇండియా లో ప‌రిచ‌యం చేసింది కూడా మ‌ణిర్న‌త‌మే.

ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `పొన్నియ‌న్ సెల్వ‌న్` తోనే ఇది సాధ్య‌మైంది. కానీ ఇప్పుడు అదే మ‌ణిర‌త్నం సినిమా నుంచి ఇద్ద‌రు త‌ప్పుకోవ‌డం ఎన్నో ర‌కాల సందేహాల‌కు తావిస్తోంది. మణిరత్నంతో క్రియేటివ్ డిఫ‌రెన్స్ త‌లెత్తి త‌ప్పుకున్నారా? అన్న సందేహం చ‌ర్చ‌కు తెర తీస్తోంది.