Begin typing your search above and press return to search.

డెకాయిట్.. బీచ్ లో ఏం చేస్తున్నారు?

తన సినిమాలకు తానే కథలు రాసుకోవడంతో పాటు డైరెక్టర్ గా కూడా రానిస్తున్నారు.

By:  Tupaki Desk   |   2 April 2024 6:55 AM GMT
డెకాయిట్.. బీచ్ లో ఏం చేస్తున్నారు?
X

టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోల్లో అడవి శేష్ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న విషయం తెలిసిందే. చేసింది తక్కువ సినిమాలే అయినా.. విలక్షణ నటుడిగా పేరు దక్కించుకున్నారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన స్టార్టింగ్ లో చిన్న రోల్స్ చేసిన అడవి శేష్.. ఇప్పుడు హీరోగా మంచి పాపులర్ అయ్యారు. తన సినిమాలకు తానే కథలు రాసుకోవడంతో పాటు డైరెక్టర్ గా కూడా రానిస్తున్నారు.

ప్రస్తుతం డైనమిక్ హీరో అడవి శేష్ చేతిలో గూఢచారి-2, డెకాయిట్ చిత్రాలు ఉన్నాయి. డెకాయిట్ మూవీలో ఫిమేల్ లీడ్ లో స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ నటిస్తుండగా.. షానియెల్ దేవ్ దర్శకత్వం వహిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ లో డెకాయిట్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. శేష్, శ్రుతి ఇద్దరూ ఒకరినొకరు తుపాకులు ఎక్కు పెట్టుకుని టీజర్ లో కనిపించారు. సినిమాపై అప్పట్లో టీజర్ మంచి ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసింది.

అయితే ఈ సినిమాకు కథను దర్శకుడు షానియెల్‍తో పాటు అడివి శేష్ కూడా రాశారు. టీజర్ తర్వాత ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు మేకర్స్. తాజాగా సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టారు శేష్. "సినిమా అద్భుతంగా తీయడం ఒక్కటే మార్గం. మనం ఎప్పుడూ విజయం సాధించలేం కానీ ప్రయత్నాన్ని ఎప్పటికీ ఆపలేం. షానియెల్ తో డెకాయిట్ చర్చలు" అంటూ క్రేజీ గా క్యాప్షన్ ఇచ్చారు. ఓ బీచ్ లో దిగిన ఫొటోలు కూడా షేర్ చేశారు.

సూర్యోదయం సమయంలో వీరిద్దరూ బీచ్ లో కూర్చుని.. సినిమా గురించి మాట్లాడుకున్నట్లు పిక్స్ చూస్తే అర్థమవుతుంది. బ్లాక్ అండ్ బ్లాక్ లో బీచ్ లో నిల్చుని పోజిచ్చారు అడవి శేష్. సూర్యుడితో క్రేజీగా సెల్ఫీ దిగారు షానియెల్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఫ్యాన్స్ తెగ స్పందిస్తున్నారు. గూఢచారి-2 తో పాటు డెకాయిట్ సినిమాల అప్డేట్స్ ఇవ్వండి అన్నా అంటూ రిక్వెస్ట్ కామెంట్స్ పెడుతున్నారు.

డెకాయిట్ సినిమాను ఎస్ ఎస్ క్రియేషన్స్, సునీల్ నారంగ్ ప్రొడక్షన్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. సుప్రియ యార్లగడ్డ నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. అబ్బూరి రవి డైలాగ్స్ అందిస్తున్నారు. జీవితాలు మార్చుకునేందుకు ఇద్దరు మాజీ ప్రేమికులు.. తప్పని పరిస్థితుల్లో కలిసి దోపిడీలు చేయడమే డెకాయిట్ మూవీ స్టోరీ లైన్ గా తెలుస్తోంది. ఇంటెన్స్ అండ్ లవ్ యాక్షన్ జోనర్ లో రానున్న ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి మరి.