Begin typing your search above and press return to search.

ఏజెంట్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు..?

ఏజెంట్ తర్వాత సూరితో సినిమా చేసే సాహసం చేసేందుకు ఏ హీరో ముందుకు రావట్లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు రెడీ అన్నట్టు టాక్.

By:  Tupaki Desk   |   24 Feb 2024 6:00 AM GMT
ఏజెంట్ డైరెక్టర్ ఏం చేస్తున్నాడు..?
X

టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్స్ లో ఒకరైన సురేందర్ రెడ్డి అతను చేసే సినిమాలకు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఏర్పడేలా చేసుకున్నాడు. కళ్యాణ్ రాం తో అతనొక్కడే సినిమా చేసిన సురేందర్ రెడ్డి మొదటి సినిమాతోనే తన మాస్ టేకింగ్ తో అదరగొట్టాడు. ఇక ఎన్.టి.ఆర్ తో అశోక్, ఊసరవల్లి సినిమాలు చేశాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో రవితేజ చేసిన కిక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అతనే మళ్లీ కిక్ 2 అని తీసి నిరాశపరచాడు. రాం చరణ్ తో ధృవ సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి మెగాస్టార్ చిరంజీవితో సైరా నరసింహారెడ్డి సినిమాతో జస్ట్ ఓకే అనిపించాడు.

సైరా తర్వాతే స్టార్స్ ఎవరు తనకు ఛాన్స్ ఇవ్వకపోవడంతో అఖిల్ తో ఏజెంట్ అంటూ వచ్చాడు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో భారీ అంచనాలతో వచ్చిన ఏజెంట్ కూడా డిజాస్టర్ గా నిలిచింది. అసలే అవకాశాలు లేని టైం లో ఏజెంట్ తో తిరిగి ఫాంలోకి వస్తాడనుకున్న సురేందర్ రెడ్డి సినిమాతో ఫ్లాప్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఏజెంట్ తర్వాత సూరితో సినిమా చేసే సాహసం చేసేందుకు ఏ హీరో ముందుకు రావట్లేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు రెడీ అన్నట్టు టాక్.

సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఒక సినిమా వస్తుందని తెలుస్తుంది. ఆ సినిమా జస్ట్ అనౌన్స్ మెంట్ అయితే ఇచ్చారు కానీ సినిమా ఎప్పుడు మొదలవుతుంది అన్నది రివీల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కమిటైన సినిమాలనే మధ్యలో వదిలి పాలిటిక్స్ లో బిజీ అయ్యాడు. మరి ఇంకా కనీసం మొదలు కూడా పెట్టని సురేందర్ రెడ్డి సినిమా ఎప్పుడు పట్టించుకుంటాడన్నది చెప్పడం కష్టం.

సురేందర్ రెడ్డి మాత్రం ఎప్పుడు పవన్ డేట్స్ ఇస్తే అప్పుడు చేద్దామని సైలెంట్ గా ఉంటున్నాడు. ఏది ఏమైనా ఒకప్పుడు మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా ఉన్న సురేందర్ రెడ్డి ఇలా ఛాన్స్ లు లేక ఖాళీగా ఉండటం మాత్రం ఆయన ఫ్యాన్స్ ని అప్సెట్ అయ్యేలా చేస్తుంది. ఏజెంట్ హిట్ ఐతే పరిస్థితి ఎలా ఉండేదో కానీ ఆ సినిమా నిరాశపరచడంతో ఆ ఎఫెక్ట్ సురేందర్ రెడ్డి కెరీర్ మీద డబుల్ ఇంపాక్ట్ పడేలా చేసింది. పవన్ సినిమా మొదలయ్యే దాకా డౌటే కాబట్టి సురేందర్ రెడ్డి మరో హీరోని వెతుక్కుంటే బెటర్ అని చెప్పొచ్చు.