Begin typing your search above and press return to search.

పాపం పూరీ ఏం పాపం చేశాడు..?

హిట్లు సూపర్ హిట్లు ఎన్నిచ్చినా అది అతని గత చరిత్ర కానీ ప్రస్తుతం అతను పెద్దగా ఫాం లో లేడన్న కారణం చేత అతనికి స్టార్స్ ఎవరు ఛాన్స్ ఇవ్వడం లేదు.

By:  Tupaki Desk   |   2 Feb 2024 8:30 AM GMT
పాపం పూరీ ఏం పాపం చేశాడు..?
X

టాలీవుడ్ లో ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొట్టిన చరిత్ర తనదైనా సరే ఆ డైరెక్టర్ మీద కొందరు హీరోలు ఏమాత్రం కనికరం చూపించట్లేదు. హిట్లు సూపర్ హిట్లు ఎన్నిచ్చినా అది అతని గత చరిత్ర కానీ ప్రస్తుతం అతను పెద్దగా ఫాం లో లేడన్న కారణం చేత అతనికి స్టార్స్ ఎవరు ఛాన్స్ ఇవ్వడం లేదు. అందుకే కొన్ని కాంబినేషన్స్ సెట్ అయినట్టే అయ్యి చివరకు అటకెక్కేస్తున్నాయి.

టాలీవుడ్ లో పూరీ జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. బద్రి సినిమా నుంచి లైగర్ వరకు పూరీ సినిమా అంటే చాలు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పూరీ సినిమాల్లో చేస్తే హీరోల ఇమేజ్ మారడం ఖాయమనే టాక్ కూడా ఉంది. పవన్ తో బద్రి, మహేష్ తో పోకిరి, ప్రభాస్ తో బుజ్జిగాడు ఇలా హీరోలకు ఇదివరకు ఉన్న ఇమేజ్ ని పూర్తిగా మార్చేస్తాడు.

అలాంటి పూరీతో సినిమా అంటే ఒకప్పుడు స్టార్స్ అంతా క్యూ కట్టే వారు కానీ ఆయన ఫాం కోల్పోయాక అతను చేస్తానన్నా సరే హీరోలెవరు ఆసక్తి చూపట్లేదు. మెగాస్టార్ చిరంజీవికి పూరీ గొప్ప అభిమాని. చిరుని ఆప్యాయంగా అన్నయ్య అని పిలిచే వారిలో పూరీ ఒకరు. చిరుతో సినిమా తీయాలనే పూరీ కోరిక ఇప్పటివరకు నెరవేరలేదు. ఆటో జానీ అంటూ పూరీ చిరు కోసం ఒక కథ రెడీ చేయగా సినిమా ఫస్ట్ హాఫ్ బాగున్నా సెకండ్ హాఫ్ బాగాలేదని ఆ ప్రాజెక్ట్ పక్కన పెట్టారట. అయితే పూరీ సినిమా కాదన్నందుకు ఫీల్ అవ్వలేదు కానీ సెకండ్ హాఫ్ బాగాలేదన్న చిరు కామెంట్ ఎవరో థర్డ్ పర్సన్ ద్వారా తెలుసుకోవడం పూరీని బాధపెట్టింది.

మెగాస్టార్ ని డైరెక్ట్ చేసేందుకు పూరీ కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్నాడు. పోనీ ఆ కథ కాదు వేరే కథతో అయినా పూరీతో చిరు సినిమా చేయొచ్చు ఆ ఛాన్స్ కూడా ఇవ్వలేదు. మధ్యలో గాడ్ ఫాదర్ సినిమాలో పూరీ ని వాడుకున్నారు. ఆ టైం లో అయినా పూరీతో కలిసి చిరు పనిచేస్తారేమో అనుకున్నారు కానీ అది జరగలేదు. లేటెస్ట్ గా హరీష్ శంకర్ తో చిరు సినిమా కన్ఫర్మ్ అయ్యిందని అంటున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సుస్మిత కలిసి ఈ సినిమా నిర్మిస్తారని టాక్.

హరీష్ శంకర్ కి డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చిన చిరు పూరీ విషయంలో ఎందుకు ఆలోచించట్లేదు. పూరీ ఏం పాపం చేశాడని పూరీ ఫ్యాన్స్ అంటున్నారు. పూరీ టేకింగ్ లో చిరుని చూడాలనుకున్న మెగా ఫ్యాన్స్ ఆశలు కూడా ఇప్పుడప్పుడే నెరవేరేలా లేవని చెప్పొచ్చు.