Begin typing your search above and press return to search.

వీడియో: ప‌రాఠా తింటున్న పిల్ల ఇదేమి సిత్రం?

తాజాగా నిఖిత షేర్ చేసిన ఓ వీడియో అంత‌ర్జాలంలో దుమారం రేపుతోంది.

By:  Tupaki Desk   |   24 Jan 2024 2:58 PM GMT
వీడియో: ప‌రాఠా తింటున్న పిల్ల ఇదేమి సిత్రం?
X

సోష‌ల్ మీడియాల్లో చెల‌రేగి బోల్డ్ ఫోటోషూట్ల‌ను షేర్ చేయ‌డంలో టీవీ న‌టి నిఖితా శ‌ర్మ త‌ర్వాతే. ఈ బ్యూటీ ఇన్ స్టాను అనుస‌రించేవారికి విజువ‌ల్ ఫెస్ట్ కి కొద‌వేమీ లేదు. తాజాగా నిఖిత షేర్ చేసిన ఓ వీడియో అంత‌ర్జాలంలో దుమారం రేపుతోంది.

ఈ వీడియోలో నిఖిత టూ బోల్డ్ గా క‌నిపిస్తోంది. చూడ‌టానికి సాంప్ర‌దాయ బ‌ద్ధ‌మైన స‌ల్వార్ పంజాబీ దుస్తుల్లో క‌నిపిస్తున్న ఈ భామ టెంప్టింగ్ యాక్టివిటీ కుర్ర‌కారు లో గుబులు రేపుతోంది. త‌న‌ నాభి అందాల‌ను ఎద సౌంద‌ర్యాన్ని ఆవిష్క‌రిస్తూ.. ట్రెడిష‌న‌ల్ లుక్‌ లోను వేడి పెంచ‌డ‌మెలానో చూపించింది. సోష‌ల్ మీడియాల్లో ల‌క్ష‌ల్లో త‌న‌ను అనుస‌రిస్తున్న వారికి ఇది స్పెష‌ల్ ట్రీట్ అన‌డంలో సందేహం లేదు. నిఖిత త‌ర‌చుగా సామాజిక మాధ్య‌మాల్లో త‌న అద్బుత‌మైన వీడియోల‌తో అభిమానుల‌ను పెంచుకుంటోంది. ఒక్కో ఇన్ స్టా పోస్టుకు ల‌క్ష‌ల్లో ఆదాయం ఆర్జిస్తోంది.

నికితాశర్మ తాజా వీడియో పోస్ట్ కి ఆస‌క్తిక‌ర క్యాప్ష‌న్ ని ఇచ్చింది. ``ముంబైలోని ఉష్ణోగ్రత మొదటిసారిగా 14.8 డిగ్రీలకు పడిపోవడంతో, పంజాబ్‌లోని ఒక పొలంలో నా సల్వార్ సూట్‌ను ధరించి వేడి వేడి ఆలూ పరాఠాలను తినాలనే నా ఫాంటసీని నేను బయటపెట్టాను`` అని రాసింది. #feelitreelit #అన్వేషించండి #లక్షణం #ప్రేమ #శీతాకాలం #పంజాబీ #luttputt #luttputtgaya #salwarsuit అంటూ కొన్ని హ్య‌ష్ ట్యాగుల్ని జోడించింది.

దీనికి అభిమానుల నుంచి స్పంద‌న ఇలా ఉంది. ఒక నెటిజ‌న్ ఈ దుస్తుల్లో చాలా అందంగా ఉంది అంటూ పొగిడేశాడు. మ‌రొక‌రు మంత్రముగ్ధులను చేస్తుంది అని కీర్తించ‌గా, రెట్రో వైబ్‌లు అద్భుతంగా ఉన్నాయి.. ఆప్కీ యే బాలా కి ఖుబ్సూర్తీ హయీ అంటూ పొగిడేశాడు మ‌రో అభిమాని.