Begin typing your search above and press return to search.

శేష్ ఎక్స్ శృతి.. ముసుగు వెనక మర్మం ఏంటో..?

అతని నుంచి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా కూడా అలర్ట్ అయ్యేలా క్రేజ్ తెచ్చుకున్నాడు.

By:  Tupaki Desk   |   16 Dec 2023 6:40 AM GMT
శేష్ ఎక్స్ శృతి.. ముసుగు వెనక మర్మం ఏంటో..?
X

టాలీవుడ్ యంగ్ హీరోల్లో డిఫరెంట్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు అడివి శేష్. లిమిటెడ్ బడ్జెట్ తో అతను చేస్తున్న సినిమాలు తెలుగు సినిమాల స్థాయిని పెంచేలా చేస్తున్నాయి. తనకంటూ ఒక టీం ని ఏర్పరచుకుని అడివి శేష్ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి. అందుకే ఏ యువ హీరోకి లేని క్రేజ్ అడివి శేష్ కి ఉంది. అతని నుంచి సినిమా వస్తుంది అంటే ఆడియన్స్ అంతా కూడా అలర్ట్ అయ్యేలా క్రేజ్ తెచ్చుకున్నాడు.


ఇక లేటెస్ట్ గా అడివి శేష్ తన నెక్స్ట్ సినిమా అప్డేట్ తో ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు. శేష్ ఎక్స్ శృతి అంటూ ఒక పోస్టర్ తో వచ్చాడు అడివి శేష్. రీసెంట్ గా అడివి శేష్ పోస్టర్ రిలీజ్ చేశారు. ముసుగుతో ఉన్న శేష్ ఇంటెన్స్ లుక్ ఆడియన్స్ ని ఇంప్రెస్ చేసింది. ఇక లేటెస్ట్ గా శేష్ ఎస్ శృతి నుంచి శృతి హాసన్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. అదే ముసుగుతో శృతి కూడా ఇంటెన్స్ లుక్ తో కనిపించింది.

మరి శేష్ ఎక్స్ శృతి ఈ ముసుగు వెనుక ఉన్న మర్మం ఏంటన్నది తెలియాల్సి ఉంది. అంతేకాదు ఈ సినిమాకు టైటిల్ ని డిసెంబర్ 18న రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. శేష్, శృతి హాసన్ నటిస్తున్న ఈ సినిమాను షానియెల్ డియో డైరెక్ట్ చేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో ఈ సినిమాను సుప్రియ యార్లగడ్డ నిర్మిస్తున్నారు.

క్షణం, గూఢచారి, హిట్ 2, మేజర్ ఇలా తన ప్రతి సినిమాతో తెలుగు ఆడియన్స్ కు సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తున్న అడివి శేష్ ఈసారి నెక్స్ట్ లెవెల్ లో ఆడియన్స్ ని అలరించాలని ఫిక్స్ అయ్యాడు. ఓ పక్క గూడచారి 2 పనులు జరుగుతుండగా శేష్ ఎక్స్ శృతి సినిమాతో థ్రిల్ చేయనున్నాడు. కంటెంట్ ఉన్న సినిమాలతో ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న అడివి శేష్ రాబోతున్న సినిమాలతో కూడా తన టార్గెట్ రీచ్ అవ్వాలని చూస్తున్నాడు. సినిమా టెంప్లేట్ మార్చేస్తున్న అడివి శేష్ తెలుగు తెర మీద సరికొత్త కథ కథనాలను తీసుకొచ్చే ప్రయత్నం లో ఉన్నాడు. శేష్ ఎక్స్ శృతి పోస్టర్స్ తోనే సినిమాపై మంచి బజ్ ఏర్పడుతుండగా సినిమా నుంచి టీజర్ వస్తే కానీ కొంత క్లారిటీ వస్తుందని చెప్పొచ్చు.