Begin typing your search above and press return to search.

రెండేళ్లు అవుతుంది ఆ పాన్ ఇండియా హీరో ఏం చేస్తున్నాడు..?

ఆ సినిమా చూసి సౌత్ ఆడియన్స్ తో పాటుగా నార్త్ సైడ్ ఆడియన్స్ కూడా అతనికి అభిమానులుగా మారారు.

By:  Tupaki Desk   |   23 March 2024 3:15 AM GMT
రెండేళ్లు అవుతుంది ఆ పాన్ ఇండియా హీరో ఏం చేస్తున్నాడు..?
X

K.G.F ముందు వరకు కేవలం కన్నడలోనే హీరోగా కొనసాగిన యష్ ఆఫ్టర్ K.G.F పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు. K.G.F మొదటి రెండు భాగాల్లో రాకీ భాయ్ గా నేషనల్ వైడ్ గా ఆడియన్స్ ని మెప్పించాడు యష్. ప్రేక్షకుల అభిమానం గెలిచేందుకు ఎప్పటినుంచో పరిచయం అవసరం లేదు సరైన ఒక సినిమా చాలని K.G.F తో ప్రూవ్ చేశాడు యష్. ఆ సినిమా చూసి సౌత్ ఆడియన్స్ తో పాటుగా నార్త్ సైడ్ ఆడియన్స్ కూడా అతనికి అభిమానులుగా మారారు.

అయితే K.G.F 1, 2 సినిమాలు పూర్తయ్యాయి. రెండు బ్లాక్ బస్టర్ కొట్టాయి. ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కె.జి.ఎఫ్ రెండో పార్ట్ 2022 లో వచ్చింది. అయితే ఆ సినిమా వచ్చి రెండేళ్లు అవుతున్నా కూడా ఇప్పటికీ యష్ నెక్స్ట్ సినిమా రాలేదు. ఈ మధ్యనే టాక్సిక్ అంటూ తన తర్వాత సినిమా ప్రకటించాడు యష్. లేడీ డైరెక్టర్ గీతు మోహన్ దాస్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో కూడా యష్ మరోసారి నేషనల్ లెవెల్ ఆడియన్స్ ని మెప్పించాలని చూస్తున్నాడు.

K.G.F తో తన సత్తా చాటిన యష్ టాక్సిక్ తో మరోసారి తన స్టామినా ప్రూవ్ చేయాలని చూస్తున్నాడు. అయితే ఇంతకీ టాక్సిక్ కథ ఏంటి సినిమా నేపథ్యం ఏంటన్నది తెలియాల్సి ఉంది. కె.జి.ఎఫ్ రెండు సినిమాల తర్వాత యష్ ఇలా ఒక ఫిమేల్ డైరెక్టర్ తో చేయడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తున్నా తప్పకుండా కె.జి.ఎఫ్ రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా సినిమా వస్తుందని చెప్పొచ్చు. అంతకుముందు ఏమో కానీ యష్ సినిమా అంటే ఇప్పుడు పాన్ ఇండియా ఆడియన్స్ అంతా కూడా అలర్ట్ అవుతారు. వారిని సాటిస్ఫై చేసేలా సినిమా ఉండాల్సి ఉంటుంది.

టాక్సిక్ తో పాటు K.G.F 3 కూడా ఉంటుందని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ అటు ప్రశాంత్ వర్మ కానీ యష్ కానీ కె.జి.ఎఫ్ 3 గురించి మాత్రం నోరు విప్పట్లేదు. కె.జి.ఎఫ్ లో తన హీరోయిజం తో అదరగొట్టిన యష్ టాక్సిస్ తో కూడా పెద్ద ప్లానింగ్ తోనే వస్తున్నాడని తెలుస్తుంది. యష్ టాక్సిస్ సినిమాను 2025 ఏప్రిల్ లో భారీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.