సినిమా ఎప్పుడు సక్సెస్ అయినట్టు? కలెక్షన్స్ వచ్చినప్పుడా... అవార్డ్స్ అందుకున్నప్పుడా? ప్రేక్షకులకు నచ్చినప్పుడా...
సక్సెస్ ఫుల్ మూవీ అంటే ఏంటి? ప్రేక్షకుడికి నచ్చలా? లేదంటే ఎక్కువ కలెక్షన్స్ ను కొల్లగొట్టలా? అవార్డులను అందుకోవాలా? ఏం చేస్తే సినిమా సక్సెస్ అయినట్టు అనే డౌట్ ఇప్పటికే చాలామందికి వచ్చి ఉంటుంది.
By: Tupaki Desk | 16 Sept 2026 6:00 PM ISTప్రేక్షకులు వినోదం కోసం థియేటర్ కి వచ్చి మూడు గంటల పాటు సినిమాను చూసి ఎంజాయ్ చేస్తారు. ఆడియన్స్ రొటీన్ లైఫ్ లో వాళ్లకున్న బాధలను మర్చిపోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటపుడు వాళ్ళు చూసే సినిమాలు వాళ్ళను టెన్షన్ రిలీఫ్ చేయాలి అంతే కానీ వాళ్ళను ఇంకా టార్చర్ పెట్టకూడదు.అందుకే చాలా మంది జనాలు మూవీకైతే సక్సెస్ టాక్ వస్తుందో ఆ సినిమాను చూడటానికి ఇష్టపడతారు. నిజానికి ఒక సినిమా సక్సెస్ అయిందని ఎలా చెబుతారు. విజయానికి కొలమానం ఏంటి అని ప్రశ్నించేవారు కూడా ఉన్నారు. సక్సెస్ ఫుల్ మూవీ అంటే ఏంటి? ప్రేక్షకుడికి నచ్చలా? లేదంటే ఎక్కువ కలెక్షన్స్ ను కొల్లగొట్టలా? అవార్డులను అందుకోవాలా? ఏం చేస్తే సినిమా సక్సెస్ అయినట్టు అనే డౌట్ ఇప్పటికే చాలామందికి వచ్చి ఉంటుంది. దానికి సమాధానం ఏంటి అనేది మాత్రం కొంతమందికి తెలియడం లేదు.
నిజానికి ఒక సినిమా ప్రేక్షకుడికి నచ్చిన కూడా ఆ సినిమాకి కలెక్షన్స్ ఎక్కువగా రాకపోవచ్చు. కాబట్టి ఆ మూవీ కమర్షియల్ గా సక్సెస్ అవ్వలేదని చెబుతారు. కమర్షియల్ గా ఫ్లాప్ అయిందని మాట్లాడుకుంటారు. ఇంకా కొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చవు కానీ సక్సెస్ సాధించాయని ప్రొడ్యూసర్స్ బహిరంగంగా చెబుతుంటారు. ఆ సినిమాలు కలెక్షన్స్ ని ఎక్కువగా వసూలు చేస్తూ ఉంటాయి. దానివల్ల సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయింది కాబట్టి సక్సెస్ అయిందని చెబుతారు. ఇక మరికొన్ని సినిమాలు ప్రేక్షకులకు నచ్చవు, కలెక్షన్స్ రావు కానీ అవార్డులు మాత్రం వస్తాయి... అలాంటి సినిమాని ఫ్లాప్ సినిమా గా పరిగణిస్తూనే ఆ సినిమాకి అవార్డులను ఇస్తారు.
ఒక సినిమా అవార్డు గెలుచుకుంది అంటే ఆ సినిమా సక్సెస్ అయినట్టే కదా అనే చాలామంది అనుకుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో సినిమాలో చెప్పిన మెసేజ్ బాగుంటే ఆ మూవీ ప్లాప్ అయిన కూడా దానికి అవార్డులను అందిస్తారు. నిజానికి ఒక సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది, ఇండస్ట్రీ హిట్ ని అందుకుంది అంటే ఆ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొంది ఉండాలి, అలాగే అప్పటివరకు ఇండస్ట్రీలో ఏ సినిమా వసూలు చేయనంత కలెక్షన్స్ ను రాబట్టాలి. ఇక సినిమాలో ఉన్న కొన్ని క్రాఫ్ట్ లకు అవార్డులు రావాలి. అలాంటప్పుడు మాత్రమే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది.
ఇక ఇదిలా ఉంటే సినిమా హిట్టు ప్లాప్ తో సంబంధం లేకుండా ఒక మూవీని చూసి సగటు ప్రేక్షకుడు ఎంజాయ్ చేసినప్పుడు మాత్రమే ఆ సినిమా సక్సెస్ఫుల్ సినిమా అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలనైతే తెలియజేస్తున్నారు. నిజానికి ప్రేక్షకుడికి నచ్చిన ప్రతి సినిమా కి కలెక్షన్స్ బాగానే వస్తాయి. అలాగే సినిమా సక్సెస్ ని కూడా అందుకుంటుందనేది వాస్తవం. ఈమధ్య కాలంలో వచ్చిన చాలా సినిమాలు కమర్షియల్ హంగులతో వచ్చి ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేయడమే కాకుండా భారీ కలెక్షన్స్ ను కొల్లగొడుతూ ప్రొడ్యూసర్స్ ను సేఫ్ జోన్ లో ఉంచుతున్నాయి...
