Begin typing your search above and press return to search.

మళ్లీ మన నాగార్జునని అలా చూస్తామా..?

ఇప్పటికే రేసులో స్టార్ సినిమాలు రేసులో ఉండగా నాగార్జున నా సామిరంగ కూడా రెడీ అంటూ వచ్చేస్తుంది.

By:  Tupaki Desk   |   16 Dec 2023 7:09 AM GMT
మళ్లీ మన నాగార్జునని అలా చూస్తామా..?
X

కింగ్ నాగార్జున కింగ్ సైజ్ హిట్ అందుకుని చాలా ఏళ్లు అవుతుంది. బంగార్రాజు సినిమా సక్సెస్ అందుకున్నా మళ్లీ ది ఘోస్ట్ డిజాస్టర్ అయ్యింది. అందుకే ఈసారి హిట్ టార్గెట్ తో పర్ఫెక్ట్ ప్లాన్ చేశారు నాగార్జున. విజయ్ బిన్ని డైరెక్షన్ లో నాగార్జున చేస్తున్న సినిమా నా సామిరంగ. 2024 సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ ఫిక్స్ చేశారు. సంక్రాంతి అంటే సినిమాల పోటీ ఎలా ఉంటుందో తెలిసిందే. ఇప్పటికే రేసులో స్టార్ సినిమాలు రేసులో ఉండగా నాగార్జున నా సామిరంగ కూడా రెడీ అంటూ వచ్చేస్తుంది.

ఈ సినిమా ప్రమోషనల్ వీడియోస్ అన్ని ఇంప్రెస్ చేస్తున్నాయి. సినిమా అనౌన్స్ మెంట్ తోనే నాగార్జున మాస్ అప్పీల్ అదరగొట్టగా హీరోయిన్ ఫస్ట్ లుక్, ఇక ఎత్తుకెళ్లిపోతా సాంగ్ అన్ని సినిమాపై మంచి బజ్ పెంచాయి. ఇక లేటెస్ట్ గా సినిమా నుంచి అల్లరి నరేష్ గ్లింప్స్ కూడా వదిలారు. నాగార్జున నరేష్ ఈ కాంబో ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్ పీరియన్స్ ఇవ్వడం పక్కా అనిపిస్తుంది.

నా సామిరంగ సినిమా మలయాళ మూవీ పొరింజు మరియం జోస్ రీమేక్ గా వస్తుంది. సినిమా మీద నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాగార్జున తిరిగి ఫాం లోకి రావాలని అక్కినేని ఫ్యాన్స్ తో పాటుగా సినీ ప్రేక్షకులు కూడా ఎదురుచూస్తున్నారు. నా సామిరంగ అంటూ నాగార్జున బాక్సాఫీస్ మేనియా చూడాలని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.

విలేజ్ బ్యాక్ డ్రాప్.. నాగార్జున మాస్ లుక్.. అల్లరి నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్ ఇవన్నీ నా సామిరంగ సినిమాకు కలిసి వచ్చే అంశాలని చెప్పొచ్చు. సినిమాతో విజయ్ బిన్ని తన దర్శకత్వ ప్రతిభ కనబరచాలని చూస్తున్నాడు. సంక్రాంతికి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా నా సామిరంగ సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది. సంక్రాంతికి తను రిలీజ్ చేసిన సినిమాలు సక్సెస్ అందుకోవడంతో అదే సెంటిమెంట్ తో నాగార్జున మరోసారి నా సామిరంగ అంటూ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటాలని చూస్తున్నాడు. నాగార్జున మాత్రం ఒక ప్లాన్ ప్రకారం నా సామిరంగ ప్రమోషన్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 7 లో కూడా ఈ సినిమా హీరోయిన్ ని పరిచయం చేసిన నాగ్ లాస్ట్ వీక్ M.M.కీరవాణిని కూడా తీసుకొచ్చి నా సామిరంగ సాంగ్స్ మీద కూడా క్రేజ్ ఏర్పడేలా చేశారు.