Begin typing your search above and press return to search.

ఈ వీక్ ఓటీటీలో థ్రిల్ల‌ర్ సినిమాలదే హ‌వా

చూస్తూ ఉండ‌గానే మ‌రో వీకెండ్ వ‌చ్చేసింది. ఈ వీకెండ్ లో ఆడియ‌న్స్ ను అల‌రించేందుకు ప‌లు కొత్త సినిమాలు, సిరీస్‌లు రెడీ అయిపోయాయి.

By:  Tupaki Desk   |   25 July 2025 10:32 AM IST
ఈ వీక్ ఓటీటీలో థ్రిల్ల‌ర్ సినిమాలదే హ‌వా
X

చూస్తూ ఉండ‌గానే మ‌రో వీకెండ్ వ‌చ్చేసింది. ఈ వీకెండ్ లో ఆడియ‌న్స్ ను అల‌రించేందుకు ప‌లు కొత్త సినిమాలు, సిరీస్‌లు రెడీ అయిపోయాయి. ఆల్రెడీ గురువారం థియేట‌ర్ల‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ హరి హ‌ర వీర‌మ‌ల్లు రిలీజ‌వ‌డంతో శుక్ర‌వారం బాక్సాఫీస్ వ‌ద్ద పెద్ద‌ రిలీజులేమీ లేవు. దీంతో ఆడియ‌న్స్ ఓటీటీల వైపు చూస్తున్నారు. అందులో భాగంగానే ఈ వీకెండ్ లో థ్రిల్ల‌ర్ సినిమాలతో పాటూ యాక్ష‌న్ డ్రామాలు, కామెడీ, హార్ర‌ర్, సస్పెన్స్, పీరియాడిక్ జాన‌ర్ల‌లో సిరీస్‌లు, సినిమాలు రిలీజ‌వుతున్నాయి. అందులో భాగంగానే తెలుగు సినిమా షో టైమ్ తో పాటూ విజయ్ ఆంటోనీ మార్గ‌న్, బాలీవుడ్ మూవీ స‌ర్జ‌మీన్ కూడా రిలీజ‌వుతుండ‌టం ఆడియ‌న్స్ కు ఇంట్రెస్ట్ ను పెంచుతున్నాయి. వీటితో పాటూ మంచు విష్ణు క‌న్న‌ప్ప కూడా ఇవాళ నుంచి ఓటీటీలోకి వ‌స్తుంద‌ని వార్తలొచ్చాయి కానీ దానిపై ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌నా లేదు. అయితే ఏయే సినిమాలు, సిరీస్‌లు ఎక్క‌డ స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్‌లో..

మండ‌ల మ‌ర్డ‌ర్స్ అనే బాలీవుడ్ థ్రిల్ల‌ర్ సిరీస్

ట్రిగ్గ‌ర్ అనే కొరియ‌న్ సిరీస్

హ్యాపీ గిల్మోర్2 అనే హాలీవుడ్ కామెడీ మూవీ

ది విన్నింగ్ ట్రై అనే కొరియ‌న్ సినిమా

ఆంటిక్ డాన్ అనే హాలీవుడ్ హార్ర‌ర్ మూవీ

ప్రైమ్ వీడియోలో..

మార్గ‌న్ అనే త‌మిళ సినిమా

రంగీన్ అనే బాలీవుడ్ వెబ్‌సిరీస్

నోవాక్సిన్ అనే హాలీవుడ్ మూవీ

హాట్‌స్టార్‌లో..

స‌ర్జ‌మీన్ అనే బాలీవుడ్ మూవీ

ది ఈస్ట్ర‌న్ ఘాట్ అనే థ్రిల్ల‌ర్ సిరీస్‌

స‌న్‌నెక్ట్స్‌లో..

షో టైమ్ అనే తెలుగు సినిమా

ఎక్స్ & వై అనే క‌న్న‌డ మూవీ

జీ5లో..

సౌంక‌న్ సౌంక‌నీ2 అనే పంజాబీ మూవీ

ల‌య‌న్స్ గేట్ ప్లేలో..

ది ప్లాట్ అనే కొరియన్ మూవీ

జానీ ఇంగ్లీష్ స్టైక్స్ ఎగైన్ అనే హాలీవుడ్ మూవీ

ది స‌స్పెక్ట్ అనే హాలీవుడ్ వెబ్‌సిరీస్