Begin typing your search above and press return to search.

ఇండ‌స్ట్రీలో పెళ్లి భాజాలు మ్రోగుతోన్న వేళ‌!

ఇద్ద‌రు చాలా కాలంగా పీక‌ల్లోతు ప్రేమలో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే. టైంపాస్ ల‌వ్ అని కొన్ని నెగిటివ్ కామెంట్లు వ‌చ్చినా! ఆ జోడీ సీరియ‌స్ నెస్ చూస్తుంటే పెళ్లి వ‌ర‌కూ వెళ్లేలా క‌నిపిస్తోంది.

By:  Tupaki Desk   |   28 Oct 2023 12:32 PM GMT
ఇండ‌స్ట్రీలో పెళ్లి భాజాలు మ్రోగుతోన్న వేళ‌!
X

అన్ని ఇండ‌స్ట్రీలో పెళ్లి భాజాలు బాగానే మోగుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. యాక్ష‌న్ కింగ్ అర్జున్ కుమార్తె వివాహం ఐశ్వ‌ర్య అర్జున్ త్వరలోనే పెళ్ళి పీటలెక్కనుంది. తమిళ నటుడు- దర్శకుడు తంబి రామయ్య కుమారుడు హీరో ఉమాపతితో ఆమె ఏడడుగులు వేస్తుంది. శుక్రవారం ఐశ్వర్య - ఉమాపతిల నిశ్చితార్థం చెన్నైలో జరిగిన సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రు కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు.

ఇప్పుడు పెద్ద‌ల్ని ఒప్పించి ఒక‌ట‌వుతున్నారు.అర్జున్ స్వయంగా నిర్మించిన హనుమాన్ టెంపుల్ లోనే వీరు ఉంగరాలు మార్చుకున్నారు. పెళ్లి తేది ఎప్పుడు? అన్న‌ది త్వ‌ర‌లోనే నిర్ణ‌యిస్తారు. అలాగే న‌వంబ‌ర్ 1వ‌తేదిన మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్- న‌టి లావ‌ణ్య త్రిపాఠి వివాహ బంధంతో ఒక‌టి కాబోతున్న సంగ‌తి తెలిసిందే. ఇట‌లీలో డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుతుంది. ఇప్ప‌టికే కుటుంబ స‌భ్యులు ఇట‌లీ చేరుకుం టున్నారు.

న‌వంబ‌ర్ 1 త‌ర్వాత ఈ జోడీ భార్య‌భార్తుల‌గా హైద‌రాబాద్ లోకాలు పెడ‌తారు. ఆమ‌ధ్య ఈ జంట ఎంగేజ్ మెంట్ ఘ‌నంగా జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. అలాగే న‌టి అమ‌లా పాల్ కూడా రెండ‌వ వివాహం చేసుకుంటుంది. అందాల భామ తన స్నేహితుడు జగత్ దేశాయ్ తో కొంత కాలంగా ప్రేమలో ఉంది. జగత్ పెళ్లి ప్రపోజల్ కు ఓకే చెప్పింది. దీనికి సంబంధించిన వీడియోను జగత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు.

ఈరోజు అమలాపాల్ పుట్టినరోజు. ఈ సందర్భంగా వీడియోను అందరితో పంచుకున్నాడు. దీనికి వెడ్డింగ్ బెల్స్ అనే హ్యాష్ ట్యాగ్ ను జత చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకు ముందు అమ‌లాపాల్ ద‌ర్శ‌కుడు ఏ.ఎల్ విజ‌య్ ని పెళ్లి చేసుకుంది. వివాదాల‌తో ఏడాదికే విడాకులు తీసు కున్నారు. ఇంకా మ‌లైకా ఆరోరా- అర్జున్ కపూర్ కూడా ఎప్పుడైనా పెళ్లి బంధంతో షాకిచ్చే అవ‌కాశా లున్నాయి.

ఇద్ద‌రు చాలా కాలంగా పీక‌ల్లోతు ప్రేమలో మునిగి తేలుతోన్న సంగ‌తి తెలిసిందే. టైంపాస్ ల‌వ్ అని కొన్ని నెగిటివ్ కామెంట్లు వ‌చ్చినా! ఆ జోడీ సీరియ‌స్ నెస్ చూస్తుంటే పెళ్లి వ‌ర‌కూ వెళ్లేలా క‌నిపిస్తోంది. అలాగే త‌మ‌న్నా- విజ‌య్ వ‌ర్మ కూడా అంతే సీరియ‌స్ గా ల‌వ్ చేసుకుంటున్నారు. ఇంత‌కాలం గుట్టు చ‌ప్పుడు కాకుండా ఉన్న జోడీ ఇప్పుడంతా ప‌బ్లిక్ గా చేసేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో పెళ్లి భాజాలు మ్రోగించే క్ర‌మంలోనే జోడీ ఇలా ఓపెన్ అయ్యార‌ని తెలుస్తోంది. ఇంకా బ‌య‌ట‌కు రాని జోడీలు చాలానే ఉన్నాయి. వాళ్లంతా స‌డెన్ స‌ర్ ప్రైజ్ తో షాక్ ఇచ్చే ఛాన్స్ ఉంది.