Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ డైరెక్టర్ ను చూసి నేర్చుకోండి

రామాయణం కథను దర్శకుడు ఓం రౌత్ కాస్త డిఫరెంట్ గ్రాఫిక్స్ తో ప్రజెంట్ చేయాలని ఆలోచించాడు.

By:  Tupaki Desk   |   14 Nov 2023 3:57 PM GMT
ఆదిపురుష్ డైరెక్టర్ ను చూసి నేర్చుకోండి
X

ప్రభాస్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఊరించిన సినిమాలలో ఆదిపురుష్ ఒకటి. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడుగా కనిపించడం తో ఒక్కసారిగా అంచనాలు ఆకాశాన్ని దాటేశాయి. రామాయణం కథను దర్శకుడు ఓం రౌత్ కాస్త డిఫరెంట్ గ్రాఫిక్స్ తో ప్రజెంట్ చేయాలని ఆలోచించాడు. అయితే అతడి ఆలోచన విధానం వెండి తెరపై అంతగా క్లిక్ కాలేదు. పైగా అందులోని గ్రాఫిక్స్ పై కూడా చాలా రకాల నెగటివ్ కామెంట్స్ వచ్చాయి.

అతని మేకింగ్ విధానం చాలా దారుణంగా రివర్స్ షాక్ అయితే ఇచ్చింది. అయితే ఒక విషయంలో మాత్రం దర్శకుడు ఓం ను మెచ్చుకోవాల్సిందే అని కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం ప్రభాస్ సినిమాలకు సంబంధించిన లీక్స్ ఒక రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. ఇంకా అఫీషియల్ గా ప్రకటించని మారుతి ప్రాజెక్టుకు సంబంధించిన లీకులు కూడా గట్టిగానే వస్తున్నాయి.

అంతేకాకుండా లొకేషన్ లోని కొన్ని స్టిల్స్ కూడా బయటకు వచ్చాయి. ఇక రీసెంట్ గా వైజయంతి ప్రొడక్షన్లో రూపొందుతున్న బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ కల్కి కి సంబంధించిన లీక్స్ కూడా ఆశ్చర్యాన్ని కలిగించాయి. పెద్ద సంస్థ నుంచి కూడా ప్రభాస్ సినిమాలకు లీక్స్ ప్రభావం గట్టిగానే పడుతుంది. అలాగే ఆ మధ్య సలార్ నుంచి కూడా కొన్ని పోస్టర్లు లీకైన విషయం తెలిసిందే.

ఇక ఇలా వరుసగా ప్రభాస్ ప్రాజెక్టులకు సంబంధించి ఏదో ఒక విషయం లీక్ అవుతూ చిత్ర యూనిట్ సభ్యులకు షాక్స్ ఇచ్చాయి. కానీ ఒక్క ఆదిపురుష్ లో మాత్రమే ఎలాంటి లీక్స్ కు తావివ్వలేదు. అధికారికంగా ప్రకటించే వరకు ఏదీ కూడా లీక్ కాలేదు. ఆ విధంగా జాగ్రత్తలు తీసుకున్నాడు దర్శకుడు ఓం రౌత్. అతను ప్రత్యేకంగా షూటింగ్ సమయంలో కూడా ఎక్కడ లీక్స్ జరగకుండా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నాడు.

ఓం ప్లానింగ్ పై ప్రభాస్ చాలావరకు ఫిదా అయిపోయాడు. సినిమా దారుణంగా దెబ్బకొట్టినప్పటికీ అతను కష్టపడిన విధానంపై కూడా ప్రభాస్ చాలా మెచ్చుకున్నాడు. ఇక ఏది ఏమైనాప్పటికీ దర్శకుడు ఆదిపురుష్ కంటెంట్ పరంగా నిరాశపరిచినప్పటికి అతని హార్డ్ వర్క్ కు మాత్రం ప్రశంసలు దక్కాయి. ఇక లీక్స్ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్న అతనిని చూసి మిగతా దర్శకులు నేర్చుకోవాలి అని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.