Begin typing your search above and press return to search.

వార్ 2: ఇలా అయితే ఇబ్బందే!

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.. రీసెంట్ గా సైయారా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   5 Aug 2025 10:47 PM IST
After Saiyaara’s Blockbuster, Is YRF Underestimating War 2 Promotions?
X

బాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్.. రీసెంట్ గా సైయారా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. అహాన్ పాండే, అనీత్ పడ్డా లీడ్ రోల్స్ లో నటించిన ఆ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ను మోహిత్ సూరి తెరకెక్కించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ తక్కువ బడ్జెట్ తో నిర్మించి.. సైయారాతో భారీ విజయం సాధించింది.

రిలీజ్ అయ్యి మూడు వారాలు అవుతున్నా.. ఇంకా పెద్ద ఎత్తున వసూళ్లు రాబడుతూనే ఉంది. అదే సమయంలో ఇప్పుడు యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న వార్-2 మూవీ మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానుంది. టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్, బాలీవుడ్ ప్రముఖ నటుడు హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న ఆ సినిమా.. ఆగస్టు 14న రిలీజ్ కానుంది. అయితే సైయారా బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత యష్ రాజ్ ఫిల్మ్స్ ఇప్పుడు రిలాక్స్ మోడ్ లో ఉందని సినీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. భారీ బడ్జెట్ సినిమా అయినా.. వార్-2 ప్రమోషన్స్ ను తక్కువ అంచనా వేస్తుందని టాక్ వినిపిస్తోంది.

దీంతో సినీ ప్రియులు, అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇదే రిపీట్ అయితే ఇబ్బంది తప్పదని అంటున్నారు. సైయారా, వార్-2 రెండూ ఒకటి కాదని అంటున్నారు. సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉన్నా.. కేవలం మౌత్ టాక్ పై ఆధారపడకూడదని సూచిస్తున్నారు. ప్రమోషన్స్ లేకుండా భారీ ఓపెనింగ్స్ వచ్చే ఛాన్స్ లేదని అంటున్నారు.

బాక్సాఫీస్ వద్ద ఎదురుదెబ్బ తగులుతుందని అంటున్నారు. సినిమాపై దేశవ్యాప్తంగా హైప్‌ ను రేకెత్తించడానికి కనీసం రెండు పెద్ద ఎత్తున ప్రమోషనల్ ఈవెంట్స్ అవసరమని చెబుతున్నారు. ఒకటి ఉత్తరాదిలో, మరొకటి దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని అంటున్నారు. మెట్రో నగరాల్లో ప్రమోషన్ అవకాశాలను యూజ్ చేసుకోవాలని చెబుతున్నారు.

ముఖ్యంగా వార్-2 హై బడ్జెట్ మూవీ.. బడా క్యాస్టింగ్ ఉన్న చిత్రం.. స్పై యూనివర్స్ లో భాగంగా తీసిన సినిమా.. కాబట్టి యష్ రాజ్ ఫిల్మ్స్.. తన మార్కెటింగ్ తో ఓ రేంజ్ లో ముందుకు సాగాలని సూచిస్తున్నారు.. టీజర్‌ పై మాత్రమే ఆధారపడటం ఆచరణీయమైన వ్యూహం కాదని అంటున్నారు. మరి ఫ్యూచర్ లో యష్ రాజ్ ఫిల్మ్స్ ఏం చేస్తుందో వేచి చూడాలి.