నార్త్ లో వార్-2 డామినేట్ చేస్తుందా?
ముఖ్యంగా నార్త్ లో వార్-2.. కూలీ మూవీపై థియేటర్స్ విషయంలో డామినేట్ చేస్తుందని క్లియర్ గా తెలుస్తోంది. 90 శాతం సింగిల్ స్క్రీన్స్ ను పొందిందని సమాచారం.
By: M Prashanth | 10 Aug 2025 2:25 PM ISTఆగస్టు 14.. ఇప్పుడు ఈ డేట్ పైనే మూవీ లవర్స్ ఫోకస్ అంతా ఉంది. ఆ రోజు బాక్సాఫీస్ వద్ద భారీ క్లాష్ జరగనున్న విషయం తెలిసిందే. వార్-2, కూలీ సినిమాలు ఒకే రోజు గ్రాండ్ గా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇప్పటికే ఆ రెండు సినిమాలు అన్ని పనులు పూర్తి చేసుకుని.. రిలీజ్ కు సిద్ధమవుతున్నాయి.
పాన్ ఇండియా రేంజ్ లో కూలీ, వార్-2 సందడి చేయనున్నాయి. రిలీజ్ కు ఇంకా మూడు రోజులే ఉండగా.. మేకర్స్ ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. అయితే ఇప్పుడు వార్-2.. ఇండియా వైడ్ గా 5000 స్క్రీన్స్ లో రిలీజ్ కానుందని తెలుస్తోంది. హిందీ, తమిళ, తెలుగు భాషల్లో సినిమా విడుదల కానున్న విషయం తెలిసిందే.
కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో హిందీ వెర్షన్ కూడా రిలీజ్ కానుంది. ఐమాక్స్, డాల్బీ వంటి ప్రీమియం ఫార్మాట్స్ లో రానుంది. 2019లో వార్ బాక్సాఫీస్ కౌంట్ ను మించిపోయేలా యష్ రాజ్ ఫిల్మ్స్.. ఇప్పుడు వార్-2 రిలీజ్ ను ప్లాన్ చేస్తుందని సమాచారం. భారీ ఓపెనింగ్స్ రాబట్టేలా సిద్ధమవుతుందని వినికిడి.
ముఖ్యంగా నార్త్ లో వార్-2.. కూలీ మూవీపై థియేటర్స్ విషయంలో డామినేట్ చేస్తుందని క్లియర్ గా తెలుస్తోంది. 90 శాతం సింగిల్ స్క్రీన్స్ ను పొందిందని సమాచారం. మల్టీప్లెక్స్ స్లాట్ లలో 15-20 శాతం మాత్రమే కూలీ మూవీ కైవసం చేసుకోగలిగిందని తెలుస్తోంది. అందులో హిందీ డబ్బింగ్ వెర్షన్ కూడా ఉంది.
అదే సమయంలో వార్-2 మూవీపై హైప్ క్రమంగా పెరుగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ 2025 ఆగస్టు 10న దేశవ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి. టికెట్ ధరలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని తెలుస్తోంది. దీంతో వార్-2 మూవీకి పెద్ద ఎత్తున ఓపెనింగ్స్ నమోదు అవుతాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు.
అయితే యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో ఇప్పటికే వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు కూడా రాబట్టాయి. ఇప్పుడు వార్ 2 YRF స్పై యూనివర్స్ కు కొత్త బెంచ్ మార్క్ ను చేస్తుందో లేదోనని అంతా వెయిట్ చేస్తున్నారు. మరి వార్ సీక్వెల్ ఎలాంటి హిట్ అవుతుందో.. ఎంతటి వసూళ్లు సాధిస్తుందో వేచి చూడాలి.
