Begin typing your search above and press return to search.

వార్ 2 బుకింగ్స్ డల్.. అసలు కారణమిదే!

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా వార్ 2 రిలీజ్ కు రెడీ అయ్యింది. మరో 8 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది.

By:  M Prashanth   |   6 Aug 2025 5:56 PM IST
వార్ 2 బుకింగ్స్ డల్.. అసలు కారణమిదే!
X

జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా వార్ 2 రిలీజ్ కు రెడీ అయ్యింది. మరో 8 రోజుల్లో ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయాన్ ముఖర్జీ తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. అయితే ఓవర్సీస్ లో యూఎస్ఏ మార్కెట్ లో సాధారణంగానే తారక్ కు మంచి మార్కెట్ ఉంటుంది.

అయితే ఆ మార్కెట్ టికెట్ బుకింగ్స్ లో కనిపించడం లేదు. అమెరికా జోన్ లో వార్ 2 ప్రీ బుకింగ్స్ డల్ గా సాగుతున్నాయి. తారక్ కు స్ట్రాంగ్ జోన్ గా భావించే యూఎస్ ఎలోనే ఇది ఇలాగే కొనసాగితే మేకర్స్ కు పెద్ద దెబ్బే అవుతుంది. మరి ఈ సినిమాకు పరిస్థితి ఇలా ఎందుకు ఉంది? అనేది పరిశీలిస్తే..

టికెట్ ధరలు ఎక్కువగా ఉండడమే లో బుకింగ్స్ కు ప్రధాన కారణం అని తెలుస్తుంది. దీనికి హిందీతో పోలిస్తే.. తెలుగు టికెట్ రేట్ ఎక్కువగా ఉందని ఓ నెటిజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఒకే థియేటర్, ఒకే సినిమా అయినప్పటికీ హిందీ కంటే తెలుగు వెర్షన్ టికెట్ ధర అధికంగా ఉందని అన్నారు. యూఎస్ సినీ మార్క్ లో ఒకే థియేటర్ హెచ్ డీలోనే హిందీ కంటే తెలుగు షో దాదాపు డబుల్ ఉందని వాపోయారు.

హిందీ షో లో రెండు టికెట్లకు 36 డాలర్లు ఉండగా, అదే థియేటర్ లో తెలుగు వెర్షన్ కు రెండు టికెట్లకు 60 డాలర్లు ప్రైజ్ పడుతుంది. అదీనూ ఇది డబ్బింగ్ సినిమా. ఒకే సినిమా. అన్ని సీన్స్ సేమ్. మరి టికెట్ ధరలో మార్పు ఎందుకు. ఏం మారింది. ఇక్కడ అభిమానులు మా హీరోకు ఎక్కువ వసూళ్లు ఉండాలని అనుకుంటున్నారు. తప్పులేదు.

కానీ, మేకర్స్ ఓవైపు ఆర్టిస్టులు రెండేళ్ల కష్టం, ఎమోషన్స్ అందుకే టికెట్ ధరలు పెంచుతున్నాం అని చెబుతున్నారు. అది తప్పు కాదు. కానీ, ఇక్కడ ఎమోషన్సా, ఫ్రీ మార్కెట్ ఆ అనేది ఒకటే ఎంచుకోవాలి. మరి ఫ్యాన్స్ కుూడా కష్టపడుతున్నారు. మరి వాళ్లకు ఫ్రీ గా షో వేస్తున్నారా? లేదు కదా! ఇంకా డబుల్ ఛార్జ్ చేస్తున్నారు. ఇందతా బిజినెస్ అన్నప్పుడు ఎమోషన్స్ ఎందుకు వస్తాయి? అని ప్రశ్నించారు.

కాగా, ప్రస్తుతానికైతే బుకింగ్స్ డల్ గా ఉన్నాయి. ప్రమోషన్స్ తో పెరిగితే ఏమైనా రానున్న రోజుల్లో పెరగవచ్చు. అలాగే రిలీజ్ రోజు టాక్ బాగుంటే కలెక్షన్లు వస్తాయి. ఇక ఇందులో ఎన్టీఆర్ తోపాటు హృతిక్ రోషన్, కియారా అద్వాణీ నటించారు. యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమా నిర్మించింది.