వార్2 ఈవెంట్ పై క్లారిటీ ఇచ్చిన మేకర్స్
బ్లాక్ బస్టర్ వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు.
By: Sravani Lakshmi Srungarapu | 28 July 2025 4:08 PM ISTసోషల్ మీడియా విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఎవరో ఒకరు సరదాకు చేసిన పోస్టులను కూడా అందరూ నమ్మేసి వాటిని తెగ ప్రచారం చేసి, ఆఖరికి అదే నిజమేమో అనేలా చేస్తున్నారు. ఇప్పుడు వార్2 సినిమాకు సంబంధించిన అలాంటి వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా వార్2.
బ్లాక్ బస్టర్ వార్ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. అటు ఎన్టీఆర్, ఇటు హృతిక్ ఇద్దరూ మంచి నటులు కావడంతో వార్2 సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. అందుకే ఈ సినిమా గురించి ఏ వార్త వచ్చినా అది క్షణాల్లో వైరల్ అయిపోతుంది. ఆగస్ట్ 14న వార్2 రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
విజయవాడలో వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో వార్2 సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ పై నెట్టింట భారీ డిస్కషన్సే జరుగుతున్నాయి. అందులో భాగంగానే వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో జరగనుందని, ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ఇద్దరూ హాజరనున్నారని వార్తలు రాగా, అందరూ ఆ వార్తల్ని నిజమని నమ్ముతున్నారు.
అవన్నీ ఊహాగానాలే..
అయితే ఈ వార్తలపై చిత్ర మేకర్స్ తాజాగా స్పందించి క్లారిటీ ఇచ్చారు. వార్2 ఈవెంట్ విషయంలో ఇంకా ఎలాంటి డెసిషన్ తీసుకోలేదని, ఇంకా ఎక్కడ చేయాలనేది డిసైడ్ అవలేదని, ఈవెంట్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాక అఫీషియల్ గా అనౌన్స్ చేస్తామని, ఈవెంట్ కు సంబంధించి వస్తున్న వార్తలన్నీ కేవలం ఊహాగానాలే చెప్పడంతో వార్2 ప్రీ రిలీజ్ ఈవెంట్ విజయవాడలో అనే వార్తలకు చెక్ పెట్టినట్టైంది.
దేవర ప్రీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ కు నిరాశ
కాగా గతంలో ఎన్టీఆర్- కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ సరిగ్గా ప్లాన్ చేయకపోవడంతో ఆఖరి నిమిషంలో క్యానిల్స్ అయింది. దాంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. అందుకే ఈసారి ఈవెంట్ విషయంలో ఎలాంటి గందరగోళం జరక్కుండా ఉండేందుకు వార్2 మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. భారీ అంచనాలతో రిలీజ్ కానున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా, ఇప్పటికే రిలీజైన వార్2 ట్రైలర్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది.
