వార్ 2: స్పై యూనివర్స్ లో అతిపెద్ద రన్ టైమ్!
బాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) ప్రతి చిత్రాన్ని కొత్త హైప్‌తో తెస్తోంది.
By: M Prashanth | 31 July 2025 12:00 AM ISTబాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ హౌస్ యశ్ రాజ్ ఫిలిమ్స్ (YRF) ప్రతి చిత్రాన్ని కొత్త హైప్‌తో తెస్తోంది. స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతున్న "వార్ 2"పై ఆడియన్స్ లోనే కాదు, ఇండస్ట్రీలోనూ భారీ ఆసక్తి నెలకొంది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలు కలిసి నటించడం, అలానే బాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ హ్యాండిల్ చేయడం సినిమాకే కొత్త మేజిక్‌ని ఇచ్చింది. మొదటి భాగమైన వార్ (2019) సూపర్ హిట్ కావడంతో, ఫ్యాన్స్ ఈ సారి మరింత భారీ ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఎదురుచూస్తున్నారు. ఇక రన్ టైమ్ లో కూడా సినిమా న్యూ రికార్డ్ సెట్ చేసింది.
ఎన్టీఆర్ డెబ్యూ - సరికొత్త పాత్ర
"వార్ 2"లో ఎన్టీఆర్ హిందీ సినిమాల్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడం మేజర్ హైలెట్. స్టైలిష్ కింగ్ హృతిక్ రోషన్‌తో కలిసి తెరపైన కనిపించనుండటంతో, ఈ కాంబినేషన్‌పై అంచనాలు మాములుగా లేవు. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఎన్టీఆర్ కనబడతాడని టాక్. ఇక హీరోయిన్‌గా కియారా అద్వానీ నటిస్తోంది. ఈసారి యాక్షన్ సీన్లు, విఎఫ్ఎక్స్ వర్క్‌పై మేకర్స్ భారీగా ఖర్చు చేసినట్టు సమాచారం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు మంచి స్పందన లభించింది. తెలుగు థియేట్రికల్ రైట్స్‌ను ఎస్. నాగవంశీ భారీ మొత్తానికి దక్కించుకున్నారు.
వార్ 2 - లెంగ్త్ స్పెషల్ హైలైట్
ఈసారి “వార్ 2”లో ప్రత్యేకమైన అంశం రన్ టైమ్. ఇప్పటి వరకు YRF స్పై యూనివర్స్‌లో వచ్చిన అన్ని సినిమాల్లో కూడా ఇదే లెంగ్తియస్ట్ ఫిల్మ్‌గా నిలవనుంది. సినిమా మొత్తంగా 3 గంటల 5 నిమిషాల నిడివితో థియేటర్లకు రాబోతోంది. సాధారణంగా యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు మూడు గంటలకు పైగా నిడివి అరుదుగా ఉంటే, ఈ మూవీ మాత్రం ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో అదిరిపోయే అనుభూతిని ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ ప్రయోగంపై ఇండస్ట్రీలోనే చర్చ మొదలైంది.
స్పై యూనివర్స్ కు కొత్త రికార్డ్
YRF స్పై యూనివర్స్‌లో వరుసగా సక్సెస్‌లు వచ్చాయి. టైగర్, పఠాన్, వార్ మొదటి భాగాలు బాక్సాఫీస్‌లో కలెక్షన్ల వర్షం కురిపించాయి. ఈ సారి ఎన్టీఆర్, హృతిక్ కాంబినేషన్‌తో కంటెంట్‌ను విస్తృతంగా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఎక్కువ నిడివిని ఉపయోగించారని సమాచారం. కథనాన్ని డీప్‌గా, ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్‌ను జోడించి, ట్రేడ్ మార్క్ హై వాల్యూ ప్రొడక్షన్ అందించేందుకు టీమ్ ప్రయత్నించింది.
వార్ 2 సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ మార్కెట్‌ను మల్టిప్లై చేసేలా ప్రీ రిలీజ్ బిజినెస్‌తో మేకర్స్ ముందుకెళ్లారు. హృతిక్ రోషన్ క్రేజ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా ఫాలోయింగ్ ఈ చిత్రానికి అదనపు బలంగా మారాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్‌తో పాటు, మాస్ సెంటర్స్‌లోనూ భారీ ఓపెనింగ్స్ రావొచ్చని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా భారీగా రిలీజ్ కానున్న ఈ మూవీ, బాలీవుడ్ స్పై యూనివర్స్‌లో మరో రికార్డ్ గా నిలుస్తుందనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరి సినిమా ఎలాంటి ఓపెనింగ్స్ ను అందుకుంటుందో చూడాలి.
