Begin typing your search above and press return to search.

వార్ 2 హృతిక్ తో మొదలు.. ఎన్టీఆర్ తో పూర్తి..!

ఎన్టీఆర్ హృతిక్ కలిసి నటించిన వార్ 2 సినిమా మరో వారం రోజుల్లో రాబోతుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు.

By:  Ramesh Boddu   |   6 Aug 2025 1:15 PM IST
వార్ 2 హృతిక్ తో మొదలు.. ఎన్టీఆర్ తో పూర్తి..!
X

ఎన్టీఆర్ హృతిక్ కలిసి నటించిన వార్ 2 సినిమా మరో వారం రోజుల్లో రాబోతుంది. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాను యశ్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నువ్వా నేనా అనే రేంజ్ లో నటించారు. ఇప్పటికే సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా బజ్ తెచ్చింది. ఐతే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎంట్రీ పై ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.

30 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ..

సినిమా మొదలైన 30 నిమిషాల తర్వాత ఎన్టీఆర్ ఎంట్రీ ఉంటుందట. ఒక హై యాక్షన్ సీన్ తోనే తారక్ ఎంట్రీ ఉంటుందని తెలుస్తుంది. ఇక అప్పటి నుంచి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరి మధ్య ఎత్తులు పై ఎత్తులతో సినిమా అంతా ఎంగేజింగ్ గా ఉంటుందట. ముఖ్యంగా తెర మీద హృతిక్, ఎన్టీఆర్ మధ్య ఫైట్ సీక్వెన్స్ లు అదిరిపోతాయని అంటున్నారు. ఎన్టీఆర్ ఎంట్రీకి ముందు హృతిక్ రోషన్ ఎలివేషన్స్ ఉంటాయట.

ఐతే సినిమా మొదలు పెట్టడం హృతిక్ తో మొదలు పెట్టినా పూర్తి చేయడం మాత్రం ఎన్టీఆర్ తో చేస్తారట. సో డెఫినెట్ గా వార్ 2 సినిమా ఫ్యాన్స్ కి ఒక మంచి ఐ ఫీస్ట్ ఇచ్చేలా ఉంది. ఎన్టీఆర్ ఎనర్జీని అయాన్ ముఖర్జీ ఎలా వాడుకున్నాడనే ఎగ్జైటింగ్ ఫ్యాన్స్ లో ఉంది. తప్పకుండా ఈ సినిమాతో ఎన్టీఆర్ వైడ్ రేంజ్ స్టామినా ఏంటన్నది నేషనల్ వైడ్ గా డిస్కషన్ అవుతుంది.

ఫైట్స్ మాత్రమే కాదు ఇద్దరు కలిసి డాన్స్..

ఎన్టీఆర్ హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా స్పై థ్రిల్లర్ గా రాబోతుంది. ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. సినిమా ట్రైలర్ లో అయితే యాక్షన్ సీన్స్ వేరే లెవెల్ అనిపించాయి. ఐతే ఎన్టీఆర్, హృతిక్ కలిసి ఫైట్స్ మాత్రమే కాదు ఇద్దరు కలిసి డాన్స్ కూడా చేశారట. ఐతే ప్రమోషన్స్ లో ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారు మేకర్స్. అయాన్ ముఖర్జీ అంతకుముందు బ్రహ్మాస్ర సినిమాతో తెలుగు ఆడియన్స్ ని పలకరించాడు. ఇప్పుడు వార్ 2తో వస్తున్నాడు. ఇండిపెండెన్స్ వీకెండ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తున్న వార్ 2 కి ఎలాంటి హంగామా ఉంటుందో చూడాలి.

వార్ 2 సినిమాను హిందీ, తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా తెలుగు ప్రమోషన్స్ ని భారీగా ప్లాన్ చేస్తున్నారట. హృతిక్ రోషన్ కూడా తెలుగు ఈవెంట్ లో పాల్గొనేలా చూస్తున్నారట. వార్ 2 తెలుగు రిలీజ్ ని సితార నాగ వంశీ చేస్తున్నారు. విజయవాడలో వార్ 2 ఈవెంట్ ప్లానింగ్ ఉందని టాక్. అఫీషియల్ కన్ ఫర్మేషన్ రావాల్సి ఉంది.