Begin typing your search above and press return to search.

హృతిక్ పొటెన్షియల్ తక్కువ అంచనా వేశారు..!

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా గురువారం రిలీజై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

By:  Ramesh Boddu   |   17 Aug 2025 2:45 PM IST
హృతిక్ పొటెన్షియల్ తక్కువ అంచనా వేశారు..!
X

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా గురువారం రిలీజై ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని ఎందుకు తీసుకున్నారా అన్న డౌట్ వచ్చింది. ఐతే యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్ కి సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందుకే అలాంటి స్పై సినిమాలో తనకు అవకాశం రావడం తో ఎన్టీఆర్ నో చెప్పే ఛాన్స్ లేకుండా పోయింది. అదీగాక యష్ రాజ్ ఫిలింస్ బ్యానర్ తోనే బాలీవుడ్ కి తను ఇంట్రడ్యూస్ అయితే బాగుంటుందని ఫిక్స్ అయ్యాడు.

వార్ 2 లో తారక్ ఎంట్రీ..

హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరు దాదాపు సినీ కెరీర్ ఒకేసారి మొదలు పెట్టారు. ఇద్దరు తమ స్టార్డం తో ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ఐతే వార్ 2 లో తారక్ ఎంట్రీ తో సినిమా రేంజ్ పెరిగిపోయింది. నేషనల్ లెవెల్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సూపర్ ఎగ్జైట్ అయ్యారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో వార్ 2 పై ఈ రేంజ్ బజ్ ఉంది అంటే అది ఎన్టీఆర్ వల్లే అని తెలిసిందే.

ఐతే కలెక్షన్స్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ హంగామా కనిపించట్లేదు. వార్ 2 తెలుగు వెర్షన్ యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఐతే పోటీగా రిలీజైన కూలీ దీని కన్నా బెటర్ గా ఉండటంతో ఆ సినిమా చూడటానికి ఆడియన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతేకాదు రిలీజ్ ముందు అంతా ఎన్టీఆరే హృతిక్ రోషన్ ది ఏమి లేదని అనుకున్నారు. కానీ బాలీవుడ్ లో సినిమా కాస్త కూస్తో నిలబడింది అంటే అది హృతిక్ రోషన్ వల్లే.

హృతిక్ రోషన్ రియల్ స్టామినా..

బీ టౌన్ ఆడియన్స్, హృతిక్ ఫ్యాన్స్ కి సినిమాలో అతని లుక్, స్టైల్ బాగా నచ్చేశాయి. వార్ 2 రిలీజ్ ముందు అంతా ఎన్టీఆర్ గురించి మాట్లాడుకున్నారు కానీ హృతిక్ రోషన్ పొటెన్షియల్ ఏంటన్నది రిలీజ్ తర్వాత తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ ఫైటర్ కూడా హృతిక్ రోషన్ ని నిరాశపరచింది. కానీ వార్ 2 లో హృతిక్ రోషన్ యాక్టింగ్ భలే నచ్చేసింది.

సో వార్ 2 లో ఎన్టీఆర్ వల్ల హృతిక్ రోషన్ రియల్ స్టామినా తెలిసేలా చేసింది. ఐతే వార్ 2 కమర్షియల్ లెక్కలు ఎలా ఉన్నా హృతిక్ రోషన్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాడట. పోటీగా కూలీ రావడం వల్ల కంపారిజన్ ఇంకా కలెక్షన్స్ తగ్గాయని అంటున్నారు కానీ వార్ 2 లో సోలోగా వచ్చి ఉంటే మాత్రం హృతిక్, ఎన్ టీ ఆర్ కాంబోని ఎంజాయ్ చేసే వాళ్లు.