Begin typing your search above and press return to search.

వార్ 2 ఎఫెక్ట్.. ఎన్టీఆర్ ని అన్ ఫాలో కొట్టిన హృతిక్.. అసలు ట్విస్ట్ ఇదే!

ఇకపోతే వార్ 2 సినిమా కథ పరంగా ఒక వర్గం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు అని సమాచారం.

By:  Madhu Reddy   |   20 Aug 2025 1:39 PM IST
War 2 Buzz: Hrithik–NTR Rumors Stir Fans
X

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ జంటగా వచ్చిన చిత్రం 'వార్ 2'. 'వార్' మూవీకి కొనసాగింపుగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో.. యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్టు 14వ తేదీన అటు రజినీకాంత్ 'కూలీ' సినిమాకు పోటీగా హిందీ, తెలుగు, తమిళ్ భాషలలో ఈ సినిమా విడుదలయ్యింది. విడుదలకు ముందు ఎటువంటి అంచనాలు లేకపోయినా.. విడుదల తర్వాత రెండు రోజుల్లోనే రూ.100 కోట్ల క్లబ్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కూలీ సినిమాతో పోటీ పడుతూ కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. మొదటి రెండు రోజులు కలెక్షన్లు బాగానే వచ్చినా మూడవ రోజు నుంచి కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. దీనికి తోడు అకాల వర్షాలు.. పలు ప్రాంతాలలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేయడం వల్ల థియేటర్లలోకి నీరు చొరబడి ప్రదర్శనకు అంతరాయం కలుగుతోంది. దీంతో చాలా థియేటర్లు అడపాదడపా మాత్రమే రన్ అవుతున్నట్లు సమాచారం.

వార్ 2 ఎఫెక్ట్.. ఎన్టీఆర్ ను అన్ ఫాలో కొట్టిన హృతిక్.

ఇకపోతే వార్ 2 సినిమా కథ పరంగా ఒక వర్గం ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేదు అని సమాచారం. పైగా ఈ సినిమా ద్వారా టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ బాలీవుడ్ రంగ ప్రవేశం చేశారు.. ఇందులో విలన్ గా తన నటనతో ఆకట్టుకున్నారు.. కానీ ఎన్టీఆర్ ఇమేజ్ కి తగ్గ సినిమా కాదు అని వార్తలు వినిపించాయి. దీనికి తోడు కొంతమంది ఈ సినిమాపై నెగటివ్ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడు వార్ 2 నటులకు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. హృతిక్ రోషన్ తన ఇంస్టాగ్రామ్ లో ఎన్టీఆర్ ని అన్ ఫాలో చేశారు అని.. ఇదంతా వార్ 2 ఎఫెక్ట్ అంటూ వార్తలు వైరల్ చేస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే..?

అసలు విషయంలోకి వెళ్తే.. ఆగస్టు 14వ తేదీన భారీ అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా అంచనాలను అందుకోలేకపోయింది అని.. ఈ సినిమా ఎఫెక్ట్ తోనే హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ ని ఇంస్టాగ్రామ్ లో ఫాలో అవ్వకుండా ఆపేశాడని ఇప్పుడు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. హృతిక్ రోషన్ ఎప్పుడూ కూడా ఎన్టీఆర్ ని ఫాలో అవ్వలేదు. కానీ ఇద్దరు స్టార్స్ మధ్య ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సెలబ్రిటీల ఫాలోవర్స్ విషయానికొస్తే.. ఇంస్టాగ్రామ్ లో హృతిక్ కి 42.9 మిలియన్ల మంది ఫాలోవర్లుఉన్నారు. 422 ఖాతాలను ఆయన ఫాలో అవుతున్నారు. అటు ఎన్టీఆర్ కి 8.1 మిలియన్ మంది ఫాలోవర్స్ ఉండగా.. ఆయన మాత్రం ఎవరిని ఫాలో అవలేదు. ఇకపోతే ఫాలో అవ్వకుండానే అన్ ఫాలో అవుతున్నారని రూమర్స్ క్రియేట్ చేయడంతో అభిమానులు మండిపడుతున్నారు.

వార్ 2 కలెక్షన్స్..

ఇదిలా ఉండగా వార్ 2 సినిమా వరల్డ్ వైడ్ గా రూ.300 కోట్లు వసూలు చేసిందని యష్ రాజు ఫిలిమ్స్ బ్యానర్ వారు ఒక కొత్త పోస్టర్ విడుదల చేశారు. అయినా సరే ఇలాంటి రూమర్స్ రావడం ఆశ్చర్యం అనే చెప్పాలి.