Begin typing your search above and press return to search.

మేకింగ్‌ వీడియో : ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ కలిస్తే..!

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌, టాలీవుడ్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన 'వార్‌ 2' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

By:  Ramesh Palla   |   19 Aug 2025 4:31 PM IST
మేకింగ్‌ వీడియో : ఇద్దరు సూపర్‌ స్టార్స్‌ కలిస్తే..!
X

బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్ రోషన్‌, టాలీవుడ్‌ స్టార్‌ ఎన్టీఆర్‌ కలిసి నటించిన 'వార్‌ 2' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఏడాది కాలంగా ఊరిస్తూ వచ్చిన వార్‌ 2 ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది అంటూ కొందరు ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేశారు. కొందరు మాత్రం ఎన్టీఆర్‌కి మంచి బాలీవుడ్‌ ఎంట్రీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కథ, ఇతర విషయాలను పక్కన పెడితే స్క్రీన్‌ పై ఎన్టీఆర్‌, హృతిక్ రోషన్‌లను అలా చూస్తూ ఉండి పోవాలి అనిపించిందని కొందరు అంటున్నారు. ఓవరాల్‌గా సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. అందుకు తగ్గట్లుగానే డీసెంట్‌ ఓపెనింగ్‌ కలెక్షన్స్ నమోదు అయినట్లుగా బాక్సాఫీస్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. హృతిక్‌ రోషన్‌ ఈ సినిమాతో బాక్సాఫీస్‌ వద్ద రికార్డ్‌ బ్రేకింగ్‌ భారీ విజయాన్ని సొంతం చేసుకుంటాడని ఆశించిన ఫ్యాన్స్‌కి మాత్రం నిరాశే మిగిలింది.

వార్‌ 2 తో ఎన్టీఆర్‌ బాలీవుడ్‌ ఎంట్రీ

ఎన్టీఆర్‌ హిందీ డెబ్యూ సైతం పాజిటివ్‌ రివ్యూలను సొంతం చేసుకుంది. కొందరు నెగటివ్‌ కామెంట్స్ చేయడం, కొందరు ఎన్టీఆర్‌ మార్ఫింగ్‌ ఫోటోలతో విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. వాటన్నింటిని పక్కన పెడితే తాజాగా సినిమాలోని సూపర్‌ హిట్‌ సాంగ్‌ జనాబ్‌ ఏ ఆలీ పాటకి మంచి రెస్పాన్స్‌ దక్కింది. సిల్వర్ స్క్రీన్‌ పై ఇద్దరు స్టార్స్‌ డాన్స్‌ చేస్తూ ఉంటే, అది కూడా పోటా పోటీగా కలిసి డాన్స్ చేస్తుంటే చూపు తిప్పుకోలేక పోయాం అని అభిమానులతో పాటు అంతా కూడా చెబుతున్నారు. ఆ పాట వల్ల సినిమా స్థాయి మరింతగా పెరిగింది. ప్రేక్షకులు నిరుత్సాహంతో బయటకు రాకుండా ఒక మంచి ఉత్సాహంతో బయటకు వచ్చే విధంగా ఈ పాట ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఆ పాటకు సంబంధించిన మేకింగ్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

హృతిక్‌ రోషన్‌, ఎన్టీఆర్‌ల డాన్స్‌

జనాబ్‌ ఏ అలీ పాట మేకింగ్‌ వీడియోను నిర్మాణ సంస్థ షేర్‌ చేసింది. మేకింగ్‌ వీడియోలో హృతిక్‌ రోషన్‌ మాట్లాడాడు. ఒక వైపు డాన్స్ ప్రాక్టీస్‌ చేస్తున్న విజువల్స్ వేయడంతో పాటు, మరో వైపు హృతిక్‌ రోషన్‌ మాట్లాడుతున్న మాటలను వేయడం జరిగింది. అలా ఈ పాట స్థాయి అమాంతం పెరిగింది. హృతిక్‌ రోషన్‌ మాట్లాడుతూ ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు. తన పాతికేళ్ల సినీ కెరీర్‌లో ఇలాంటి ఒక నటుడిని, డాన్సర్‌ను చూడలేదు అన్నట్లుగా వ్యాక్యలు చేశాడు. ప్రతి చిన్న విషయాన్ని కూడా చాలా లోతుగా చూడటంతో పాటు, తోటి వారి పట్ల చాలా గౌరవంగా ఉంటూ ప్రతి విషయాన్ని అడిగి మరీ తెలుసుకుంటాడని హృతిక్‌ రోషన్‌ చెప్పుకొచ్చాడు. హృతిక్‌ రోషన్‌ మేకింగ్‌ వీడియోలో ఎన్టీఆర్‌ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ తెగ షేర్‌ చేస్తున్నారు.

సోషల్‌ మీడియాలో నెగిటివిటీ

ఎన్టీఆర్‌ వార్‌ 2 తో బాలీవుడ్‌లో సాలిడ్‌ ఎంట్రీ ఇస్తే ముందు ముందు మరిన్ని హిందీ సినిమాలకు కమిట్‌ అవుతాడని అంతా భావించారు. వార్‌ 2 సినిమాలో ఎన్టీఆర్‌ లుక్‌, ఇతర విషయాలు మోతాదును మించి నెగిటివిటీని చవి చూశాయి. కావాలని కొందరు ఎన్టీఆర్‌ను టార్గెట్‌ చేసే విధంగా ట్రోల్‌ చేస్తున్నారు అని అర్థం అవుతుంది. అందుకే ఎన్టీఆర్‌ హిందీలో నటించవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. తెలుగులో ఆయనకు ఉన్న పాపులారిటీ, స్టార్‌డం నేపథ్యంలో ఆయన సినిమాలు వందల కోట్లు వసూళ్లు నమోదు చేస్తాయి. అంతే కాకుండా పాన్‌ ఇండియా సినిమాలు చేస్తే హిందీ ప్రేక్షకులు కూడా చూస్తారు. కనుక తెలుగులో కాకుండా ఎన్టీఆర్‌ మరే భాషలోనూ నటించవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఎన్టీఆర్‌ ఆలోచన ఏంటి అనేది చూడాలి.