Begin typing your search above and press return to search.

వార్ 2 - మరో సీనియర్ స్టార్ సర్ ప్రైజ్?

వార్ 2లో మరో స్పెషల్ అట్రాక్షన్‌గా అలియా భట్, శర్వారి వాఘ్ లు క్యామియోస్ లో కనిపించబోతున్నారు.

By:  M Prashanth   |   30 July 2025 5:21 PM IST
వార్ 2 - మరో సీనియర్ స్టార్ సర్ ప్రైజ్?
X

ఇండియన్ స్పై యాక్షన్ సినిమాల్లో యశ్ రాజ్ ఫిలింస్ రూపొందిస్తున్న "వార్ 2" బిజినెస్ పరంగా, కాస్టింగ్ పరంగా, ప్రమోషన్ పరంగా ఇండస్ట్రీలోని టాప్ మూవీగా నిలుస్తోంది. హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటీచగా, ఈ ఇద్దరి మధ్య ఫేస్ ఆఫ్‌నే ఈ సినిమా హైలైట్‌గా మారింది. సూపర్ స్టార్ ఎన్టీఆర్ నెగిటివ్ పాత్రలో కనిపించనుండడంతో పాటు, హృతిక్ రోషన్ ఫుల్ పవర్ లో రావడం అభిమానుల్లోనూ, మాస్ ప్రేక్షకుల్లోనూ కొత్త ఎనర్జీ తీసుకొచ్చాయి. కియారా అద్వానీ గ్లామర్ టచ్, హై ఎనర్జీ యాక్షన్ సీన్‌లు టీజర్, ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ తెచ్చాయి. ఇక సినిమాలో ఒక సీనియర్ స్టార్ స్పెషల్ సీక్రెట్ రోల్ చేసినట్లు తెలుస్తోంది.

కెమియోస్.. స్పై యూనివర్స్‌కు కొత్త లింక్

వార్ 2లో మరో స్పెషల్ అట్రాక్షన్‌గా అలియా భట్, శర్వారి వాఘ్ లు క్యామియోస్ లో కనిపించబోతున్నారు. ఇప్పటికే అఫిషియల్‌గా కన్ఫర్మ్ చేయకపోయినా, ఈ ఇద్దరి పాత్రలు వచ్చే స్పై యూనివర్స్ చిత్రమైన "ఆల్ఫా"కి కనెక్ట్ అవుతాయని, స్టోరీకి కొత్త లెవెల్ తీసుకొస్తాయని సమాచారం. ఇదివరకు టైగర్, పఠాన్, కబీర్ పాత్రలు విడివిడిగా పరిచయమయ్యాక, ఇప్పుడు యూనివర్స్‌గా కలిపే ప్రయత్నానికి వార్ 2 వేదిక అవుతుందన్న అంచనాలు స్పష్టంగా ఉన్నాయి.

సీనియర్ స్టార్ స్పెషల్ రోల్

ఈసారి "వార్ 2"లో ఆడియన్స్‌లో ఎక్కువగా చర్చ అవుతున్న విషయం. సీనియర్ స్టార్ అనిల్ కపూర్ పాత్ర. ట్రైలర్ రాయల్‌గా కట్ చేయగా, ఆయన పాత్ర గురించి కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. గత సినిమాల్లో రా చీఫ్‌గా కనిపించిన అశుతోష్ రాణా పాత్రను ఇప్పుడు అనిల్ కపూర్ రిప్లేస్ చేశారన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. అదే సమయంలో, అతను ఓ కొత్త డివిజన్ కి చీఫ్ అయి ఉండొచ్చని, కబీర్ (హృతిక్), విక్రమ్ (ఎన్టీఆర్) లతో కట్టింగ్ ఎడ్జ్ కలిగిన పుల్ ఆఫ్ వార్ చూపించనున్నారని టాక్. మరికొందరు అభిమానులు, అతని పాత్ర ఫుల్ సీక్రెట్ బ్యాక్‌స్టోరీతో, కల్నల్ లూత్రాతో స్పెషల్ కనెక్షన్ ఉంటుందని టాక్ వస్తోంది.

ఫ్యాన్ థియరీలు

ఈసారి కథనంలో ప్రధానంగా అనిల్ కపూర్ పాత్ర చుట్టూ పెద్ద మిస్టరీ నడుస్తోంది. ఆయన రెండు గ్రూపుల మధ్య ఉన్న రహస్యమైన మూడో టీమ్ లీడర్ కావచ్చన్న తర్జనభర్జన వదంతులు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. కియారా అద్వానీ బికినీ సీన్, ఎన్టీఆర్ మోస్ట్ ఇంటెన్స్ విలన్ షేడ్, హృతిక్ రోషన్ స్టైలిష్ యాక్షన్ ఇలా అన్ని కలిపి “వార్ 2”ని ఈ ఏడాది ఇండియన్ సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటిగా నిలిపాయి.

క్యాస్టింగ్ ట్విస్ట్‌లు, వదంతులు, స్పై యూనివర్స్ ఎక్స్‌పాన్షన్ తో "వార్ 2" పై ఆడియన్స్ అంచనాలు రెట్టింపయ్యాయి. అనిల్ కపూర్ పాత్రపై స్పష్టత రావాలంటే సినిమా విడుదల వరకు వేచి చూడాల్సిందే. ఇక సినిమా ఆగస్టు 14న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అదే టైమ్ లో కూలీ కూడా రెడీ అవుతోంది.