Begin typing your search above and press return to search.

వార్ 2, కూలీ.. ఈ సపోర్ట్ ఊహించలేదే..!

ఐతే ఏదైనా స్టార్ సినిమా రిలీజైతే ఎంకరేజ్ మెంట్ కన్నా నెగిటివిటీ ఎక్కువ కనబడుతున్న రోజులు ఇవి. సినిమా ఏమాత్రం తేడాగా ఉన్నా సరే సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు.

By:  Ramesh Boddu   |   16 Aug 2025 3:00 AM IST
వార్ 2, కూలీ.. ఈ సపోర్ట్ ఊహించలేదే..!
X

థియేటర్ లో రెండు భారీ సినిమాల పండగ అటు సినీ వీక్షకులకే కాదు సినీ సెలబ్రిటీస్ కి కూడా జోష్ తెచ్చింది. గురువారం రిలీజైన వార్ 2, కూలీ సినిమాల కోసం ఆడియన్స్ ఎంత ఆసక్తిగా ఉన్నారో సినీ పరిశ్రమలో ఉన్న హీరోలు, దర్శకులు మిగతా వాళ్లు కూడా అంతే ఉత్సాహం చూపించారు. పరిశ్రమ బాగుండాలంటే సినిమాలు ఆడాలి. అలా సినిమాలు ఆడాలంటే ఒకరికొకరు ఎంకరేజ్ మెంట్ చేసుకోవాలి.

ఎంకరేజ్ మెంట్ కన్నా నెగిటివిటీ ఎక్కువ..

ఐతే ఏదైనా స్టార్ సినిమా రిలీజైతే ఎంకరేజ్ మెంట్ కన్నా నెగిటివిటీ ఎక్కువ కనబడుతున్న రోజులు ఇవి. సినిమా ఏమాత్రం తేడాగా ఉన్నా సరే సోషల్ మీడియాలో చీల్చి చెండాడుతున్నారు. ఐతే ఎందుకో ఆ తరహా డిస్ కరేజ్ మెంట్ వార్ 2, కూలీ సినిమాల మీద చూపించట్లేదు.

వార్ 2 విషయానికి వస్తే ఎన్టీఆర్ చేసిన మొదటి హిందీ సినిమా. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది హైలెట్ పాయింట్. వార్ 2 యష్ రాజ్ ఫిలింస్ నుంచి వచ్చిన స్పై యాక్షన్ మూవీ. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశాడు. సినిమాలో ఎన్టీఆర్ ఉన్నాడన్న కొత్త పాయింట్ తప్ప అదే రెగ్యులర్ బాలీవుడ్ స్పై మూవీస్ లానే ఇది వచ్చింది.

ఐతే ఎన్టీఆర్ నటించడం వల్ల తెలుగులో ఈ సినిమాకు విపరీతమైన బజ్ వచ్చింది. తెలుగు రెండు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజైంది కూడా. ఐతే సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.

భారీ తారాగణంతో కూలీ..

ఇక కూలీ విషయానికి వస్తే రజనీకాంత్ తో పాటు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్, సౌబిన్ సాహిర్, సత్యరాజ్ ఇలా భారీ తారాగణంతో నింపేశాడు లోకేష్. అసలే ఖైదీ, విక్రం సినిమాలు తీసిన డైరెక్టర్ కాబాట్టి కూలీ పై భారీ హైప్ ఉంది. కూలీ ఎల్.సి.యు లో భాగం కాదని చెప్పినా సరే లోకేష్ మాటలను ఎవరు నమ్మలేదు.

ఐతే కూలీ కూడా లోకేష్ తన టాలెంట్ ప్రూవ్ చేసుకోలేకపోయాడు. సినిమాకు హైప్ ఎక్కించడంలో సక్సెస్ అయిన లోకేష్ అదే సినిమాను అంచనాలను అందుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యాడు.

రెండు సినిమాలకు బెస్ట్ విషెస్..

ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ రెండు సినిమాలకు తెలుగు పరిశ్రమకు సంబంధించిన చాలామంది బెస్ట్ విషెస్ చెప్పారు. కూలీలో నాగార్జున విలన్ గా నటించినా.. వార్ 2 లో ఎన్టీఆర్ భాగమైనా కూడా రెండు డబ్బింగ్ సినిమాలే అన్న విషయం గుర్తించాలి.

అయినా కూడా డబ్బింగ్ సినిమాలన్న ఆలోచన లేకుండా వార్ 2, కూలీ సినిమాలకు మన సినీ సెలబ్రిటీస్ ల ఎంకరేజ్మెంట్ ఒక రేంజ్ లో ఉండింది. ఇలా ఒకేసారి రిలీజ్ అవుతున్న సినిమాలకు సినీ ప్రముఖుల నుంచి ఈ రేంజ్ సపోర్ట్ రావడం చాలా అరుదు.

కూలీ, వార్ 2 సినిమాలకు ఇది కూడా కలిసి వచ్చే అంశమే.. గురువారం రిలీజైన రెండు సినిమాలు యావరేజ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇండిపెండెన్స్ డే తో పాటు కృష్ణాష్టమి ఆ నెక్స్ట్ సండే సో 4 డేస్ లాంగ్ వీకెండ్ కాబట్టి టాక్ తో సంబంధం లేకుండా వసూళ్లు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది. అదే జరిగితే మాత్రం రెండు సినిమాలు సేఫ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.