Begin typing your search above and press return to search.

వార్-2 తెలుగు వెర్షన్.. ఫస్ట్ వీక్ వసూళ్ల సంగతేంటి?

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే.

By:  M Prashanth   |   21 Aug 2025 3:31 PM IST
వార్-2 తెలుగు వెర్షన్.. ఫస్ట్ వీక్ వసూళ్ల సంగతేంటి?
X

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఆ సినిమాలో తారక్ విక్రమ్ రోల్ లో కనిపించారు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ లీడ్ రోల్ లో నటించగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించారు.

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన వార్-2ను భారీ బడ్జెట్ తో ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా నిర్మించారు. అనిల్ కపూర్, అశుతోష్ రాణా కీలక పాత్రలు నటించిన ఆ మూవీ.. ఆగస్టు 14న రిలీజ్ అయింది. అయితే మూవీపై విడుదలకు ముందు భారీ అంచనాలు క్రియేట్ అవ్వగా.. వాటిని అసలు అందుకోలేకపోయింది.

ఓపెనింగ్స్ తో పాటు తర్వాత రెండు రోజులు వసూళ్లు బాగానే ఉన్నా.. ఆ తర్వాత బాగా తగ్గిపోయాయి. వీక్ డేస్ మొదలయ్యాక షాకింగ్ నెంబర్స్ నమోదయ్యాయి. ఇప్పుడు థియేట్రికల్ ఫస్ట్ వీక్ కంప్లీట్ అవ్వగా.. దాదాపు రూ.155 కోట్లకు పైగా వసూలు చేసినట్లు తెలుస్తోంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో బాగా తక్కువచ్చినట్లు వినికిడి.

తెలుగు రాష్ట్రాల్లో రూ.41 కోట్లు మాత్రం రాబట్టినట్లు తెలుస్తోంది. అయితే మన దగ్గర టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగవంశీ.. వార్-2ను రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. రూ.80 కోట్లకుపైగా వ్యయంతో హక్కులను కొనుగోలు చేసినట్లు సమాచారం. దీంతో మూవీ తెలుగులో రూ. 92 కోట్ల బ్రేక్-ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగినట్లు వినికిడి.

ఆ లెక్కల ప్రకారం చూసుకుంటే.. తెలుగు స్టేట్స్ లో ఇంకా రూ. 50 కోట్లకు పైగా వసూలు చేయాలనే చెప్పాలి. వరల్డ్ వైడ్ గా ఇంకా రూ. 150 కోట్లకు పైగా షేర్ అందుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అది ఎంతవరకు జరుగుతుందో చెప్పలేం. ఎందుకంటే సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది. తెలుగు ఆడియన్స్ కు పెద్దగా నచ్చలేదు.

కాబట్టి రెండో వారంలో థియేట్రికల్ రన్ కాస్త కష్టం గానే సాగుతుంది. ముఖ్యంగా సోమవారం.. దాదాపు అన్ని సెంటర్స్ లో డెఫిసిట్స్ నమోదు అయ్యాయని సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అంటే ప్రదర్శన ఖర్చులు కూడా రాబట్టలేదు. దీంతో సినిమా ఈ వీక్ లో భారీ వసూళ్లు సాధిస్తుందనే చెప్పడం కష్టమే. ఏదేమైనా.. రెండు వారంలో సినిమాకు ఎంత వసూళ్లు వస్తాయో.. బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవుతుందో లేదో వేచి చూడాలి.