Begin typing your search above and press return to search.

కూలీ vs వార్ 2: వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్ షోలు.. యూఎస్ లో పరిస్థితి ఎలా ఉందంటే?

ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో ఈసారి ప్రేక్షకులకు వరుసగా రెండు భారీ సినిమాలు ట్రీట్ ఇవ్వబోతున్నాయి.

By:  M Prashanth   |   8 Aug 2025 1:37 PM IST
కూలీ vs వార్ 2: వరల్డ్ ఫస్ట్ ప్రీమియర్ షోలు.. యూఎస్ లో పరిస్థితి ఎలా ఉందంటే?
X

తెలుగు సినిమాల స్థాయి ప్రతీ ఏడాది మరో లెవెల్ కు పెరుగుతోంది. ఇండియన్ టాప్ సినిమా లెవెల్లో, టాలీవుడ్ సినిమాల కోసం అమెరికాలో ప్రత్యేక ప్రీమియర్ షోలను ప్లాన్ చేయడం చాలా కాలంగా వస్తున్న ఆనవాయితీ. ముఖ్యంగా ఇండిపెండెన్స్ డే వీకెండ్‌లో ఈసారి ప్రేక్షకులకు వరుసగా రెండు భారీ సినిమాలు ట్రీట్ ఇవ్వబోతున్నాయి. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలయికలో వచ్చిన వార్ 2, రజనీకాంత్ లోకేష్ కనగరాజ్ కాంబోలో వస్తున్న కూలీ.. రెండూ ఒకే రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుండటంతో టికెట్ బుకింగ్స్, ప్రీ సెల్స్ పై ఫోకస్ పెరిగింది.

ప్రీమియర్ షో టైమింగ్స్

ఈసారి వరల్డ్ వైడ్ లెవెల్లో ప్రీమియర్ షోలు కూడా సూపర్ స్పెషల్‌గా ప్లాన్ చేశారు. ఇండియాలోనే ప్రథమంగా తెల్లవారుజామున 3 గంటలకు వార్ 2, 4 గంటలకు కూలీ ప్రీమియర్ షోలు జరగనున్నాయి. అంటే ఓ సినిమా తర్వాత వెంటనే ఇంకొక బిగ్ మూవీ చూసే అవకాశం తెలుగు ఆడియెన్స్ కు దొరికింది. ఇదంతా ఇండస్ట్రీ రేంజ్ ఎక్కడికి వెళ్ళిందో చూపిస్తోంది. ఇక ఈ టైమింగ్స్ వల్లే మరింత హైప్ పెరిగింది. రెండు సినిమాలూ ఒకే రోజు, దాదాపు గంటలోపే మొదలు కావడం ఇప్పుడు హాట్ టాపిక్.

అమెరికా మార్కెట్

ప్రస్తుతం అమెరికాలో ప్రీమియర్ షోలకు 6 రోజుల ముందు వున్న బుకింగ్స్‌ ఫిగర్స్ చూస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేం. కూలీ ఇప్పటికే $297K మార్క్ దాటగా, వార్ 2 అయితే $216K వద్ద ఆగిపోయింది. ఎన్టీఆర్‌కు అక్కడ పెద్ద మార్కెట్ ఉంది. మరోవైపు, రజనీకాంత్‌కు దక్షిణాది ఇమేజ్, లోకేష్ కనగరాజ్ క్రేజ్ కలిసిరావడంతో కూలీకి మరింత బజ్ వచ్చేసింది. ప్రస్తుతానికి, కూలీ తెలుగు వెర్షన్ వార్ 2ని బీట్ చేస్తోంది. దీనిపై ట్రేడ్ వర్గాల్లో చర్చలు జోరుగా సాగుతున్నాయి.

ప్రేక్షకుల అంచనాలు.. ఎందుకింత తేడా?

వార్ 2 ఎన్టీఆర్ స్పై యాక్షన్ ఎలిమెంట్స్‌తో పాన్ ఇండియా స్థాయిలో భారీ హైప్ క్రియేట్ చేసింది. ఇక హృతిక్ రోషన్, కియారా అద్వాణీ వంటి స్టార్ కాస్టింగ్ సినిమా స్పెషల్ అట్రాక్షన్. మరోవైపు కూలీ పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినందున, రజనీ అభిమానులకు స్పెషల్ ఫీస్ట్. ఇక్కడ రెండు సినిమాలకు తేడా వస్తున్నది ప్రచారంలోనే. కూలీ ప్రమోషన్స్, లీక్స్, ట్రైలర్ లెవెల్‌లో విపరీతమైన హైప్ ఉంది. వార్ 2 ప్రమోషన్స్ అనుకున్నంత స్ట్రాంగ్ గా జరగకపోవడం వలనే ప్రీమియర్ బుకింగ్స్ లో తేడా కనిపిస్తోంది.

ఈసారి ఎవరు విన్నర్?

ఫైనల్‌గా చూస్తే.. కూలీ ప్రస్తుతం లీడ్‌లో ఉన్నా, సినిమా రిలీజ్ రోజు వరకు మరో మూడు నాలుగు లక్షల డాలర్లు పెరిగే అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం ఉంది. వార్ 2 కూడా విడుదల సమయానికి ఫుల్ హైప్ అందుకుంటే, బుకింగ్స్ పుంజుకునే ఛాన్స్ ఉంది. ఎన్టీఆర్ మాస్ ఫాలోయింగ్ వల్ల తెలుగు వెర్షన్‌కు మెరుగైన వసూళ్లు వచ్చే అవకాశం లేకపోలేదు. కానీ ప్రస్తుత ట్రెండ్‌లో కూలీ ముందంజలో ఉంది. ఈ రెండు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్స్ పరంగా ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాయో వేచి చూడాలి.