Begin typing your search above and press return to search.

యశ్ రాజ్ ఫిల్మ్స్ మాస్టర్ ప్లాన్! వార్ 2 డిజిటల్ స్ట్రాటజీ హాట్ టాపిక్

భారతదేశంలో ఇప్పటికే ఓటీటీ రిలీజ్ ద్వారా పెద్ద ఎత్తున ఆడియన్స్‌కు చేరుకున్న ఈ సినిమా, విదేశీ మార్కెట్లలో కొత్తగా రెవెన్యూ సాధించాలనే ఉద్దేశంతో TVOD మోడల్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

By:  Sravani Lakshmi Srungarapu   |   17 April 2026 1:00 AM IST
యశ్ రాజ్ ఫిల్మ్స్ మాస్టర్ ప్లాన్! వార్ 2 డిజిటల్ స్ట్రాటజీ హాట్ టాపిక్
X

బాలీవుడ్‌లో భారీ అంచనాల మధ్య విడుదలైన వార్2, థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయినా, ఇప్పుడు డిజిటల్ స్పేస్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే దశలోకి ప్రవేశించింది. మొదట థియేట్రికల్ రన్ తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు ట్రాన్సాక్ష‌నల్ వీడియో ఆన్ డిమాండ్ (TVOD) మోడల్ ద్వారా గూగుల్ టీవీ, యాపిల్ టీవీ వంటి ప్లాట్‌ఫార్మ్‌లలో ఇండియా, ఫ్రాన్స్ మినహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రావడం ఆసక్తికర పరిణామంగా మారింది. థియేటర్లలో మెప్పించ‌లేక‌పోయిన వార్2 ఇప్పుడు ఈ రూపంలో అయినా మెప్పిస్తుందా అనేది చ‌ర్చ‌గా మారింది.

డిమాండ్ ను క్యాష్ చేసుకోవ‌డానికే!

ఈ నిర్ణయం వెనుక గ్లోబల్ మార్కెట్‌పై స్పష్టమైన ఫోకస్ కనిపిస్తోంది. భారతదేశంలో ఇప్పటికే ఓటీటీ రిలీజ్ ద్వారా పెద్ద ఎత్తున ఆడియన్స్‌కు చేరుకున్న ఈ సినిమా, విదేశీ మార్కెట్లలో కొత్తగా రెవెన్యూ సాధించాలనే ఉద్దేశంతో TVOD మోడల్‌ను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా యశ్ రాజ్ ఫిలిమ్స్ వంటి పెద్ద బ్యానర్, తమ స్పై యూనివర్స్ సినిమాలకు ఉన్న అంతర్జాతీయ డిమాండ్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తోంది. థియేటర్లలో ఆశించిన రేంజ్ రాకపోయినా, డిజిటల్ మార్కెట్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయన్న నమ్మకం ఈ స్ట్రాటజీలో ప్రతిఫలిస్తోంది.

ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన సినిమా మళ్లీ పెయిడ్ మోడల్‌లో విడుదల కావడం కూడా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్‌గా మారుతోంది. సాధారణంగా ఓటీటీ రిలీజ్ తర్వాత సినిమాల లైఫ్‌సైకిల్ ముగిసిపోయినట్టే భావించేవారు. కానీ ఇప్పుడు TVOD ద్వారా మరో రెవెన్యూ స్ట్రీమ్ క్రియేట్ చేయడం, భవిష్యత్తులో మరిన్ని సినిమాలు అనుసరించే మోడల్‌గా మారే అవకాశం ఉంది.

కంటెంట్ పరంగా చూస్తే, వార్ 2కు ఆశించిన రెస్పాన్స్ రాని విష‌యం తెలిసిందే. ఓ వైపు కథనం, ఎమోషన్‌పై విమర్శలు వచ్చినా, మరోవైపు కొన్ని యాక్షన్ సీక్వెన్స్‌లు, విజువల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కొన్ని సీన్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం, వాటిని డిజిటల్ ప్రమోషన్‌లో హైలైట్ చేయడం ద్వారా కొత్త ఆడియన్స్‌ను ఆకర్షించే ప్రయత్నం జరుగుతోంది. థియేటర్లలో మిస్ అయిన ఎంగేజ్‌మెంట్, ఇప్పుడు చిన్న స్క్రీన్‌పై వర్క్ అవుతుందా అన్నది కీలకం. ఇక బిజినెస్ యాంగిల్ లో చూస్తే, థియేట్రికల్ రన్‌లో తగ్గిన కలెక్షన్స్‌ను TVOD ద్వారా కొంతవరకు రికవర్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రతి వ్యూ, ప్రతి రెంటల్ కూడా నేరుగా రెవెన్యూగా మారే ఈ మోడల్, భారీ బడ్జెట్ సినిమాలకు సేఫ్టీ నెట్‌గా మారవచ్చు. ముఖ్యంగా గ్లోబల్ ఆడియన్స్‌ను టార్గెట్ చేయడం ద్వారా, మార్కెట్ విస్తరణ సాధ్యమవుతుంది.

డిజిటల్ డేటా కూడా ఇక్కడ కీలక పాత్ర పోషించనుంది. ఏ దేశాల్లో ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది? ఎన్ని రెంటల్స్ వస్తాయి? ఏ సీన్స్ ను ఎక్కువగా చూస్తున్నారు లాంటి డేటా ఆధారంగా ఫ్యూచ‌ర్ ప్రాజెక్ట్‌ల ప్లానింగ్ చేయడం సులభమవుతుంది. మొత్తంగా చూస్తే, థియేటర్లలో మిస్ అయిన వార్ 2, డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌లలో హిట్‌గా నిలుస్తుందా లేదా అన్నది మాత్రమే కాకుండా, ఇండియన్ సినిమా బిజినెస్ మోడల్ మార్పుకు ఇది ఒక టెస్ట్ కేస్‌గా నిలవనుంది.