వార్ 2 ట్రైలర్ వ్యూవ్స్.. టాప్ 10లో కూడా లేదు
ఓ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుందంటే అందరి కళ్లు ట్రైలర్ పైనే ఉంటాయి. ఎందుకంటే ట్రైలర్ చూస్తే సినిమాపై ఓ అవగాహన వస్తుందని అభిప్రాయం.
By: Tupaki Desk | 26 July 2025 12:32 PM ISTఓ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుందంటే అందరి కళ్లు ట్రైలర్ పైనే ఉంటాయి. ఎందుకంటే ట్రైలర్ చూస్తే సినిమాపై ఓ అవగాహన వస్తుందని అభిప్రాయం. అటు మేకర్స్ కూడా సినిమాపై హైప్ పెంచేందుకు ట్రైలర్ కటింగ్ పై ప్రత్యేక దృష్టి పెడతారు. అభిమానులకే కాదు, సినీ ప్రియులందరినీ ఆకర్షించేలా, సినిమాపై అంచనాలు పెంచేలా ట్రైలర్ డిజైన్ చేస్తారు.
అయితే మాస్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లేటేస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ వార్ 2 సినిమా ఆగస్టు 14 విడుదల కానుంది. ఈ క్రమంలోనే మేకర్స్ శుక్రవారం ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ భారీ యాక్షన్ సీక్వెన్స్, హై క్వాలిటీ గ్రాఫిక్స్ తో గ్రాండ్ గా ఉంది. ఇది నిన్న తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ అయ్యింది.
సినిమాలో తారక్- హృతిక్ మధ్య యాక్షన్ ఓ రేంజ్ లో ఉండనుందో ట్రైలర్ తో షాంపిల్ చూపించారు. హీరోయిన్ కియారా అద్వానీ కూడా ట్రైలర్ లో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. హృతిక్, కియారా మధ్య రొమాంటిక్ సీన్స్, తారక్ యాక్షన్ సీక్వెల్స్ అదిరిపోయాయి. ఫ్యాన్స్ కు ఇది తెగ నచ్చేసింది. దీంతో యూట్యూబ్ లో వార్ 2 ట్రైలర్ ట్రెండిగ్ లోకి దూసుకొచ్చింది. గడిచిన 24 గంటల్లో ఈ సినిమా ట్రైలర్ కు 54.71 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సాధారణంగా ఓ సినిమా ట్రైలర్ కు ఈ రేంజ్ వ్యూస్ రావడం అంటే ఎక్కువే.
కానీ, ఇక్కడ ఎన్టీఆర్, హృతిక్ లాంటి స్టార్లు ఉన్న సినిమాకు మాత్రం ఓ రకంగా ఇది తక్కువ బజ్ అనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇండియన్ సినిమా హిస్టరీలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన ట్రైలర్ ల లిస్ట్ లో ఈ సినిమా టాప్ 10లో కూడా చోటు దక్కించుకోలేకపోయింది. ఈ జాబితాలో రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ పార్ట్ 1 ట్రైలర్ 113.2 మిలియన్ వ్యూస్ తో టాప్ 1 ప్లేస్ లో కొనసాగుతోంది. మరి 24 గంటల్లో అత్యధిక వ్యూస్ సాధించిన టాప్ 15 ట్రైలర్లు ఎవో చూద్దాం
సలార్ - 113.2 మిలియన్
కేజీఎఫ్ 2- 106.5 మిలియన్
పుష్ప 2- 104.2 మిలియన్
ఆదిపురుష్ - 74 మిలియన్
సలార్ (రిలీజ్ ట్రైలర్)- 72.2 మిలియన్
యానిమల్ - 71.4 మిలియన్
గేమ్ ఛేంజర్ -62 మిలియన్
హరిహర వీరమల్లు - 59.44 మిలియన్
డంకీ- 58.5 మిలియన్
స్కై ఫోర్స్- 57.7 మిలియన్
రాధే శ్యామ్ - 57.5 మిలియన్
జవాన్ (టీజర్ ప్రివ్యూ) - 55 మిలియన్
వార్ 2- 54.71 మిలియన్
సింగమ్ అగైన్ - 57.95 మిలియన్
ఆర్ఆర్ఆర్- 51.1 మిలియన్
