వార్ 2 నుంచీ సాంగ్ టీజర్ రిలీజ్.. ఎలా ఉందంటే?
దీనికి తోడు సినిమాపై అంచనాలు పెంచడానికి అటు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ అధినేత ఆదిత్య చోప్రా కూడా భారీగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 7 Aug 2025 11:50 AM ISTటాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ తొలిసారి బాలీవుడ్ సినీ రంగ ప్రవేశం చేస్తూ.. చేస్తున్న సినిమా వార్ 2. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కథానాయకగా, కియారా అద్వానీ కథానాయికగా వస్తున్న చిత్రం ఇది. వార్ మూవీకి కొనసాగింపుగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పుడు సౌత్ లో కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎందుకంటే ఇందులో ఎన్టీఆర్ నటించడమే దీనికి ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఇది బాలీవుడ్ చిత్రం అయినా తెలుగు,తమిళ్ భాషలలో పాన్ ఇండియాగా ఆగస్టు 14 వ తేదీన విడుదల కాబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ - హృతిక్ రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ తెరపై చూడాలి అని అభిమానులు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
దీనికి తోడు సినిమాపై అంచనాలు పెంచడానికి అటు యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ అధినేత ఆదిత్య చోప్రా కూడా భారీగా ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ఈ సినిమాలో ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ మధ్య అద్భుతమైన డాన్స్ నెంబర్ ఉందని, సినిమా విడుదలకు ముందు నేరుగా పాటను విడుదల చేయకుండా.. సాంగ్ టీజర్ ను మాత్రమే రిలీజ్ చేసి, మొత్తం పాటను థియేటర్లలో రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు అందుకు తగ్గట్టుగానే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా 'జనాబ్ ఈ అలీ' సాంగ్ టీజర్ ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేయడం జరిగింది.
వాస్తవానికి కూలీ సినిమాతో పోల్చుకుంటే.. ఈ సినిమాకి పెద్దగా బజ్ లేదు. అటు ప్రమోషన్స్ కూడా పెద్దగా చేపట్టడం లేదు. కేవలం ట్రైలర్, టీజర్, సాంగ్ టీజర్ తోనే అంచనాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో ఆడియన్స్ నుంచి కూడా పెద్దగా రెస్పాన్స్ లభించడం లేదు. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలకు సంబంధించిన సాంగ్ టీజర్ ను రిలీజ్ చేశారు కనీసం ఏదైనా సినిమా పై అంచనాలు పెంచుతుందేమో చూడాలి.
వార్ 2 చిత్ర విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో యష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఆగస్టు 14వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా మరొకవైపు ఈ సినిమాకి పోటీగా అదే రోజు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇందులో శృతిహాసన్, నాగార్జున, ఉపేంద్ర తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా అటు కూలీ సినిమాపై కూడా అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో విడుదల కాబోతోంది.
