వార్ 2 : ఆ హీరోయిన్ ఫ్యాన్స్ నెగిటివ్ ట్రోల్స్
ఇప్పుడు వార్ 2 సినిమాలో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీ యొక్క బికినీ లుక్ పై విమర్శలు వస్తున్నాయి.
By: Ramesh Palla | 1 Aug 2025 11:00 PM ISTహృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన 'వార్ 2' సినిమా మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 14న విడుదల కాబోతున్న వార్ 2 పై ఒక వైపు మేకర్స్ అంచనాలు పెంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటే కొందరు మాత్రం ఈ సినిమాను ఏదో ఒక పాయింట్ పట్టుకుని ట్రోల్ చేస్తూ, క్రేజ్ తగ్గించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన టీజర్ తీవ్రమైన నెగిటివిటీ చవిచూసింది. ఆ టీజర్ అంతటి నెగిటివిటీ కి అర్హం కాదు. అయినా కూడా కొందరు పనిగట్టుకుని మరీ తప్పుడు ప్రచారం చేశారు అనేది ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాదన. ఆ నెగిటివిటీ నుంచి బయట పడే విధంగా ట్రైలర్ ఆకట్టుకుంది. ట్రైలర్ పాజిటివ్ టాక్ దక్కించుకున్నప్పటికీ కొందరు నెగటివ్ ప్రచారం చేసే ప్రయత్నం చేసినా వారి పాచిక పారలేదు అనేది యూనిట్ సభ్యుల వాదన.
వార్ 2 లో కియారా అద్వానీ బికినీ షో
ఇప్పుడు వార్ 2 సినిమాలో హీరోయిన్‌గా నటించిన కియారా అద్వానీ యొక్క బికినీ లుక్ పై విమర్శలు వస్తున్నాయి. కియారా అద్వానీ బికినీ లుక్ ను సీజీ లో క్రియేట్ చేశారు అంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. గతంలో దీపికా పదుకునే బేషరమ్ పాటలో బికినీ లుక్‌లో కనిపించిన విషయం తెల్సిందే. ఇప్పటి వరకు బికినీలో అంతకు మించి ఎవరూ అందంగా లేరు అనేది దీపికా పదుకునే ఫ్యాన్స్ అభిప్రాయం. ఇటీవల కియారా అద్వానీ బికినీ లుక్ అంతకు మించి ఉందని సోషల్ మీడియాలో కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో సోషల్ మీడియాలో కియారా ఫ్యాన్స్ వర్సెస్ దీపికా ఫ్యాన్స్ అన్నట్లుగా పరిస్థితి మారింది. తమది పై చేయి అని చెప్పుకోవడం కోసం దీపికా పదుకునే అభిమానులు కొందరు కియారా అద్వానీ బికినీ లుక్ సీజీలో క్రియేట్ చేశారంటూ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో వార్ 2 పై రచ్చ
గ్రాఫిక్స్‌తో కియారా అద్వానీ బికినీ లుక్‌ను మరింత అందంగా కనిపించేలా చేశారని, కియారా యొక్క ఫిజిక్‌ను సీజీతో ఎడిట్ చేసినట్లుగా అనిపిస్తుందని సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ కారణంగా వార్ 2 పై మరోసారి నెగిటివిటీ మొదలైంది. యాక్షన్ సీక్వెన్స్‌లో గ్రాఫిక్స్ వాడటం ఓకే కానీ ఇలా బికినీలో హీరోయిన్‌ను అందంగా చూపించడంకు కూడా గ్రాఫిక్స్ వాడుతారా అంటూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే వార్ 2 సినిమా విషయంలో చాలా నెగిటివిటీ ఉంది. దాన్ని తొలగించుకుంటూ మేకర్స్ వస్తున్నారు. ఈ సమయంలో హీరోయిన్ బికినీ గురించి ఇలాంటి ప్రచారం జరగడంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఎన్టీఆర్ మొదటి హిందీ సినిమా
ఆవన్ జవాన్ పాటలో కియారా అద్వానీ టూ పీస్ బికినీలో కనిపించి వార్ 2 పై మరింతగా అంచనాలు పెరిగేలా చేసింది. చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా దీపికా పదుకునే పేరును చెప్పకున్నా చాలా మంది బాహాటంగానే దీపికా పదుకునే ఫ్యాన్స్ ఈ నెగిటివిటీ ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. ఈ ప్రచారంకు దీపికా పదుకునేకి సంబంధం లేకపోయి ఉండవచ్చు. కానీ ఆమె ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఈ ప్రచారం చేస్తూ ఉండవచ్చు అనేది కొందరి విశ్లేషణ.
మొత్తానికి వార్ 2 సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న సమయంలో ఇలాంటి నెగిటివ్ ప్రచారం వల్ల ఖచ్చితంగా కొంతలో కొంత అయినా కలెక్షన్స్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ నెగిటివిటీని తగ్గించే విధంగా మేకర్స్ పాజిటివ్‌గా మార్చేందుకు గాను ప్రచారం చేయాల్సి ఉంది. ఎన్టీఆర్ నటించిన కారణంగా తెలుగులో భారీ ఎత్తున వార్ 2 విడుదల చేయబోతున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ ఈ సినిమాను భారీ మొత్తానికి కొనుగోలు చేశారని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన భారీ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించబోతున్నారు. ఇది ఎన్టీఆర్‌కి మొదటి హిందీ సినిమా కావడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.