Begin typing your search above and press return to search.

వార్ 2 లో మరో స్టార్.. థియేటర్ లో సర్ ప్రైజ్..?

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

By:  Ramesh Boddu   |   11 Aug 2025 12:34 PM IST
వార్ 2 లో మరో స్టార్.. థియేటర్ లో సర్ ప్రైజ్..?
X

ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటించిన వార్ 2 సినిమా మరో 3 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాను యష్ రాజ్ ఫిలింస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా క్రేజీగా అనిపించింది. ఐతే సినిమాలో చాలా సర్ ప్రైజ్ లు ఉన్నాయని నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ అన్నాడు.

అసలు బొమ్మ థియేటర్ లో..

సినిమా గురించి మీరు ఇప్పటి వరకు చూసినదంతా శాంపిల్ మాత్రమే అసలు బొమ్మ థియేటర్ లో చూస్తారన్నట్టుగా చెప్పాడు. ఐతే లేటెస్ట్ గా వార్ 2లో హృతిక్, ఎన్టీఆర్ మాత్రమే కాదు మరో స్టార్ కూడా ఉంటాడట. అది ఎవరో కాదు యానిమల్ విలన్ అని తెలుస్తుంది. యానిమల్ విలన్ బాబీ డియోల్ కూడా వార్ 2 లో క్యామియో రోల్ చేశారట. ఆ సీన్స్ చాలా బాగా వచ్చాయని బాబీ ని థియేటర్ లో చూసిన ఆడియన్స్ సర్ ప్రైజ్ అవుతారని అంటున్నారు.

యానిమల్ ముందు వరకు బాబీ డియోల్ కి అవకాశాలు లేక చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాడు. కానీ యానిమల్ తర్వాత బాబీ సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అక్కడ ఇక్కడ అదరగొడుతున్నాడు. వార్ 2 సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ మాత్రమే కాదు బాబీ కూడా సర్ ప్రైజ్ చేస్తాడట. యస్ రాజ్ ఫిలింస్ లో తర్వాత సినిమాల్లో అతనే మెయిన్ విలన్ గా చేసే ప్లాన్ ఉందట. అందులో భాగంగానే వార్ 2 లో అతని అప్పియరెన్స్ ఉంటుందని తెలుస్తుంది.

తెలుగులో సూపర్ బజ్..

వార్ 2 సినిమాపై అంచనాలు ఎన్ని ఉన్నాయో దానికి మించి సినిమా ఉంటుందని అంటున్నారు. 3 రోజుల్లో రిలీజ్ అవబోతున్న వార్ 2 సినిమాపై తెలుగులో సూపర్ బజ్ ఉంది. దేవర తర్వాత ఎన్ టీ ఆర్ నుంచి వస్తున్న సినిమా అవ్వడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మరి వార్ 2 ఎన్ టీ ఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఎంత గ్రాండ్ ఓపెనింగ్స్ తెస్తుంది అన్నది చూడాలి. ఈ సినిమాను తెలుగులో నాగ వంశీ రిలీజ్ చేస్తున్నాడు.